DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ బ్రాహ్మణ కార్పొ చైర్మన్ కు విశాఖ కార్పొరేటర్ల హెచ్చరిక 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, మే 12, 2022 (డిఎన్ఎస్):* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో పార్టీ క్యాడర్ కు మాయమాటలు చెప్పి పార్టీలో ఐకమత్యాన్ని చెడగొడితే చూస్తూ ఊరుకోమని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కు జీవీఎంసీ కార్పొరేటర్ లు విల్లూరి భాస్కరరావు, సాదిక్, బిపిన్ జైన్ లు

హెచ్చరిక జారీ చేసారు. బుధవారం విల్లూరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ లు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజక వర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులను వెంట తిప్పుకుంటూ 2024 ఎన్నికల్లో ఎమ్ఎల్ఏ  సీటు తనదేనంటూ క్యాడర్ ను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.  ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా సక్రమంగా

విధులు నిర్వహించి బ్రాహ్మణులకు న్యాయం చెయ్యాలని హితవు పలికారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పటి వరకు ఎంతమంది బ్రాహ్మణులకు సహాయమందించారో చెప్పాలని ప్రశ్నించారు. 

పార్టీ క్యాడర్ లో విభేదాలు సృష్టించి, ప్రలోభాలకు గురిచేసి గ్రూపులు తయారుచేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడనుంచో వచ్చి దక్షిణ నియోజక

వర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. 
సుధాకర్ వ్యవహాశైలిపై పార్టీ అధిష్టానానికి పిర్యాదుచేస్తామని తెలిపారు. అధిష్టానం అనుమతి లేకుండా  నియోజకవర్గంలో పర్యటిస్తే  తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. 
దక్షిణ నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు సుధాకర్ మాయమాటలు నమ్మి పార్టీకి

అన్యాయం చెయ్యవద్దని విల్లూరి, సాదిక్, జైన్ లు కోరారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నాటి నుంచి అష్టకష్టాలు పడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకులు, కార్యకర్తలు సుధాకర్ వ్యవహారశైలిపై తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. నియోజక వర్గంలో నాయకులు ఎంతోమంది ఉన్నారని వలస నాయకులు

ఆవరసరంలేదన్నారు.అవకాశమిస్తే తాము కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ  చెయ్యడానికి సిద్ధమని ప్రకటించారు.

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడం గమనార్హం. గతంలో ఇదే స్థానం తో అనుబంధం ఉన్న నియోజక వర్గం (2009 
 కంటే ముందు ఈ స్థానం విశాఖపట్నం 1 గా ఉండేది) నుంచి

ద్రోణంరాజు  సత్యనారాయణ,  ద్రోణంరాజు  శ్రీనివాస్, తదితరులు గెలుపొందారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam