DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యార్థుల బస్సు పాస్ లకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఆర్టీసీ విశాఖ ఆర్ఎం

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  16, 2022 (డిఎన్ఎస్):* జూన్ నెలలో విద్యా సంవత్సరం మొదలుకావడంతో ప్రధాన విద్యా సంస్థలు తరగతులను ప్రారంభించండంతో విధ్యార్థులకు బస్సుసానుల జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ( ప్రజా రవాణా విభాగం)

 విశాఖపట్నం ప్రాంతీయ మేనేజరు ఎ. అప్పులరాజు ఓ ప్రకటనలో తెలియజేసారు. విశాఖపట్నం లోని ద్వారకా బస్ స్టేషను, రైల్వే స్టేషను, మద్దిలపాలెం, యం.వి.పి. బస్సు స్టేషను, పెందుర్తి, సింహచలం, గాజువాక మరియు స్టీలేసిటీ సెంటర్ల వద్ద ఉన్న ఎనిమిది బస్ పాసు కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేయనున్నట్టు తెలిపారు. బస్సు

 పాస్ ల కోసం వచ్చే విద్యార్థులకు సూచనలు చేసారు.:

1. www.apsrtcpass.in ఆన్లైన్ నందు వారి వివరములు మరియు పోటో నమోదు చేసుకొని, అప్లికేషన్ ఫారం ప్రింట్ తోసుకొవలయును.

2. ఆ అప్లికేషన్ పై తమ విద్యాసంస్థ ప్రిన్సిపాల్/ హెడ్మాష్టరు వారిచే ధృవికరణ చేయించి సంబంధిత డిపో కార్యాలయమునకు వెళ్ళవలెను. 

3. ఆ

అప్లికేషన్కు ఆధార్ మరియు పదవ తరగతి పాసయిన విద్యార్థులు అయినచో టెన్త్ క్లాసు మార్కులిస్టు నకలు జెరాక్స్ కాపీ తప్పక జతపరచవలెను. అప్లికేషన్ నందు ఫోన్ నెంబరు తప్పక వ్రాయవలెను.

అన్ని విద్యా సంస్థలకు సూచనలు:

1. అడ్మిషన్ లిస్టు తరగతుల వారిగా ప్రిన్సిపాల్/ హెడ్మాస్టరు సంతకంతో సంబంధిత డిపో మేనేజరు.

కార్యాలయమునకు అందజేయవలెను. అట్లు చేయని విద్యాసంస్థలకు పాసులు జారీచేయబడవు. 

2. విధ్యార్థుల జాబితా డిపోలకు అందజేయవలసిన బాధ్యత కేవలం విద్యాసంస్థలదే.

12 సంవత్సరాల లోపు బాలురు, 18 సంవత్సరాల లోపు బాలికలు (10వ తరగతి వరకు) ఉచిత బస్సుపాను, జనరల్ పాస్ (ఇయర్లీ), స్టూడెంట్లు జనరల్ బస్ పాస్ (క్వార్టరీ), స్టూడెంటు

జనరల్ బస్ పాస్ (మంత్రి), స్టూడెంటు గ్రేటర్ విశాఖ పాను, స్టూడెంటు రూట్ పాస్ మరియు J0C పాసు పొందగోరే విద్యార్థులు సంబందిత డిపోలకు (యం.వి.పి. బస్ స్టేషను, మద్దిలపాలెం, సింహచలం, గాజువాక మరియు స్టేట్టిసిటీ) వెళ్ళి అప్లికేషను వెరిఫికేషను చేయించుకొని, ఎనిమిది బస్సు పాస్ కౌంటర్లలో నేరుగా బస్సు పాసు పొందవచ్చును. అదనంగా ఎటువంటి

డబ్బులు ఆర్టీసీ సిబ్బందికి గానీ ఆయా విద్యా సంస్థలలో గాని ఇవ్వనవసరం లేదు అని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam