DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూలై 12 న సింహగిరి ప్రదక్షిణ, 13 న అషాడ పౌర్ణమి వేడుక

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  15, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర ఇలవేల్పు ద్వయరూపాల సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఉత్సవాల్లో గిరిప్రదక్షిణ ఉత్సవము ఎంతో వైశిష్ట్యం కలదని, దేవస్థానం ధర్మ కర్తల మండలి

సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీను బాబు తెలిపారు. 
బుధవారం సింహాద్రి నాధుడునీ దర్శించుకొని, నిత్య కళ్యాణం సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ పలు ఉత్సవాలు వివరాలు వెల్లడించారు. కోరోనా ప్రభావం వలన గిరి ప్రదక్షిణ ఉత్సవము గడచిన రెండేళ్లుగా నిర్వహించలేదన్నారు. ఐతే ఈ ఏడాది కరోనా

తగ్గుముఖం పట్టిన నేపద్యంలో గిరిప్రదక్షిణ ఉత్సవం జూలై 12 న నిర్వహించడానికి అవకాశం వుందని తెలిపారు.

కొండ దిగువన తొలి పావంచా నుంచి ప్రారంభమైన ఈ గిరిప్రదక్షిణ మహోత్సవం సింహగిరి చుట్టూ 32 కిలో మీటర్ల పొడవున కాలి నడకన సాగనుంది. జూలై 13 మరుసటి రోజు ఆషాఢ పౌర్ణమి నేపథ్యంలో సిరులొలికించే సింహాద్రి నాధుడుకి మూడు

మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.. అదే ఆఖరి విడత చందన సమర్పణ కాగా ఆ తరువాత వచ్చే శ్రావణ పౌర్ణమికి  కరాళ చందన సమర్పణ ప్రక్రియ పూర్తి కావడం జరుగుతుంది. దీనితో స్వామి పూర్తి నిత్య రూపములో కి వస్తారు... ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం, చందనోత్సవం, ధ్వజ స్తంభాలు ప్రతిష్ట లు, నృసింహ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా

ఆలయ వర్గాలు నిర్వహించాయి,, ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విశేష ఏర్పాట్లు చేసింది,, ధర్మకర్తల మండలి పర్యవేక్షణ తోపాటు ఆయా ఉత్సవాల విజయవంతానికి  తమ వంతు సేవలు అందించింది. సింహగిరిపై నిర్వహిస్తున్న పలు రకాల ఆర్జిత సేవలు కి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.. ఇలా ఉండగా బుధవారం సింహగిరిపై భారీ వర్షం

కురిసింది. వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది.. సింహగిరి అంత మబ్బులు మయంగా మారడంతో భక్తులు హర్షం వ్యక్తం చేసి  కేరింతలు కొట్టారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam