DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందనయాత్రలో ప్రోటోకాల్ నిర్లక్ష్యంపై సింహాచలం ఈఓ సూర్యకళకి మెమో 

*అర్హతలేని వాళ్లకి పూర్ణకుంభ స్వాగతం పలకడమే ఈఓ చేసే తప్పిదం*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 07, 2022 (డిఎన్ఎస్):* అత్యంత శక్తివంతుడైన శ్రీ సింహాచల క్షేత్ర  శ్రీ వరాహ లక్ష్మి నృసింహుని పట్ల అపచారం చేస్తే ఫలితం వెంటనే చూపిస్తాడు అన్న పెద్దల హెచ్చరికలకు నేడు

ప్రత్యక్ష నిదర్శనం కనపడుతోంది. ఆలయంలో జరిగిన అపచారానికి ఫలితంగా సింహాచల దేవాలయ ఈఓ ఎంవి సూర్యకళ కు విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లిఖార్జున మెమో ఇచ్చారు. ఉత్సవాల్లో ఆమె పూర్తి నిలక్ష్యంగా ఉన్నారు అన్నది అభియోగం. ఈ ఫిర్యాదు చేసిన వారు సాక్షాతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి కావడం గమనార్హం. 

నాలుగు రోజుల

క్రితం సింహాచల క్షేత్రంలో జరిగిన చందన యాత్ర వేడుకల్లో ఇబ్బడి ముబ్బడిగా అధికార పార్టీ సభ్యులను, ట్రస్ట్ బోర్డు అనుచరులకు గర్భాలయ ప్రవేశం కల్పించడంతో ఒకరు మూల విరాట్ ను మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేసారు. ఇది చాలా అపచారం. దీనిపై ఈఓ కనీసం స్పందించక పోగా ఇదేమీ పెద్ద తప్పు కాదు అన్నట్టుగా

వ్యవహరించారు. అయితే దీని చాలా పెద్ద అపచారం గా భావించిన స్వామి, ఆమెకు దీని ఫలితాన్ని చవి చూపించాడు. 

ఈఓ గా భాద్యతలు చేపట్టిన తర్వాత అర్హత లేని వాళ్ళకి, అవసరం లేని వాళ్లందరికీ పూర్ణకుంభ స్వాగతం పలకడమే ఆమె చేసే పెద్ద తప్పిదంగా ఆగమ సాంప్రదాయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఇలాంటి వివాదాలనే ఆమె

ఎదుర్కొన్నారు. 

ఈ వేడుకల్లో ఆమె ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు, మీడియా పై పూర్తి ఆంక్షలు విధించిన ఈఓ ట్రస్ట్ బోర్డు సభ్యులకు నిబంధనలు పూర్తి మద్దతు ప్రకటించారు. 

చందన యాత్ర రోజున సింహగిరి కి స్వామి దర్శనం కోసం వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహం కు చందనోత్సవంలో ఎటువంటి ప్రోటోకాల్

పాటించకపోగా, కనీసం పట్టించుకునే నాధుడే లేకపోవడంతో అయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఫిర్యాదు పై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి  దీనిపై వివరణ ఇవ్వాలని, ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ కు, ఆర్ డి ఓ కు, ఛార్జ్ మెమో ఇవ్వడం జరిగింది. 

వీరితో పాటు సింహాచలం ఆలయంలోని మరో ఇద్దరు  అధికారులపై చర్యలకు ఆదేశాలు

జారీ చేయడం జరిగింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam