DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవంతి పై విశాఖ పోలిసి సిపి  బ్రాహ్మణా సంఘాలు ఫిర్యాదు 

*బ్రాహ్మణులంటే అంత లోకువగా ఉన్నారా?: బ్రాహ్మణా సంఘాలు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 20, 2022 (డిఎన్ఎస్):* మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పై బ్రాహ్మణా సంఘాల ప్రతినిధులు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. నగర సీపీ కార్యాలయం

ఫిర్యాదు ను స్వీకరించి, రశీదును కూడా ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే. . ఈ నెల 16 వ తేదీన భీమిలి మండలం కోరాడ గ్రామం లో జరిగిన గడపగడపకు కార్యక్రమం లో అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అదే సభను కవరేజ్ చెయ్యడానికి టివి 5 విలేకరి ఆకెళ్ళ గణేష్ ( బ్రాహ్మణుడు ) వెళ్లడం జరిగింది. గత కొంత కాలం నుంచి ఈ టీవీ ఛానెల్ పై కోపం తో ఉన్న

అవంతి. . .ఈ విలేకరి ని చూడగానే అగ్గిమీద గుగ్గిలం అయ్యి, ఒరేయ్ పంతులూ.. నీ అంతు తేలుస్తా. . .అంటూ నోటికి వచ్చిన అసభ్య దుర్భాషలు కూడా చేయడం తో సభలోని వారు విస్తుపోయారు. అదే వేదిక పై జిల్లా కలెక్టర్ కూడా ఉండడం గమనార్హం. విధి నిర్వహణలో భాగంగా ఒక టీవీ లో ప్రసారం అయ్యిన వార్తలకు స్థానిక తాత్కాలిక విలేకరి ( స్ట్రింగర్ ) ని

భాద్యుణ్ని చేస్తూ ఆ టీవీ ఓనర్ ని తిట్టలేక, అర్భకుడైన బ్రాహ్మణా విలేఖరిని అసభ్యంగా దూషించడం పై బ్రాహ్మణవర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. దీంతో బాధితునికి బాసటగా నిలుస్తూ విశాఖపట్నం నగర పోలీస్ కమిషర్ కి ఫిర్యాదు చేసారు. మాజీ మంత్రి పై కేసు నమోదు చేసి, తమకు న్యాయం చేయవలసిందిగా ఫిర్యాదు

చేసారు. 

అధికార పార్టీ నుంచి స్పందనే లేదు. ..

ఒక మాజీ మంత్రి తన హోదా మరిచి పోయి, ఒక అర్భక బ్రాహ్మణుని పై నోటికి వచ్చిన దుర్భాషలు చేస్తే స్పందించేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఒక్కడు కూడా ముందుకు రాలేదు అంటే. . పార్టీ లో బ్రాహ్మణుల పట్ల ఏ విధమైన మంచి అభిప్రాయం ఉందొ బహిరంగంగానే

తెలుస్తోంది. పైగా ఈ పార్టీ లో బ్రాహ్మణా సంఘాల నేతలు కనీసం ఫోను కు కూడా అందుబాటులో లేకపోవడం అత్యంత దురదృష్టకరం. ఆంధ్ర ప్రదేశు బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కూడా ఇదే విశాఖపట్నం లో నివాసం ఉంటున్నారు. 

దీనిపై ఆగ్రహించిన బ్రాహ్మణా సంఘాల ప్రతినిధులు ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి దృష్టి కి తీసుకు వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam