DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేదీప్య వారణాశి ఆలయ చరిత్ర నాటి నుంచి నేటివరకు ఆధారాలు

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 30, 2022 (డిఎన్ఎస్):* భూలోక కైలాసంగా ప్రఖ్యాతి గాంచిన వారణాశి విశ్వనాథ ఆలయం నాటి నుంచి నేటి వరకూ ఎంతో దేదీప్యమైన చరిత్రను కలిగి యుంది. శతాబ్దాలుగా దేవతలు, మహర్షులు, ఎందరో మహానుభావుల ఆరాధనలు అందుకున్న సదాశివుడు నేడు తనంతట తానుగా ప్రకటితం

చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఈ అఖండ భారత దేశాన్ని దోచుకుని, ఆక్రమించుకుని, ఈ సనాతన ధర్మ ప్రభావాన్ని నాశనం చేసేందుకు పూనుకున్న ముష్కరులు చేసిన దురాగతాలు ప్రభావంగా ఈ ఆలయం లో మసీదులు సైతం వచ్చేసాయి. అయితే గతం లో ముందు నుంచి ఉన్నది శివాలయమే  అని హిందువులు నిరూపించుకోవాల్సిన దౌర్భాగ్యం

పట్టింది. ఈ ఆలయానికి గల పూర్వ చరిత్ర నుంచి నేటి వరకూ జరిగిన కొన్ని పరిణామాలు. . .ఇవిగో. . 

 కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 

కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.

క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం

క్రీ.శ 635 చైనా యాత్రికుడు

యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన

క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం

క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు

క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి

క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా

తొడరమల్

క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం

క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు

శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి

క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు

నిర్మాణం చేసిన ఔరంగజేబు

క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం

క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం

క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు

క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన

మహారాజా రంజిత్ సింగ్

కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం

ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు

కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం

184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8

న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన. 

12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.

కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.

మణికర్ణికా

ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.

కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.

విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.

ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.

ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి

రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.

2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆదర్శనంగా నిలిచిన వారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.

ప్రస్తుతం ఈ ఆలయం ఆవరణలోని మసీదు ప్రాంగణం లో శివలింగం వెలుగు చూడడం తో

ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నాటి మొగలుల దుర్మార్గపు అత్యంత క్రూర చర్యలకు నిదర్శనంగా నిలిచింది ఈ ఆలయం. 

అఖండ హిందూ దేశంలోని వందేళ్ల కు పైబడిన ఏ మసీదు ప్రాంగణం లో పరిశోధన చేసినా దర్శనమిచ్చేది కచ్చితంగా హిందూ దేవాలయమే అనే విశ్వాసం అందరికి కలుగుతోంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam