DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ వ్యతిరేకి ఒవైసీ పై శివాలెత్తిన బండి సంజయ్ బడా సవాల్ 

ముగల్స్తో సంబంధం లేదన్న వాడు మసీదులు కూలిస్తే ఎందుకు రోడ్డెక్కాడు?

(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)

విశాఖపట్నం, మే 26, 2022 (డిఎన్ఎస్): నిరంతరం హిందూ ద్వేషంతో రగిలిపోయే ఒవైసి కి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బడా సవాల్ విసిరారు. రాష్ట్రం మొత్తంలో మసీదులు

త్రవ్వుదామని, అక్కడ శివమ్ (హిందువు దేవతలు) దొరికితే దాన్ని హిందువులు స్వాధీనం  చేసుకుంటారని, అదే శవం దొరికితే (సమాధి ). .. దాని మీకు వదిలేస్తారని, దానికి సిద్దమేనా అని సవాల్ విసిరారు. కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం జరిగిన హిందూ శక్తి భారీ ర్యాలీ లో బండి సంజయ్ ఒవైసి పై శివాలెత్తి పోయారు. ప్రతి రోజూ హిందూ

ద్వేషంతో తన స్థాయి మరిచిపోయి వ్యాఖ్యలు చేస్తున్న ఒవైసీ పై సూటిగా సవాల్ సంధించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ తిరుగుదామని, మసీదులు త్రవ్వి చూద్దామని, అక్కడ హిందూ దేవాలయాల ఆనవాళ్లు  ఉంటె కచ్చితంగా తాము స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇంతవరకూ జరిగిన అన్ని మసీదులోని సర్వేలు  హిందూ దేవాలయాలనే

ప్రకటించామన్నారు. 

ఒవైసీ తన స్థాయి మరిచిపోయి నేరుగా ప్రధానమంత్రి పైనే వ్యాఖ్యలు చెయ్యడం అతని బరితెగింపుకు పరాకాష్ట అన్నారు. ప్రధాన మంత్రి ఇల్లు త్రవ్వితే మసీదులు దొరుకుతాయి అంటూ హేళన చెయ్యడం  భారత దేశ  పాలకుణ్ణి అవమానించడమేనన్నారు. ముగల్స్ తో మాకు సంబంధం లేదన్న వాడు వాళ్ళు కట్టిన మసీదులు

కూలిస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నాడని ఒవైసీ ని ఘాటుగా ప్రశ్నించారు. హిందూ మహిళలను అవమానకరంగా మాట్లాడ్డం క్షమించరాని నేరమన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam