DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత తీవ్రవాద వ్యాఖ్యలు ఉపేక్షించేది లేదు: బీజేపీ ఎంపీ జివిఎల్

*అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు బాసటగా ఉన్నాం, DNS కు GVL వెల్లడి* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  02, 2022 (డిఎన్ఎస్):* దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా తీవ్రవాద వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది  లేదని, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్

నరసింహారావు ప్రకటించారు. విశాఖపట్నం లో పర్యటిస్తున్న ఆయన డీఎన్ఎస్ కు ప్రత్యేక అంశాన్ని తెలియచేసారు. ఇటీవల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఒక టీవీ డిబేట్ చేసిన వ్యాఖలను వక్రీకరించి, దానిపై కొందరు అసాంఘిక వర్గాలు ప్రత్యక్ష, పరోక్ష బెదిరింపులకు పాల్పడిన అంశంపై అయన స్పందించారు. ఆమె డిబేట్ లో చేసిన

వ్యాఖ్యలు అభ్యంతరకంరంగా ఉంటె వివరణ అడగాలి తప్ప ఆమెను చంపిన వారికి పది లక్షల రూపాయల నజరానా, మానభంగం చేస్తే ఐదు లక్షల నజరానా అంటూ తీవ్రవాద వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుందన్నారు. నూపుర్ శర్మ కు బాసటగా నిలుస్తోందన్నారు. 

వారణాసి లోని జ్ఞానవాపి మందిరంలో కోర్టు జరిపిన వీడియో చిత్రీకరణలో

శివలింగం బయట పడడంపై ఒక టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ లో మౌలానా సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై జివిఎల్ మండిపడ్డారు. అది శివలింగం అని ముందుగానే తెలిస్తే. . .ధ్వంసం చేసేవాళ్ళం అంటూ మౌలానా చేసిన వ్యాఖ్యలు యావత్ హిందూ సమాజాన్ని, కోర్టుని అవమానించడమేనన్నారు. దీనిపై బీజేపీ సీరియస్ గానే పరిశీలిస్తోందన్నారు. ఈ ఘటనలో

ప్రత్యక్షంగానే ఇతను అభ్యంతరకర వ్యాఖ్య చేశాడన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam