DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గౌతు శిరీష పట్ల ప్రభుత్వ తీరుపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మండిపాటు 

(DNS రిపోర్ట్: BV సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)  

విశాఖపట్నం, జూన్  08, 2022 (డిఎన్ఎస్): ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఎంతో పేరు కల్గిన గౌతు లచ్చన్న మనుమరాలు, గౌతు శిరీష పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే,  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి.విష్ణు కుమార్ రాజు

తెలిపారు. బుధవారం విడుదల చేసిన లేఖలో ఆయన ప్రస్తుత రాష్ట్ర పాలన పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వ్యవహారాలు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంటున్నాయన్నారు. ఈ మధ్యకాలంలో గౌతు శిరీష ని  సోషల్ మీడియాలో ఏదో పోస్ట్  ఫార్వర్డ్ చేశారు అనే సాకుతో సిఐడి పోలీస్ యంత్రాంగం పిలిపించి

తరువాత ఇక్కడ కాదు మళ్లీ విజయవాడ రమ్మని నోటిస్ ఇచ్చారన్నారు. విజయవాడ వెళ్లిన తర్వాత  లాయర్ తో మాట్లాడడానికి అవకాశం లేకుండా వారి ఒకరినే పెట్టి విచారణ లో కూడా కనీసం మంచినీళ్లు, భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా చాలా  విచారణకారం, దురదృష్టము, దౌర్భాగ్యము.  

ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది ఎవరిని

ఏవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం  ట్రీట్ చేస్తున్నారనే విషయం ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నారు.   

సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శివాజీ కూడా ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారని, మాతో పాటు గత శాసన సభలో ఎమ్మెల్యే గా ఉన్నారన్నారు. వారు అన్నీ నిక్కచ్చిగా ఉండే వ్యక్తి అని, అటువంటి వారి

కుమార్తె ను ఈవిధంగా మానవతా దృక్పథంతో కూడా చూడకుండా పోలీసు యంత్రాంగం వారి పైన వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అన్నారు. 
దీనిని భారతీయ జనతా పార్టీ తరపున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.  ఇది ఒకటే కాకుండా ఈ రాష్ట్రప్రభుత్వం బీసీలకు ఏదో గొప్పగా చేస్తున్నామని బస్సు యాత్ర నిర్వహించి రాష్ట్రమంతా తిరిగి

కార్యక్రమం చేపట్టారు,  కానీ  ఒక బీసీ మహిళ కి ఈ విధంగా మహిళల గౌరవాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో అనేది బీసీ మహిళలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ  రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది బీసీ మహిళలు మగవారు కూడా తప్పనిసరిగా బీసీ లందరూ ఏకమై దుర్మార్గం రాక్షస ప్రభుత్వాన్ని బయటకు పంపించే

విధంగావచ్చే ఎలక్షన్లో  తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam