DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పీఠాలను విమర్శించే వాళ్ళు ఆ పీఠాలకు ఏమైనా సాయం చేసారా?

*ఎన్నడూ సాయం చెయ్యని నీకు విమర్శించే హక్కు ఎక్కడిది?: భక్తులు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  01, 2022 (డిఎన్ఎస్):* ఇటీవల కాలంలో హిందూ సమాజం గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ హిందూ పీఠాలను, పీఠాధిపతులను దూషించడం, అవమానించడం తమ హక్కు అన్నట్టుగా ఇష్టానుసారంగా

విమర్శించడం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది లేనంతవరకూ ఎవరి సంప్రదాయం వారు పాటించుకునే హక్కు ఉంది. అయితే కొందరు హిందూ ధర్మం పై తీవ్ర ద్వేషం పెంచుకుని, కనిపించిన ప్రతి ఒక్క సంప్రదాయపరుణ్ణి అవమానించడం తమ హక్కు అన్నట్టుగా దూషించడం ప్రతి రోజు చూస్తున్నాం. ప్రధానంగా ఈ విపరీత పైత్యం తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఒక

వైరస్ లా పేరుకుపోయింది. కొంతమందికి కొన్ని నమ్మకాలూ ఉంటాయి, వాళ్ళు ఎంత ఉన్నతమైన హోదాల్లో ఉన్నప్పడికి, కొన్ని విశ్వాసాలు పాటించడం ద్వారా వాళ్ళు చెయ్యవలసిన కార్యాచరణ మరింత విజయవంతంగా నిర్వహించగలరు. 

ప్రస్తుత పాలకులు కూడా తమ నమ్మకాన్ని ప్రదర్శించడం కొందరికి ఏమాత్రం రుచించడం లేదు. అంతే వీళ్ళని

విమర్శించేందుకు వాళ్ళ నమ్మకాలను కించపరుస్తూ రోడ్డెక్కి మరీ విరుచుకు పడుతున్నారు. దానిలో భాగమే రాష్ట్రాల్లోని పాలకులు గత కొన్నేళ్లుగా ఒక పీఠాన్ని నమ్ముకుని, ఆ పీఠాధిపతులు సూచించిన మేరకు తమకు అవకాశం ఉన్నంతవరకూ అమలుచేయడం జరుగుతోంది. అయితే పీఠాధిపతులు చెప్పిన ప్రతి విషయం వీళ్ళు పాటించక పోవచ్చు. ఒక మనిషిపై నమ్మకం

కలిగితే వాళ్ళు చెప్పేది మంచి ఫలితం ఇస్తుంది అనే విశ్వాసం వల్లనే పదే పదే ఆ పీఠాధిపతులను కలవడం జరుగుతుంది. రాజకీయ ప్రత్యర్ధులు పాలకులను ఏమి చెయ్యలేక, వాళ్ళమీద ఉండే అక్కసు, ద్వేషాన్ని ఈ పీఠాలపై చూపించడం  ద్వారా తమ దుర్ద తీర్చుకుంటున్నారు. ఇక పీఠాలు, పీఠాధిపతులు నేరుగా పరిపాలనలో పాల్గొనవు,  పాల్గొనే అవసరం కూడా

వాళ్లకి లేదు. అయితే పీఠాలపై కొందరు చేస్తున్న అకారణ విమర్శల కారణంగా నిర్వాహకులు మనస్థాపం  చెందిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఈ విషయాలేవీ పీఠాధిపతులు పట్టించుకోరు. వారు లౌకిక సమాజానికి ప్రత్యక్షంగా ఉండరు కనుక, వారికి ఇబ్బంది ఉండే అవకాశం లేదు, అయితే పీఠాల నిర్వాహకులు మాత్రం ఇబ్బందుల పాలవుతుంటారు. 

ఒక

పీఠం నిర్వహించాలంటే. . ఎన్నో సమస్యలు ఉంటారు. ఒక దేవాలయం కంటే ఎక్కువ భాద్యతలను పీఠాలు నిర్వహిస్తుంటాయి. వాటి అవసరాలకు ఆర్ధిక, సామాజిక, ఆధ్యాత్మిక ప్రచారం కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తుంటాయి. వాటికి ఉండే ఇబ్బందులను తట్టుకునేందుకు తమను ఆశ్రయించే భక్తులకు వివరించడం జరుగుతుంది. గోశాల, వేదపాఠశాల, నిత్యా అన్నప్రసాద

వితరణ, ఆలయాల నిర్వహణ, నిత్యాగ్ని హోత్రం, క్రమం తప్పకుండా హోమాలు, యజ్ఞయాగాదులు, క్రతువులు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది.  

వచ్చిన భక్తులు తమ స్థితిగతుల ఆధారంగా అవకాశం ఉంటె సహకరించడం, . .  లేదంటే. . .ఒక నమస్కారం పెట్టి వెళ్లడం జరుగుతుంది. అయితే వీరెవ్వరూ ఈ పీఠాలను, పీఠాధిపతులను

విమర్శించరు. కారణం ఆ పీఠం నిర్వహణ ఎంత కష్టమో వారు ప్రత్యక్షంగా చూస్తుంటారు కనుక.  అదే ఈ పీఠాలతో సంబంధం లేనివాళ్లు,ధర్మం పట్ల ద్వేష భావం పెంచుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడమే తమ హక్కుగా భావించే అసుర వారసులు, అసంబద్దత వ్యాఖ్యలు చేస్తుంటారు. 

ఒక పీఠం ఏర్పడడానికి ఎంతో చరిత్ర ఉంటుంది. ఆ పీఠాధిపతి

సన్యాసిగా దీక్ష తీసుకోవడానికి ఎంతో శ్రమ పడతారు. పూర్వాశ్రమం లో అంతవరకూ నిర్వహించే పనులన్నింటిని ఉన్నవి ఉన్నట్టుగా విడిచి పెట్టి ఒక్క సారిగా కాషాయ వస్త్రం ధారణ చెయ్యడం అంటే మనం వేసుకున్న చొక్కా వేసుకున్నంత సులభం కాదు. ఒకసారి సన్యాసం దీక్ష తీసుకుంటే అక్కడితో వాళ్లకి సామాన్య లౌకిక జీవితం ముగిసిపోతుంది. మిగిలిన

జీవితం అంతా కాషాయ వస్త్రం, ఒక దండం తప్పితే మరొక ఆస్థి ఉండదు. పీఠాల ఏర్పాటు చేయడం అనేది వేద సంరక్షణ కోసం, గో రక్షణ చెయ్యడం కోసం గోశాల, ఆలయాల నిర్మాణం, క్రతువులు చెయ్యడం సమాజ హితం కోసమే. వీటన్నింటికి ఆర్ధిక పరమైన అవసరాలు ఉంటాయి. . .వాటిని పరిపూర్ణం చేసుకోడానికి వారు కేవలం తమ శిష్య బృందానికి మాత్రమే సూచిస్తుంటారు. తద్వారా

ఆశ్రమ అవసరాలు తీరుతుంటాయి. 

విమర్శించేవారు ఈ పీఠాలకు ఏమి సాయం చేసారు?:

అయితే ఇలా హిందూ పీఠాలను, పీఠాధిపతులను దూషించే వారు తమ జీవిత కాలం లో ఏ పీఠానికైనా  కానీ సాయం చేశారా అనే ధార్మిక భక్తులు అడుగుతున్నారు. లేదా పీఠాధిపతుల పూర్వాశ్రమం లో పరిచయం ఉన్నవారు ఉండి ఉంటారు. పోనీ పూర్వాశ్రమం లో నైనా

వీళ్ళకి సాయం చేసిన దాఖలాలు లేవు. పూర్వాశ్రమంలోనే సహాయం చెయ్యని వారి, సన్యాసం ఆశ్రమం లో నైనా వీరికి కనీసం ఒక సాయమేనా చేశారా అంతే అదికూడా లేదు. పీఠానికి కానీ, పీఠాధిపతి గానీ ఎన్నడూ సాయం చెయ్యని నీకు వాళ్ళని విమర్శించే హక్కు ఎక్కడిది అని భక్తులు ప్రశ్నింస్తున్నారు. 

హిందూ ద్వేషులు చేసే విమర్శల్లో

కొన్ని...:

సమాజంలో హిందుత్వ గురించి ఎవరైనా ఏమైనా అడిగితె.. .ఆ పీఠాధిపతి ఎందుకు చెయ్యరు?

వేరే రాష్ట్రం లో ఏదేని హిందూ ఆలయాలు, భక్తులకు ఇబ్బంది తలెత్తిన సమయంలో ఈ పీఠాధిపతి ఏమిచేశారు?  వీళ్ళు నోరెత్తాలి కదా. గోవులను ఎవరైనా అక్రమంగా తరలించుకు పోతుంటే, ఈ పీఠాధిపతులు ఏమి చేస్తున్నారు. రక్షించాలి కదా.

అంటూ నానా యాగీ చేస్తుంటారు. నిజంగా వీళ్ళు చెపితే అధికారులు వినరు.  

పూర్వాశ్రమం ( పాత జీవింతం ) పై విరక్తి కలిగి సన్యాసాశ్రమం తీసుకుని, పీఠాధిపతులు ఆధ్యాత్మిక సాధన ద్వారా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని, సంప్రదాయాన్ని విస్తరింపచేస్తున్న సమయంలో బాఫ్యూన్ల మాదిరిగా వీళ్ళు తమకు సంబంధం లేని, అవసరం లేని విషయాల్లో

దూరి పీఠాధిపతులను విమర్శించడానికి వీళ్ళకి ఏమి అర్హత ఉండి. పీఠానికి ఇచ్చిన విరాళాలు దుర్వినియోగం చేస్తే. . ప్రశ్నించేందుకు సంబంధిత సభ్యులు, లీగల్ సమస్యలు ఎదురైతే కోర్టులు ఉన్నాయి. అంతేతప్ప తమకు పీఠాల గురించి మాట్లాడేందుకు  ఏమాత్రం అర్హతలేని వాళ్ళు కూడా మాట్లాడితే. . ప్రశ్నించేందుకు పీఠాలకు కూడా కొన్ని హక్కులు

ఉంన్నాయి. 

నీకు నమ్మకం ఉండి నచ్చితే పీఠాలు, ఆశ్రమాలకు వెళ్లడం కొంచెం మంచి నేర్చుకోవడం ఇంటికి తిరిగి రావడం మాత్రం చెయ్యాలి. . .అంతే తప్ప నోరు అదుపు తప్పి అసంబద్దత ప్రేలాపనలు చేస్తే. . .వాళ్ళు కూడా పరువు నష్టం దావా కోర్టుల్లో వెయ్యవచ్చు.. . .అలాగే గనక ఒక్క పీఠాధిపతి కోర్టు లో కేసు వేస్తె. . .ఈ భారత దేశం హిందూ

ద్వేషులు అనేవాళ్ళు మరొక్క సారి పీఠాధిపతుల జోలికి వెళ్లరు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam