DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ తండ్రీకొడుకులే. .  హిందూ ధార్మిక న్యాయ పోరాట యోధులు     

అయోధ్య, జ్ఞానవాపి సహా 102 ఆలయాల కేసులు వాదిస్తున్నది వీరే

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 22, 2022 (డిఎన్ఎస్):* భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా లభించిన హిందూ పోరాట యోధులు ఎందరో ఉన్నారు. వారిలో ఇద్దరు ప్రస్తుతం ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే వీరు. వారికి

భగవంతుడు పెట్టిన పరీక్షల్లో 100 శాతం విజయం సాధించిన వారు. వారి విజయగాధ ఇదే. . . 

గత కొన్నేళ్ల క్రితం. . . ఒక ఆసుపత్రి లోని ఒక వార్డు లో జరిగిన ఘటన.. . .

ఒక న్యాయవాది కీ ఆసుపత్రిలో వైద్యులు సైతం చికిత్స చేయడానికి అవకాశం లేదు అని చేతులెత్తేసిన సమయంలో ఆ వ్యక్తి తన కుమారుణ్ణి (ఇతను కూడా న్యాయవాది) పిలిచి మరో

నాలుగు రోజుల్లో ఒక కీలకమైన కేసు వాయిదా ఉంది. దానికి  హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పారు. మరొక్కసారి కేసు దాఖలు చేసే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పారు. హాజరు కానీ పక్షంలో యావత్ హిందూ సమాజానికి మనవంతు సేవ చెయ్యలేకపోతాం అని చెప్పడం జరిగింది. ఆ న్యాయవాదే హరిశంకర్ జైన్. .. ఆ కోర్టు కేసు. .

. ఓ హిందూ దేవాలయం లో మసీదు కట్టిన ఘటన కేసు. ఆ యువకుడే అయోధ్య రామ మందిరం కేసు సుప్రీం కోర్టు లో వాదించిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్. ఇది జరిగింది దాదాపు దశాబ్దాల క్రితం. హిందూ ధర్మం కోసం తమ జీవితాలను సైతం పణంగా పెట్టిన న్యాయవాద   కుటుంబం విజయ గాథ ఇది.   
వీరే ప్రస్తుతం వారణాసి లోని కాశీ విశ్వనాధ మందిరం పరిరక్షణ కై

కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న న్యాయవాదులు. 

ఇటీవల ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకుడు డా. హెగ్డేవార్ జయంతి సభ ఉజ్జయిని లో మాట్లాడేందుకు నిర్వాహకులు విష్ణు జైన్ ను ఆహ్వానించారు. ఆ సభలో విష్ణు మాట్లాడుతూ. . తమ కుటుంబం ధర్మం కోసం నిలబడి పోరాడిన వైనాన్ని వివరించారు. మధ్యలో ఆవేదనతో కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఒక

కేసు వాదించడానికి తమకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయన్నారు. అయినప్పటికీ తన తండ్రి స్ఫూర్తిగా 102 హిందూ దేవాలయాలను తిరిగి హిందూ సమాజం కు అప్పగించాలనే సంకల్పంతో అన్ని కోర్టుల్లోనూ కేసులు వేసి, న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.
 
గతంలో ముస్లిం లు వేలాదిగా ప్రఖ్యాత హిందూ దేవాలయాలను నాశనం చేసి, ధ్వంసం చేసి మసీదులు

కట్టారని, అయితే గతం లో అక్కడ హిందూ దేవాలయం ఉండేది అని కోర్టుకు నిరుపిస్తేనే దేవాలయం హిందువుల పరం అవుతుందన్నారు. స్వాతంత్య్రానంతరం గతంలో పాలకులు చేసిన ఎన్నో తప్పిదాల కారణంగా ఇన్నాళ్లు ఈ ఆలయాలు హిందువుల పరం కాకుండా పోయాయన్నారు. తమ బృందం హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉన్నామని, భగవంతుని దయవల్ల అన్ని కేసుల్లోనూ విజయం

దిశగానే అడుగులు వేస్తున్నామన్నారు. 

అయోధ్య.. కేసు. .

1989 లో అయోధ్య శ్రీరామ మందిరం కేసు ఫైజాబాద్ కోర్టు నుంచి అలహాబాద్ కోర్టుకు తరలినప్పుడు హరిశంకర్ మొదటి సారి ఈ కేసును వాదించారన్నారు. అప్పుడే ముస్లిం వర్గాలు బాబ్రీ మసీద్ తరపున వాదించమని, భారీ ప్యాకేజీ ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారన్నారు. అయినప్పటికీ

హిందూ ధర్మాన్ని వదిలిపెట్టేది లేదని రాముడి పక్షాన్నేహరి జైన్ వాదించారన్నారు. 
బాబ్రీ మసీద్ ఘటన సమయంలో ఎన్ని విపత్కర ఘటనలు ఎదురయ్యాయన్నారు. కోర్టుకు వెళ్లాలంటే. . ముస్లిం కోలనీల మీదుగానే వెళ్లాలని, ఒంటరిగానే ధైర్యంగానే వెళ్లేవారన్నారు. జనవరి లో రామ మందిరం తెరవాలి అని తీర్పు వచ్చిందన్నారు. 

తాము

హిందూ ధర్మ పరిరక్షణ కె కట్టుబడి ఉన్నామని, తమ బృందం లోని యువ న్యాయవాదులు పూర్తి నిబద్ధతత తో ఉన్నారన్నారు. ఈ ఆలయాలను హిందూ సమాజానికి అప్పగించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. 
    
వీరు వాదిస్తున్న ధార్మిక రక్షణ కేసులు ఇవే: . .

జ్ఞానవాపి లో కాశీ విశ్వనాథ్ ఆలయం వివాదం లో హిందూ పక్షం కోసం

వాదించారు. దీంతో వీరు పూర్తి స్థాయిలో హిందూ సమాజం ముంగిట నిలిచారు.   

హిందువుల తరఫు తండ్రీకొడుకులు లేదా ఇద్దరూ కోర్టు ముందు హాజరైన 102 కేసులు ఉన్నాయి. కేసుల్లో పురాతనమైనది 1990 నాటిది. చాలా కేసులు నిర్ణయాత్మకంగా గెలిచాయి. మరికొందరు వివిధ కోర్టుల్లో ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి. మథురలో శ్రీ కృష్ణ జన్మభూమి

కేసు హిందూ పక్షం తరపున కొనసాగుతున్న ప్రధాన కేసులలో ఒకటి.

కుతుబ్ మినార్‌ను నిర్మించడానికి ముస్లిం ఆక్రమణదారులు ధ్వంసం చేసిన 27 హిందూ మరియు జైన దేవాలయాల కోసం వీరిద్దరూ కూడా పోరాడుతున్నారు. అంతేకాకుండా, తాజ్‌మహల్‌లోని క్లెయిమ్ చేసిన శివ మందిరం కోసం, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం, 1995 వక్ఫ్ చట్టం మరియు 2013లో

చేసిన సవరణలను సవాలు చేస్తూ, సచార్ కమిషన్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన కేసులు కూడా ఉన్నాయి. సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వివిధ ప్రభుత్వాలు చేసిన తదుపరి నిబంధనలు. 

విష్ణు శంకర్ జైన్ ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ ప్రతినిధి కూడా. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి

కేసుతో అతను తన అభ్యాసాన్ని ప్రారంభించాడు. 2016లో, అతను సుప్రీంకోర్టులో న్యాయవాది పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు మరియు శ్రీరామ జన్మభూమి కేసులో తన మొదటి హాజరును నమోదు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam