DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  14, 2022 (డిఎన్ఎస్):* అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ట మాసం పౌర్ణమి తిధి వడా యతి పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు మంగళవారం

సాయంత్రం ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం యం నిత్యార్చనలు బాల భోగ రాజభోగ నివేదనలు నిర్వహించారు.

సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు అర్చకులు సంకర్షణపల్లి

కృష్ణమాచార్యులు పీసపాటి వెంకట శేషాచార్యులు భాగవతం గోపాలాచార్యులు నండూరి రాజగోపాలాచార్యులు ఆధ్వర్యంలో ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము నిర్వహించారు. అనంతరం స్వామివారికి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు షోడశ ఉపచారములు సమర్పించి పంచామృతములతో ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం  తిరుమంజన

కార్యక్రమం నూతన వస్త్ర అలంకరణలు పూర్తి చేసి ప్రత్యేక ప్రసాదం నివేదనలు నీరాజన మంత్రపుష్పములు తీర్థ గోష్టి ప్రసాద్ వినియోగము నిర్వహించారు.
అనంతరం  స్వామివారి ఆలయంలో సాయంకాల అర్చనలు నాలాయిర సేవాకాలములు , ప్రసాద నివేదన నీరాజన మంత్రపుష్పములు తీర్థ గోష్టి ప్రసాద్ వినియోగం నిర్వహించారు.

ప్రతి సంవత్సరం

జేష్ఠ మాసంలో పౌర్ణమి తిథినాడు సాయంత్రం ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని స్వామివారికి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడంలో భాగంగా దీనిని నిర్వహించడం జరుగుతుందని వరప్రసాద్ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  దేవస్థానం ఇన్స్పెక్టర్ గిరీష్ సిబ్బంది మహేషు సురేష్ విజిలెన్స్ విభాగానికి చెందిన మోహన్

ఆచార్యులు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam