DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆనందపురం లో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో రైతు పూజోత్సవం 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  15, 2022 (డిఎన్ఎస్):*  ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు పూజోత్సవం పేరిట జె డీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్ గ్రీన్  సంస్థ సీఈఓ కే శృతి రైతులను ఘనంగా సత్కరించి గౌరవించారు. ఆనందపురం మండలం బోని గ్రామం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాడెద్దులను

ప్రత్యేకంగా అలంకరించి శృతి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఏరువాక ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు రైతులను ఘనంగా సత్కరించి సన్ గ్రీన్ సంస్థ నుంచి నుండి ప్రతి రైతుకు ఉపయోగపడే విత్తన కిట్ అందచేశారు.మహిళా రైతులకు ప్రత్యేకంగా గాజులతో అలంకరించి చిరు సన్మాన సత్కారం చేసారు.వృద్ద రైతులకు సన్ గ్రీన్ నుండి సీడ్

క్రెడిట్ కార్డ్ అందించి సన్మానించారు.భవిష్యత్తులో యువ రైతులని ప్రోత్సహిస్తూ హనీ జస్ట్ ఫ్రెష్ ఆప్ లో ప్రోడక్ట్ మేనేజర్స్ గా ఆరుగురుని నియమిస్తూ నియామక పత్రాలు అందించారు.సత్కార గ్రహీతలందరినీ పూలమాలాంకృతులను చేసి సన్‌గ్రీన్ సంస్థ ప్రశంసా పత్రం, సాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ వ్యవసాయ

ప్రధానదేశమైన భారత దేశంలో వ్యవసాయాన్ని పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారని , మానవాళి ఆకలి తీర్చే పుడమితల్లి కి వ్యవసాయ ప్రారంభానికి ముందు నేలను పూజించి, నేల తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండగే ఏరువాక పున్నమి అన్నారు.రైతులకు అన్నివిధాలా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని శృతి ప్రకటించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam