DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*రిటైర్మెంట్ వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, పాతపట్నం లో వింత. .*

*పరీక్ష పాసైన 22 ఏళ్ళ తర్వాత ఉద్యోగం. .విస్తుపోయిన అభ్యర్థి*

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, జూన్  20, 2022 (డిఎన్ఎస్):* ప్రభుత్వ ఉద్యోగం కోసం అర్హత పరీక్షలన్నింటి లోనూ ఉత్తీర్ణత సాధించిన 22 ఏళ్ళ తర్వాత ఉద్యోగం వస్తే. .ఆ అభ్యర్థి పరిస్థితి అయోమయంగానే ఉంటుంది. యువకునిగా పరీక్ష పాసై, రిటైర్మెంట్ వయసులో

ఉద్యోగం లో చేరాలి అని ప్రభుత్వం ప్రకటిస్తే. . ఆ మనిషి స్థితి గందరగోళంగానే తయారయ్యింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండ‌లం లోని పెద్ద‌సీదికి చెందిన అల్ల‌క కేదారేశ్వ‌ర‌రావు 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ సాధించారు. అయితే ఫలితం వివాదం కావడంతో ఫైనల్ లిస్ట్ ను 22 ఏళ్ళ తర్వాత మొన్న ప్రకటించారు. దీనిలో అయన అర్హత సాధించినట్టు

తెలిసింది. కనీసం స్మార్ట్ ఫోన్ ను పూర్తిగా వినియోగించే అవగాహనా లేని ఈయనకు, తన ఫలితం గురించి చూడడం కూడా తెలియలేదు. స్థానిక యువకులు ఈయన్ని అభినందిస్తూ విషయం చెప్పడం తో ఆనందం వ్యక్తం చేసారు. యువకులు ఈయన గురించి తెలుసుకుని, సోషల్ మీడియా లో వీడియో పెట్టడం తో విషయం అందరికి తెలిసింది. 
ఈయన పరీక్ష వ్రాసినప్పుడే ఫలితాలు

వచ్చి ఉంటె. . .ఈయనకు వివాహం జరిగి, కుటుంబం ఏర్పడి ఉండేది. అయితే ఉద్యోగం లేకపోవడంతో నిరాశ తో వివాహం కూడా లేకుండా ఒక సైకిల్ లో చిన్న పాటు వ్యాపారం చేసుకోవడం మొదలుపెట్టారు. నేటికీ ఈయన అదే సైకిల్ పైనే తిరుగుతున్నారు. 
కేదారేశ్వ‌ర‌రావుకి 55 ఏళ్లు వ‌చ్చాక అంటే ఇప్పుడు ..24 ఏళ్ల త‌రువాత 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ వాళ్ల‌కి

ఉద్యోగాలిచ్చేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అన్ని సర్టిఫికెట్లు ఉండి, అంతా సవ్యంగా సాగి ఉద్యోగంలో చేరితే ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో తెలియనిస్థితి. 

సైకిల్‌పై సాదాసీదా బ‌ట్ట‌లు వేసుకుని ఊరూరికి వెళ్తే మ‌నిషి రూపం చూసి మానసిక స్థితిని తప్పుగా అంచనా వేసేవారు జనం. ఈయన అన్నామ‌లై

విశ్వ విద్యాలయం లో బీఈడీ చేసారు. ఇంగ్లీషు అన‌ర్గ‌ళంగా మాట్లాడేవాడు. బ‌తుకు భార‌మైంది. వృత్తి దూర‌మైంది. తానెవ‌రో మ‌రిచిపోయాడు. 

ఫోన్ కూడా సరిగ్గా వినియోగించడం తెలియని ఈయనకు థంబ్ లు వేసి మొబైల్ లో అప్ లోడ్ చేసే టీచర్ ఉద్యోగం ఎలా చేయగలేరనే అనుమానం వ్యక్తమవుతోంది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam