DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ దేవాదాయ శాఖకు హిందూ ధార్మిక ఉద్ధారక పురస్కారం ఇవ్వాలి

*ఏపీ భాజపా ధార్మిక కమిటీ సభ్యులు విజయ్ శంకర్ ఫణి సూచన* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 15, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలను మాత్రమే ఉద్ధరిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖా కు హిందూ ధార్మిక ఉద్ధారక పురస్కారం ఇచ్చి సముచిత రీతిన సత్కరించాల్సిన అవసరం

ఎంతైనా ఉందని ఏపీ భారతీయ జనతా పార్టీ ధార్మిక కమిటీ సభ్యులు విజయ్ శంకర్ ఫణి భావిస్తున్నారు. గతం లో రాజుల పరిపాలన లో సైతం హిందూ దేవాలయాలు ఇంతగా ఉద్దరించబడినట్టు ఆధారాలు ఎక్కడా లేవు. దేవాలయాలు సమాజానికి ఎలా ఉపయోగ పడతాయి అనే విషయం దేవాదాయ శాఖా కి తెలిసినట్టుగా గతంలో రాజులకు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదని

తెలియచేస్తున్నారు. 
కాకినాడ జిల్లా అన్నవరం లోని శ్రీ వీరవెంటక సత్యనారాయ స్వామి ఆలయంలో స్వామి వారి ఊరేగింపు  ముందు అశ్లీల నృత్యాలు చేస్తూ, సినిమా పాటలు పెట్టడాన్ని ఆయన ఖండించారు. 

దీనికి కొన్ని దృష్ఠ్యంతలు వివరించారు. 

1 . దేవాలయాల నిర్వహణకు గతంలో రాజులు కోట్లాదిగా నగదు  నిధులు

ఇచ్చేవారు, ఇప్పుడు దేవాదాయ శాఖా వారు గుళ్లకు నిధులు ఇవ్వడం లేదు సరికదా, గుళ్ళలోని  హుండీల నుంచి భక్తులు వేసిన ముడుపులు, కానుకలు తమ ఖజానాలకు తరలించుకు పోతున్నారు.    

2 . రాజులూ దేవాలయాలకు లక్షలాదిగా భూములు విరాళంగా ధారాదత్తం ఇస్తే. . . ఈ శాఖవారు ఇతరులు, భూస్వాహారాయుళ్లు ఈ భూములను దోచుకుతింటుంటే

కళ్లప్పగించి చూస్తున్నారు.   

3 . రాజులు దేవాలయాన్ని ఎంతో ఆదర్శంగా చూస్తే, నేడు ఈ శాఖా వారు ఆదాయవనరు గానే  చూస్తున్నారు.

4 . రాజుల కాలంలో దేవాలయాలకు విరాళాలు స్వచ్చందంగా ఇస్తే. . . నేడు ఈ శాఖా వారు బలవంతంగా కానుకలు హుండీల్లో వేసేలా ప్రేరేపిస్తున్నారు. 

5 . రాజుల కాలంలో సంగీత, సాహిత్య, సభలు,

స్వామి ఊరేగింపులు ముందు సంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తే. . .నేటి దేవాదాయ శాఖా నిర్వహణలో చెత్త సినిమా పాటలకు విచ్చలవిడి అశ్లీల శృంగార నృత్యాలు చేస్తూ. . ఆలయాల ప్రతిష్టను చరిత్ర పుటల్లోకి ఎక్కించేసారు. 

6 . రాజుల కాలంలో దేవాలయ నిర్వహణలో తప్పులు జరిగినా, ఎవరిపైనేనా చిన్న ఆరోపణలు వచ్చినా దేశ బహిష్కరణ, మరణదండన

విధించేవారు. అదే నేటి దేవాదాయ శాఖా నిర్వహణలో దేవాలయాల్లో తప్పులు చేస్తూ వీడియో రికార్డింగ్ ల్లో దొరికిన వాళ్ళకి, దేవుని పేరుతొ కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను అక్రమంగా సంపాదించినా వారికీ పదోన్నతులు, భారీ నగదు పురస్కారాలు, నజరానాలు, అందించే ఇలాంటి మహోన్నత పరిపాలన ఇంకెక్కడా లేనందున ఈ శాఖా వారికి హిందు ఉద్ధారక

పురస్కారాన్ని అందించవలసి ఉందని సూచిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam