DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యుపిలో మరుగుదొడ్లలో హిందూ దేవతల చిత్రాల టైల్స్, హిందువుల ఆగ్రహం

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  12, 2022 (డిఎన్ఎస్):* ఉత్తర ప్రదేశ్ లోని యోగి మహారాజ్ పరిపాలన అద్భుతంగా ఉండడంతో జీర్ణించుకోలేని  హిందూ వ్యతిరేక ఉన్మాదులు పేట్రేగిపోతున్నారు. సీతాపూర్ జిల్లా మహమూదాబాద్ తహసీల్‌లోని బర్రా బెరోరా గ్రామంలో మూడేళ్ళ క్రితం సర్పంచ్ గా

ఉన్న ముస్లిం మహిళా రేష్మ పదవి లో సర్పంచ్‌గా ఉన్నప్పుడు కొన్ని మరుగుదొడ్లు నిర్మించారు. జూన్ 8వ తేదీన స్థానిక హిందూ కార్యకర్తలు కొందరు ఈ టాయిలెట్లలో శివలింగం మరియు ఇతర హిందూ మత చిహ్నాలతో కూడిన టైల్స్ ఉన్నట్లు గుర్తించడం తో స్థానిక భజరంగ్ దళ్  నాయకులూ సందీప్ అవస్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని మిగిలిన

అన్ని మరుగుదొడ్లను పరిశీలహించారు. నేటికీ 8 నుంచి 10 టాయిలెట్ లలో హిందూ  దేవి దేవతలా చిత్రాలు అలాగే ఉన్నాయి. పోలీసులు సైతం వీటిని గమనించడం గమనార్హం. 

దీంతో పోలీసులు మాజీ సర్పంచ్ రేష్మ,  సహా ఆమె భర్త బునియాద్, నసిముల్లాపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. 

బర్రా బెరోరా

గ్రామంలో మూడేళ్ల క్రితం ముస్లిం మహిళ సర్పంచ్మ రుగుదొడ్లను సిద్ధం చేసింది. ఈ గ్రామంలో సుమారు 700 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభాలో 50% ముస్లింలు. చాలా మరుగుదొడ్లు కూడా ముస్లిం జనాభా వినియోగాన్ని కొనసాగించాయి. అక్కడికి హిందువులు వెళ్లే అవకాశం లేదు కాబట్టి అభ్యంతరం రాలేదు.

ఈ మరుగుదొడ్లు రెండు రోజుల క్రితం

గ్రామంలోని హిందువుల దృష్టికి వచ్చాయి. పలకలను చూసిన ప్రజలు తమ అసహనం వ్యక్తం చేశారు.

విషయం హిందూ సంస్థలకు తెలియడంతో, టాయిలెట్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం ముఖ్యమంత్రి, డీజీపీ కార్యాలయానికి చేరింది. సీతాపూర్ డీఎం విచారణ ప్రారంభించారు. అదే సమయంలో మతపరమైన మనోభావాలను

దెబ్బతీసినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ఈ మరుగుదొడ్లను 2018-19లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద సీతాపూర్‌లోని మహ్ముదబార్ తహసీల్‌లోని బర్రా బెరోరా గ్రామంలో నిర్మించారు. ఆ సమయంలో ఆమె సర్పంచిగా ఉన్నారని హిందూ వర్గాలు తెలియచేస్తున్నాయి. 

విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో

గ్రామంలో సందడి నెలకొంది. భజరంగ్ దళ్ అధికారులు కూడా సీఎం, డీజీపీ కార్యాలయం వరకు ట్వీట్ చేశారు. 

అరెస్టయిన మహిళా గ్రామాధికారి రేష్మ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ మరుగుదొడ్డి నాలుగేళ్ల క్రితం నిర్మించారని, ఆ సమయంలో తానూ అధికారం లో లేను అని పోలీసులకు తెలిపారు. అయితే హిందూ సంఘాల ఆరోపణల ప్రకారం హిందువులను

కించపరిచేందుకే ఈమె ఈ పని చేసారంటూ భారీ ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో గ్రామంలో భారీ ఎత్తున పొలిసు భద్రతా కల్పించారు. ప్రస్తుతానికి అలాంటి మరుగుదొడ్లను మూసివేశారు.

సీతాపూర్‌ డీఎం అనుజ్‌సింగ్‌ మాట్లాడుతూ.. మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మరుగుదొడ్లు ఎవరి కాలంలో నిర్మించారు?

కాంట్రాక్టర్ ఎవరు? విచారణ అనంతరం ఈ విషయాలన్నీ బయటకు రానున్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam