DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 న 25 వేల విద్యార్థులతో విద్యా ఉత్సవం - జ్ఞాన భేరి : మంత్రి గంటా

20 à°¨ 25 వేల విద్యార్థుల తో జ్ఞాన భేరి: మంత్రి à°—à°‚à°Ÿà°¾ 

విశాఖపట్నం, ఆగస్టు 10 , 2018 (DNS Online ):  à°ˆ నెల 19 , 20 తేదీల్లో విశాఖపట్నం నగరం లో జ్ఞాన భేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు

రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నగరం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లోని పాలకమండలి సమావేశ మందిరం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల్లోని ప్రతిభ పాటవాలను మరింత పెంపొందించేందుకు ప్రతి జిల్లాలోనే ఒక్కొక్క

జ్ఞానభేరి కార్యక్రమం నిర్వహించేందుకు సంకల్పించారన్నారు. దీనికి ఈ నెల 4 వ తేదీన తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో శ్రీకారం చుట్టారన్నారు. అదే

క్రమం లో à°ˆ నెల 20 à°¨ ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లోని ఇంజనీరింగ్ కళాశాల మైదానం లో సుమారు  25 వేల మంది విద్యార్థిని విద్యార్థులతో జ్ఞాన భేరి కార్యక్రమం అత్యంత వైభవంగా

నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ కళాశాలలు విద్యార్థులకు కేటాయించిన ప్రదేశాల్లో చేరుకునేందుకు వీలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయ సేవ

కార్యకర్తలు, జిల్లా పోలీసు విభాగం సిబ్బంది సేవలు అందించనున్నారన్నారు. ప్రతి విద్యార్థి వివరాలను ఒక యాప్ ద్వారా నమోదు చేయడం జారుతుందని, ఈ జ్ఞాన భేరి అనంతరం

పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ à°ˆ జ్ఞాన భేరి కార్యక్రమం కొరకు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని,

రాష్ట్రవ్యాప్తంగా 130 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. ఈ నెల 18 న విశాఖ సాగర తీరంలోని రామకృష్ణ బీచ్ వద్ద ఒక భారీ ర్యాలీ నిర్వహించనున్నామని, ఈ ర్యాలీ లో అవకాశం

ఉన్న ప్రతి కళాశాల విద్యార్థి పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. అవకాశం లేని కళాశాలల విద్యార్థులు అదే రోజు వారి విద్యాలయంలోనే ర్యాలీ చెప్పట్టాల్సిందిగా

తెలిపారు. à°ˆ కార్యక్రమం లో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, పాలిటెక్నీక్ తదితర  à°¸à°¾à°‚కేతిక విద్య కళాశాలలతో పాటు, డిగ్రీ, ఇంటర్ తదితర విద్యాలయాల విద్యార్థులు కూడా

పాల్గొంటారన్నారు. 19  à°¨  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన విజేతలను విశాఖ నగరానికి తీసుకు వచ్చి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 
ఆంధ్ర

ప్రదేశ్ ను  à°’à°• ఎడ్యుకేషన్ హబ్ à°—à°¾ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే బడ్జెట్ లో 15 శాతం నిధులు ( సుమారు 25  à°µà±‡à°² కోట్ల రూపాయలు

బడ్జెట్) విద్య అభివృద్ధి కి కేటాయించడం జరిగింది. ప్రయివేట్, కార్పొరేట్ విద్య సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నామని, అత్యంత ఉన్నత

విద్యార్హతలు కల్గిన అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలూ, యూనిఫామ్ లు,  à°‰à°¤à±à°¤à°® ప్రతిభ కనపరిచిన

విద్యార్థులకు  à°ªà±à°°à°¤à°¿à°­ అవార్డులు అందిస్తున్నామని,  à°œà°¾à°¤à±€à°¯ స్థాయి పోటీ ల్లో విజేతలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. బాలికలకు సైకిళ్ళు అందించామన్నారు.

మండలాల వారీగా 10 శాతం అభివృద్ధి పెరిగింది, పాడేరు లోని à°’à°• మారుమూల పాఠశాల లో డిజిటల్ తరగతిని ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారన్నారు. 
సాంస్కృతిక

కార్యక్రమాలతో విద్యార్థినీ విద్యార్థులు అందరినీ అలరించనున్నట్టు తెలిపారు. 

ఈ నెల 20 న జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా

విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలియచేసారు. ఈ సభలో జిల్లాలోని అందరు ప్రజా ప్రతినిధులు, విద్యా వేత్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రయివేట్ రంగ

ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. à°’à°• వారం రోజులు ముందుగా పలు పోటీలు నిర్వహించి వాటిల్లో  à°µà°¿à°œà±‡à°¤à°²à±à°—à°¾ నిలిచినా విద్యార్థులతో ముఖ్యమంత్రి

నేరుగా ముఖ ముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ జ్ఞాన భేరి కార్యక్రమం ఒక విశ్వవిద్యాలయం ఉపకులపతి నోడల్ అధికారిగా నిర్వహించబడుతుందన్నారు. విశాఖలో జరిగే ఈ

కార్యక్రమానికి ఏ యు ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు నోడల్ అధికారిగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఎయు వీసీ డాక్టర్ నాగేశ్వర రావు,

జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేష్ లడ్డా, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ 2 డాక్టర్ సిరి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి

ఉపాధ్యక్షులు డాక్టర్ కోటేశ్వర రావు , ఎయు రిజిస్టర్ డాక్టర్ నిరంజన్, ఎయు డీన్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

 

#dns  #dnsnews #dnslive #au #andhra university #jnana bheri #visakhapatnam #vizag  #andhra pradesh #government

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam