DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా అంతర్జాతీయ యోగ దివస్, మైసూర్ లో ప్రధాని మోడీ

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 21, 2022 (డిఎన్ఎస్):* మానసిక ప్రశాంతత, ఆత్మ స్థైర్యాన్ని కల్గించే యోగ అభ్యాసన ప్రపంచ దేశాలు అందరికి లభించాలి అనే సంకల్పంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ వ్యాప్తంగా యోగ దివస్ ను నిర్వహించేలా 2014 లో ప్రయత్నాలు చేసారు. గత 8 ఏళ్లుగా ప్రతి ఏడాది జూన్ 21 న అంతర్జాతీయ

యోగ దివస్ ను ప్రపంచంలోని అన్ని దేశాలు వైభవంగా నిర్వహించుకుంటున్నాయి. మంగళవారం భారత్ దేశం సహా పాకిస్తాన్, టిబెట్ లాంటి పలుదేశాలు నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు

తెలియజేశారు. 

ప్రముఖులు ఈ ప్రాంతాల్లో. . .

మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో  పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటారు. 
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పరమహంస పరివ్రాజకాచార్యులు, అపర రామానుజులు, త్రిదండి చిన్న జీయర్ స్వామి భాగ్యనగరం లోని శ్రీ రామానుజ సమతా మూర్తి ప్రాంగణంలో

తాము స్వయంగా యోగాసనాలను ఆచరించి, వేద విద్యార్థులు, భక్తులచే యోగ సాధన ఆచరింపచేసారు. 

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక లోని మైసూర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన యోగా దినోత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య

నాయుడు ఉత్తర ప్రదేశ్ లోని లక్నౌ లో యోగి ఆదిత్యనాధ్ దాస్ పాల్గొన్నారు. 

భారత దేశ అన్ని సైనిక శిబిరాల్లోనూ యోగ సాధన చేశారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన హిమ్‌వీర్లు ఉత్తరాఖండ్‌లో 16,000 అడుగుల ఎత్తులో యోగా సాధన చేశారు. నావికా దళ సిబ్బంది సముద్ర జలాల్లో నౌకలపై యోగాభ్యాసం

చేసారు. 

రాష్ట్ర పతి మాట్లాడుతూ యోగా భారత ప్రాచీన వారసత్వంలో ఒక భాగం ఇది మానవాళికి భారత్ ఇచ్చిన బహుమతి. ఇది శరీరం, మనస్సు, ఆత్మను సమతుల్యం చేస్తుంది. అందుకే ఈ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, దాని ప్రయోజనాలను ప్రజలంతా పొందాలని కోరుతున్నాను' అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. 
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam