DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శివలింగంపై టీవీ యాంకర్ చేసిన అసభ్యవ్యాఖ్యలకు ఉద్యోగం నుంచి తొలగింపు

*మీడియా ఉద్యోగం అంటే కొమ్ములు ఉండవు, నెటిజన్ల మండిపాటు.*
 
*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 21, 2022 (డిఎన్ఎస్):* హిందూ దేవి దేవతలను కించపరుస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఒక సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టిన కారణంగా జాతీయ టీవీ ఛానెల్ న్యూస్ యాంకర్ తన ఉద్యోగం నుంచి

సస్పెండ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే. .
వారణాశి మసీదులో ఇటీవల శివలింగం విగ్రహం పడి బయట ప్రపంచానికి అసలు చరిత్ర తెలియడం హిందూ వ్యతిరేకులకు మింగుడుపడడం లేదు. ఇదే కోవకు చెందిన ఒక హిందీ టీవీ ఛానెల్ యాంకర్ నగ్మా షేక్ చెందుతారు. న్యూస్ వన్ ఛానెల్ లో న్యూస్ యాంకర్ గా పని చేస్తున్న హిందువులను కించపరుస్తూ తన సోషల్

మీడియా ఖాతాలో అసభ్య వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.  వజూ ఖానాలో బాబా దొరికితే. . పాయిఖానాలో కూడా వెతకండి అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ను దీపక్ శర్మ అనే నెటిజన్ ఖండిస్తూ. .. ఒక్క గంటలో నీ ఉద్యోగం ఊడగొట్టక పొతే నా పేరు దీపక్ కాదు అని ఛాలెంజ్ చేసారు. ఈ పోస్ట్ ను లక్నో పోలీస్, యుపి పోలీస్ లకు టాగ్ చేశారు.

అనంతరం నెటిజన్లు భారీ

సంఖ్యలో ఈమె వ్యాఖ్యలపై మండిపడుతూ కామెంట్లు చేసారు. తప్పని పరిస్థితుల్లో న్యూస్ వన్ టీవీ ఛానెల్ యాజమాన్యం స్పందిస్తూ నగ్మా పెట్టిన పోస్ట్ లతో తమ ఛానెల్ కు ఎటువంటి సంబంధం లేదని, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కారణంగా తక్షణం ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. భారీ సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా

వ్యతిరేక కామెంట్ లు చేసే వారిపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.  

నెటిజన్లు పెట్టిన కామెంట్లలో నేరుగా మీడియా ఛానెళ్ల ప్రతినిధులను ఉద్దేశించి చేస్తున్నావే ఎక్కువగా ఉన్నాయి. మీడియా లో ఉద్యోగం చేస్తే ఎవరికీ కొమ్ములు ఉండవని, సామాన్యుల లాగానే వాళ్ళు కూడా పౌరులేనన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam