DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే ఆస్తుల ధ్వంసం దేశ ద్రోహుల చర్యలే: మాజీ ఎంపీ విజయశాంతి 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  17, 2022 (డిఎన్ఎస్):* అసాంఘిక శక్తులు శుక్రవారం ప్రార్ధనల తర్వాత దేశ వ్యాప్తంగా చేసిన అగ్నిగుండం దుర్ఘటనలు  కారణం యువకులు, విద్యార్థులు కాదని, వాళ్ళు చెప్తున్నట్టు గా అగ్నిపథ్ నియామకాలు కాదని, వేరే బలవత్తరమైన కారణం ఉందని దేశంలో జరిగిన

బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాలకు సంబంధించి ప్రకటించిన అగ్నిపథ్‌కు వ్యతిరేకమంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోను, దేశవ్యాప్తంగా రైళ్ళపై జరుగుతున్న దారుణ హింసాకాండ ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు ప్రచారం

చేస్తున్నట్టుగా ఇది ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు, విద్యార్ధుల పని కాదని, ఈ హింస వెనుక కచ్చితంగా ప్రేరేపిత కుట్ర ఉందనడంలో సందేహమే లేదన్నారు. మోదీ సర్కారును, బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలు... అసాంఘికశక్తులు, రౌడీ మూకల్ని రెచ్చగొట్టి చేయిస్తున్న హింసా కాండ ఇది అని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమం ఏళ్ళ

తరబడి తీవ్రస్థాయిలో జరిగిన రోజుల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు, యువతీ యువకులు ఎంతో సంయమనం పాటించి రైల్ రోకోలు, వంటావార్పులు, బంద్‌లు, శాంతియుత నిరసనలు చేశారని, దురదృష్టవశాత్తు కొందరు ఆత్మార్పణకు చేసుకున్నారు. అంతే తప్ప ఏనాడూ జాతి ఆస్తులను తగలబెట్టలేదు, అమాయక ప్రజల్ని భయభ్రాంతుల్ని చెయ్యలేదన్నారు.
తెలంగాణ

ప్రభుత్వం ఏళ్ళ తరబడి ఉద్యోగాలివ్వకుండా తాత్సారం చేసినా విద్యార్థులు శాంతియుతంగానే ఉన్నారు. అసలు దేశం కోసం ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులు, యువకులు ఈ దేశ ఆస్తులనే పాడుచేస్తారా? విధ్వంసకారులు సికింద్రాబాద్ స్టేషన్‌లో తమకు సంబంధం లేని వ్యక్తులు, దుకాణాలపై కత్తులు, కర్రలు, రాళ్ళతో దాడులు చేసి పార్శిళ్ళు

తగలబెట్టి, మహిళలు, వృద్ధులు సహా ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేశారు. ఇది విద్యార్ధులు, యువకుల పనంటే నమ్మాలా? ఇది కచ్చితంగా బీజేపీ వ్యతిరేకులు కుట్ర పన్ని రెచ్చగొట్టి చేయించిన పనేనని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు అమాయకులు కారు. నిజాలు త్వరలోనే బయటకొస్తాయన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని పూర్తి

విచారణ చేసి, ఈ ఘటన వెనుక ఉన్న అసాంఘిక దేశ వ్యతిరేక శక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. భద్రతా బలగాలు, రైల్వే పోలీసులు నిర్వహించిన పాత్ర అభినందనీయమన్నారు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam