DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాధువుల సత్సంగం కేవలం మానవ జన్మలోనే సాధ్యం: ప్రధాని మోడీ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  14, 2022 (డిఎన్ఎస్):* సాధువుల సత్సంగం అనేది మానవ జన్మ లో మాత్రమే లభించే ఒక అరుదైన విశేష అధికారం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెలియచేసారు. మంగళవారం జగద్గురు సంత్ తుకారామ్ మహారాజ్ ఆలయాన్ని పుణె లోని దేహూ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో

సభికుల ను ఉద్దేశించి మాట్లాడుతూ, పవిత్రమైనటువంటి దేహూ గడ్డ కు విచ్చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  మన ధర్మ గ్రంథాల ను గురించి ప్రస్తావిస్తూ, సాధువుల కరుణ వర్షించినప్పుడు, దైవం గురించిన అనుభూతి దానంతట అదే  లభ్యమవుతుందన్నారు.  ఈ రోజున, దేహూ లో ఈ పవిత్రమైన తీర్థ భూమి కి విచ్చేసి నాకు ఆ మాదిరి అనుభూతే

లభిస్తోందన్నారు.  ‘‘దేహూ లోని శిలా మందిర్ భక్తి యొక్క శక్తి తాలూకు కేంద్రం ఒక్కటే కాదు, అది భారతదేశం యొక్క సాంస్కృతిక భవిష్యత్తు కు బాట ను పరిచేది కూడాను.  ఈ పవిత్ర స్థలాన్ని పునర్ నిర్మించినందుకు గాను ఆలయ ధర్మకర్తల మండలి కి మరియు భక్తజనానికంతా నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం

చేస్తున్నానన్నారు.

కొన్ని నెలల క్రితం పాల్ కీ మార్గ్ లలో రెండు జాతీయ రహదారుల ను నాలుగు-దోవలు కలిగినవి గా తీర్చిదిద్దేందుకు శంకుస్థాపన చేసే భాగ్యం కూడా తనకు దక్కింది అని మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.  శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ కీ మార్గ్ ను అయిదు దశల లో పూర్తి చేయడం జరుగుతుంది;  సంత్ తుకారామ్

మహారాజ్ పాల్ కీ మార్గ్ ను మూడు దశల లో పూర్తి చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.  ఈ దశల లో 11,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో 350 కిలో మీటర్ ల పొడవు న హైవే స్ ను నిర్మించడం జరుగనుంది.

ప్రపంచం లో అతి ప్రాచీనమైన నాగరికత ను కలిగివున్న దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉండడం మనకు గర్వకారణం అని ప్రధాన మంత్రి అన్నారు.

 ‘‘దీని తాలూకు ఖ్యాతి ఎవరికైనా దక్కుతుంది అంటే అది భారతదేశం లోని సాధువులు మరియు మునుల పరంపర కే’’ అని ఆయన అన్నారు.  భారతదేశం శాశ్వతంగా నిలచింది. ఎందుకంటే భారతదేశం సాధువుల భూమి కాబట్టి అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.  ప్రతి యుగం లో మన దేశాని కి మరియు సమాజాని కి దిశ ను ఇవ్వడం కోసం ఎవరో ఒక మహనీయ ఆత్మ

అవతరిస్తూ వచ్చింది.  ఈ రోజు న దేశం సంత్ కబీర్ దాస్ యొక్క జయంతి ని జరుపుకొంటున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.  శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్, సంత్ నివృత్తినాథ్, సంత్ సోపాన్ దేవ్ మరియు ఆది-శక్తి ముక్తా బాయీ జీ ల వంటి సాధువుల కీలక వార్షికోత్సవాలను గురించి కూడా ఆయన మాట్లాడారు. 

సంత్ తుకారామ్ జీ యొక్క దయ, కరుణ

మరియు సేవ లు ఆయన యొక్క ‘అభంగాల’ రూపం లో ఈనాటికీ మన దగ్గర ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ‘అభంగాలు’ మనకు తరాల తరబడి ప్రేరణ ను ఇచ్చాయి.  ఏదైతే అంతరించిపోదో, అదే కాలం తో పాటు గా శాశ్వతం గా ఉండిపోవడమే కాక ప్రాసంగికం గా కూడా ఉంటుంది..  అదే ‘అభంగ’ అని ఆయన వివరించారు.  ఈ రోజు కు కూడా దేశం ముందుకు సాగిపోతూ, తన

సాంస్కృతిక విలువల ను శిరసావహిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు.  సంత్ తుకారామ్ యొక్క ‘అభంగాలు’ మనకు శక్తి ని ఇస్తున్నాయి అని వివరించారు.  ‘అభంగ’ యొక్క గౌరవశాలి సంప్రదాయాని కి, ఆ సంప్రదాయం లో ప్రముఖ సాధువుల కు ప్రధాన మంత్రి నమస్సులు అర్పించారు.  మానవుల మధ్య  వివక్ష కు వ్యతిరేకం గా సాగిన బోధనల ను  ప్రధాన

మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.  ఈ ప్రబోధాలు  దేశాని కి మరియు సమాజాని కి అంకితం కావాలి అనే భావన ను గురించి చెప్తున్నాయి.  అదే మాదిరి గా ఈ ప్రబోధాలు ఆధ్యాత్మిక సమర్పణభావన ను గురించి కూడా బోధిస్తున్నాయి అని ఆయన అన్నారు.  ఈ సందేశం వర్ కరీ భక్తజనం జరిపే పండర్ పుర్  యాత్ర యొక్క ప్రాముఖ్యాన్ని చాటి చెబుతుంది అని

ఆయన అన్నారు.  ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్’ భావన అటువంటి గొప్ప సంప్రదాయాల ద్వారా స్ఫూర్తి ని పొందింది అని ఆయన అన్నారు.  మరీ ముఖ్యం గా స్త్రీ- పురుష సమానత్వ భావన మరియు అంత్యోదయ భావన లు ఒక ప్రేరణ గా నిలచాయి అని ఆయన అన్నారు.  ‘‘దళితుల, మోసానికి గురైన వర్గాల, వెనుకబడిన వర్గాల,

ఆదివాసీల మరియు శ్రమికుల సంక్షేమం దేశాని కి అగ్ర ప్రాధమ్యంగా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి జాతీయ నాయకుల జీవనం లో తుకారామ్ జీ వంటి సంతులు చాలా పెద్ద పాత్ర ను పోషించారు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  స్వాతంత్య్ర పోరాటం లో వీర్ సావర్ కర్ జీ కి శిక్షను విధించిన కాలాన్ని

ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, వీర్ సావర్ కర్ కారాగారం లో ఉండగా బేడీల ను చిప్ లీ వలె మోగిస్తూ తుకారామ్  జీ యొక్క ‘అభంగాల’ ను ఆలాపించే వారు అని పేర్కొన్నారు.   సంత్ తుకారామ్ దేశం లో వేరు వేరు కాలాల లో ఉత్సాహాన్ని మరియు శక్తి ని నింపారు.  అని ఆయన అన్నారు.  పంఢర్ పుర్, జగన్నాథ్, మధుర లోని భ్రజ్ పరిక్రమ లేదా

కాశీ పంచ్ కోశీ పరిక్రమ,   చార్ ధామ్ లేదా అమర్ నాథ్ యాత్ర ల వంటి ‘యాత్రలు’ మన దేశం యొక్క వివిధత్వాన్ని ఏకం చేశాయి.  అవి ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ భావన ను అంకురింప చేశాయి అని కూడా ఆయన చెప్పారు.

మన దేశ సమైక్యత ను బలపరచడం కోసం, మన పురాతనమైన గుర్తింపు మరియు సంప్రదాయాల ను సజీవం గా అట్టిపెట్టుకొనడం మన

బాధ్యత అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ఈ కారణం గా, ‘‘ప్రస్తుతం ఎప్పుడైతే ఆధునిక సాంకేతిక విజ్ఞానం మరియు మౌలిక సదుపాయాలు భారతదేశం యొక్క అభివృద్ధి కి పర్యాయ పదాలు గా మారుతున్నాయో, అభివృద్ధి మరియు వారసత్వం రెండూ కలసికట్టుగా ముందంజ వేసేటట్లు మేం చర్యల ను తీసుకొంటున్నాం’’ అని ఆయన అన్నారు.  పాల్ కీ యాత్ర

యొక్క ఆధునికీకరణ, చార్ ధామ్ యాత్ర కోసం కొత్త హైవే స్,  అయోధ్య లో ఒక గొప్ప రామ ఆలయం, కాశీ విశ్వనాథ్ ధామ్ నవీకరణ, సోమ్ నాథ్ లో అభివృద్ధి కార్యాల ను గురించి ఆయన ఉదాహరణలు గా పేర్కొన్నారు.  ‘ప్రసాద్’ పథకం లో భాగం గా తీర్థ యాత్ర స్థలాల ను అభివృద్ధి పరచడం జరుగుతోంది అని ఆయన వెల్లడించారు.  రామాయణ సర్క్యూట్ ను, బాబా సాహెబ్

పంచ్ తీర్థ్ ను అభివృద్ధి చేయడం జరుగుతోంది అని అన్నారు.  ప్రతి ఒక్కరి కృషి సరి అయిన దిశ లో సాగితే తీర్చలేని సమస్యలు అనుకున్న వాటిని కూడా పరిష్కరించడం సాధ్యపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రస్తుతం స్వాతంత్య్రం యొక్క 75వ సంవత్సరం లో సంక్షేమ పథకాల ను అందరి చెంతకు చేరేటట్లు చేయడం ద్వారా 100 శాతం సాధికారిత దిశ లో దేశం

పయనిస్తోంది అని ఆయన పేర్కొన్నారు.  ఈ పథకాల వల్ల పేద లు కనీస సదుపాయాల కు నోచుకొంటున్నారు అని ఆయన వివరించారు.  స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో అందరు పాలుపంచుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్కరు ఈ విధమైన జాతీయ ప్రతిజ్ఞల ను వారి ఆధ్యాత్మిక ప్రతిజ్ఞల లో ఒక భాగం గా చేసుకోవాలి అని కూడా ఆయన కోరారు.  ప్రాకృతిక

వ్యవసాయాని కి, యోగ కు ప్రజాదారణ లభించేటట్లు చూడటం మరియు యోగ దినాన్ని ఉత్సవం గా జరుపుకోవడం కోసం ముందుకు రండి అంటూ సభికుల కు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంత్ తుకారామ్ వార్ కరీ సమాజాని కి చెందిన సాధువు మరియు కవి; ఆయన ‘అభంగ’ తరహా భక్తి కవిత్వాని కి ఆయన ప్రసిద్ధి గాంచారు.  కీర్తన ల ద్వారా సామూహిక ఆరాధన కు అండ గా ఆయన

నిలబడ్డారు.  ఆయన దేహూ లో నివాసం ఉండే వారు.  ఆయన మరణానంతరం ఒక శిలా మందిరాన్ని నిర్మించడం జరిగింది.  అయితే, దానికి ఒక ఆలయ రూపం అంటూ ఏర్పడలేదు.  దానిని రాతి పనితనం తో 36 శిఖరాల తో పునర్ నిర్మించడం జరిగింది; అందులో సంత్ తుకారామ్ యొక్క విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయడమైంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam