DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హనుమాన్ ర్యాలీ పోస్టర్ పై  క్రైస్తవ ప్రచార పోస్టర్ అంటింపు

*క్రైస్తవ  పోస్టర్ ప్రచారం పెచ్చుమీరింది:బీజేపీ ధార్మిక సెల్ ఫణి*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 22, 2022 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో క్రైస్తవ ప్రచారం పెచ్చుమీరిపోతోందని, హిందువుల్లో సహనాన్ని రెచ్చగొడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ కమిటీ

సభ్యుడు విజయ్ శంకర్ ఫణి మండిపడ్డారు. హిందూ ధార్మిక సంఘాలు నిర్వహిస్తున్న శోభాయాత్రల పోస్టర్లపై క్రైస్తవ పోస్టర్లు అంటించి, వివాదాలు రెచ్చగొడుతున్నారన్నారు. తక్షణం ఆ కార్యక్రమ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వివరాల్లోకి వెళితే. . .

ఈ నెల 25 న దేశ వ్యాప్తంగా జరుగనున్న హనుమాన్ జయంతి

ఉత్సవాల్లో భాగంగా గ్రామా గ్రామాన విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యవం లో బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా దివిసీమ ప్రాంతంలో కూడా హనుమాన్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన 
శోభాయాత్ర ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలు అవనిగడ్డ నియోజకవర్గ స్థాయిలో ముమ్మరంగా

జరుగుతున్నాయి. కరపత్రాలను అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు ల్లోని నగర వీధుల్లో కొన్ని గోడలపై అంటించారు. దానిపైనే క్రైస్తవ సభలకు సంబంధించిన కరపత్రాలను అంటించడం తో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వాళ్ళకి పోస్టర్లు అంటించుకోడానికి నగరంలో గోడలే లేవా? కేవలం హిందూ ర్యాలీల పోస్టర్లపైనే అంటించడం అంటే హిందువుల మనోభావాలు

దెబ్బతీయడానికేనని మండిపడుతున్నారు. 

అవనిగడ్డ మండలం వేకనూరు లో రాత్రి వరకు ఉన్న శోభాయాత్ర పోస్టర్ లపై అర్ధరాత్రి క్రైస్తవ పోస్టర్స్ వేసేసారు. నాగాయలంక, కోడూరు లో కూడా ఇదే పరిస్తితి నెలకొంది. కేవలం పోస్టర్ల అంటించినందుకే వాళ్ళు భరించలేకపోతే ఇక శోభాయాత్ర జరుగుతున్నప్పుడు ఇంకేమి ఉధృతాలు చేస్తారోనని

నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ ఈ దేశంలో హిందూ సమాజం నుజుంచి క్రైస్తవులకు ఏ విధమైన హాని అయినా జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. మీకు అవసరమయిన సమయాల్లో తే మీ కార్యక్రమాలు నిర్వహించుటకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో హిందువుల చేయూత అందించిన సందర్భాలు కూడా

ఉన్నాయన్నారు. 

ఇలాంటి చేష్టలకు కు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ - (HDPT), ఆంధ్రప్రదేశ్ శాఖా పోలీసు యంత్రాంగం ని కోరుతోంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam