DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎగుమతులు, దిగుమతుల్లో పురోగతి కోసమే కేంద్రం కృషి : ప్రధాని మోడీ 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 23, 2022 (డిఎన్ఎస్):* ఎగుమతులు, దిగుమతుల్లో పురోగతి కోసమే కేంద్రం కృషి చేస్తోందని, దానిలో భాగంగానే వాణిజ్య భవన్, నిర్యాత్ పోర్టల్ ఆవిష్కరణ అని  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియచేసారు. న్యూ ఢిల్లీలో వాణిజ్య భవన్ ను ఆయన గురువారం ప్రారంభించడం తో పాటు, నిర్యాత్

పోర్టల్ ను కూడా ప్రారంభించారు.  

ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఈ రోజు న పౌరులు కేంద్ర స్థానం లో ఉన్న పాలన తాలూకు ప్రయాణం మార్గం లో మరొక ముఖ్యమైన అడుగును వేయడం జరిగింది.  ఈ మార్గం లో దేశం గత 8 సంవత్సరాలుగా సాగిపోతూ ఉంది అన్నారు.  దేశం ఒక కొత్త వాణిజ్య భవనాన్ని కానుక గా అందుకొంది.  అంతేకాకుండా, ఒక

ఎగుమతుల పోర్టల్ ను కూడా స్వీకరించింది.  వీటిలో ఒకటి భౌతిక రూపం లోని మౌలిక సదుపాయం కాగా, మరొకటి డిజిటల్ మాధ్యమం లో అందిన మౌలిక సదుపాయం అని ఆయన అన్నారు.

దేశాని కి మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి అయిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క వర్థంతి కూడా ఈ రోజున పాటించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి గుర్తు కు

తీసుకు వచ్చారు.  ‘‘ఆయన విధానాలు, ఆయన నిర్ణయాలు, ఆయన సంకల్పం, మరి వాటిని సాధించడం స్వాతంత్య్ర భారతదేశాని కి దిశ ను అందించడం లో ఎంతో ముఖ్యమైనవి గా ఉన్నాయి.  ఇవాళ దేశం ఆయన కు వినమ్ర శ్రద్ధాంజలి ని అర్పిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మంత్రిత్వ శాఖ కు సమకూరిన ఒక కొత్త మౌలిక సదుపాయాన్ని గురించి

ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం కోసం చేసిన ప్రతిజ్ఞ ను నవీకరించే కాలం కూడా, తద్వారా ‘జీవన సౌలభ్యాన్ని’ కూడా పొందాలన్నారు.  ప్రాప్తిలో సౌలభ్యం అనేది ఈ రెండిటికీ మధ్య లంకె గా ఉంటుందని ఆయన అన్నారు.  ప్రభుత్వాని కి సమాచారాన్ని చేరవేయడం లో, అలాగే ప్రభుత్వాన్ని సులభమైన రీతి లో అందరికీ

అందుబాటులో ఉండేటట్లు చూడటం లో ఎలాంటి అవరోధాలు తలెత్తకూడదన్నది ప్రభుత్వ ప్రాధాన్యం గా ఉందని ఆయన అన్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల లో ఈ దృష్టి కోణం స్పష్టం గా ప్రతిబింబిస్తోందని కూడా ఆయన అన్నారు.

ఇటీవలి అనేక ఉదాహరణల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘న్యూ ఇండియా’ యొక్క నూతన పని

సంస్కృతి లో ముగింపు తేదీ అనేది ఎస్ఒపి లో భాగం;  మరి దానిని తప్పక పాటించవలసిందే అన్నారు.  ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులు ఏళ్ళ తరబడి అటక మీదకు చేరిపోనప్పుడు మాత్రమే, అలాగే అవి సకాలం లో పూర్తి అయినప్పుడే, ప్రభుత్వం యొక్క పథకాలు వాటి లక్ష్యాల ను చేరుకొన్నప్పుడే దేశం లో పన్ను చెల్లింపుదారు కు గౌరవం లభిస్తుంది అని ఆయన

వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ రూపం లో మనం ఒక ఆధునిక వేదిక ను ఏర్పాటు చేసుకొన్నాం అని ఆయన అన్నారు.  ఈ వాణిజ్య భవనం దేశం యొక్క ‘గతిశక్తి’ కి ఊతాన్ని అందిస్తుంది అని ఆయన అన్నారు.

కొత్త వాణిజ్య భవనం తన ప్రభుత్వం ఈ కాలం లో  వాణిజ్య రంగం లో సాధించిన విజయాల కు ఒక సంకేతం

కూడా అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  పునాది రాయి వేసిన కాలం గురించి ఆయన గుర్తు చేస్తూ, గ్లోబల్ ఇనొవేశన్ ఇండెక్స్ లో కొత్త కొత్త మార్పులు  మరియు మెరుగుదల ల అవసరం ఎంతైనా ఉంది అని స్పష్టం చేశారు.  ప్రస్తుతం భారతదేశం గ్లోబల్ ఇనొవేశన్ ఇండెక్స్  46వ స్థానం లో నిలిచింది.  భారతదేశం నిరంతరం తన స్థాయిని మెరుగు

పరచుకొంటోంది అని ఆయన అన్నారు.  
ఆ కాలం లో తాను వ్యాపారం నిర్వహణ లో సౌలభ్యాన్ని మెరుగు పరచడం గురించి కూడా మాట్లాడినట్లు చెప్తూ, ఈ రోజున 32,000లకు పైచిలుకు అనవసరమైన నియమాల పాలన ను తొలగించడమైందన్నారు.  అదే విధం గా భవనాని కి శంకుస్థాపన జరిగిన కాలం లో జిఎస్ టి అనేది ఒక సరికొత్త అంశమని, మరి ప్రస్తుతం ఒక్కో నెల కు ఒక లక్ష

కోట్ల రూపాయల మేరకు జిఎస్ టి వసూళ్ళు అనేది పరిపాటి గా మారిందని ఆయన చెప్పారు.  జిఇఎమ్ కోణం లో చూసినప్పుడు 9 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ లు గురించి అప్పట్లో చర్చించడం జరిగిందని, ప్రస్తుతం 45 లక్షల కు పైగా చిన్న, నవపారిశ్రామికులు పోర్టల్ లో నమోదై ఉన్నారని, అలాగే 2.25 కోట్ల రూపాయల కు పైగా విలువైన ఆర్డర్ లు లభించాయని

వివరించారు.  2014వ సంవత్సరం లో రెండు మొబైల్ యూనిట్ లు మాత్రమే ఉన్నవి కాస్తా, అప్పటికి దాదాపు 120 మొబైల్ యూనిట్ లకు పెరిగాయని ప్రధానమంత్రి ఉదాహరిస్తూ, నేడు ఈ సంఖ్య 200 లను మించిపోయిందన్నారు.  ప్రస్తుతం భారతదేశం లో 2300 నమోదిత ఫిన్-టెక్ స్టార్ట్-అప్స్ ఉన్నాయని, అదే నాలుగు సంవత్సరాల క్రితం వీటి సంఖ్య 500 లుగా ఉందన్నారు.

 వాణిజ్య భవనాని కి పునాది రాయి పడిన కాలం లో భారతదేశం ప్రతి సంవత్సరం లో 8000 స్టార్ట్-అప్స్ ను గుర్తిస్తూ ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 15000 లకు పైబడింది అని ప్రధాన మంత్రి తెలిపారు.

గత సంవత్సరం లో ప్రపంచవ్యాప్తం గా చరిత్రాత్మకమైన అంతరాయాలు చోటు చేసుకొన్నప్పటి కీ భారతదేశం యొక్క ఎగుమతులు మొత్తం 670 బిలియన్ డాలర్, అంటే

రూపాయల లో చూసినప్పుడు 50 లక్షల కోట్ల రూపాయల వద్ద నిలిచాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  కిందటి సంవత్సరం లో ప్రతి ఒక్క సవాలు తలెత్తినప్పటికీ 400 బిలియన్ డాలర్ విలువ గల వస్తురూప ఎగుమతుల స్థాయిని అధిగమించాలి అని నిర్ణయించుకొంది.  ఇక్కడ 400 బిలియన్ డాలర్ అంటే అది 30 లక్షల కోట్ల రూపాయల కు సమానం.  మనం దీనిని దాటిపోయి, 418 బిలియన్

డాలర్ విలువ గల ఎగుమతుల తో ఒక కొత్త రెకార్డు ను సృష్టించాము.  మరి ఇది 31 లక్షల కోట్ల రూపాయల కు సమానం గా ఉంది అని ఆయన అన్నారు.  ‘‘గత కాలం లో సాధించినటువంటి ఈ సాఫల్యం ఇచ్చిన ప్రోత్సాహం తో మనం ప్రస్తుతం మన ఎగుమతి లక్ష్యాల ను పెంచుకొన్నాం.  వాటిని సాధించడాన్ని మన ప్రయాసల ను రెండింతలు చేశాం.  ఈ కొత్త లక్ష్యాల ను

సాధించాలి అంటే అందుకు ప్రతి ఒక్కరి సామూహిక ప్రయత్నం చాలా అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు.  కేవలం స్వల్పకాలిక లక్ష్యాలనే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యా ల ను పెట్టుకోవాలి’’ అని కూడా ఆయన అన్నారు.

నేశనల్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ ఫార్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్  (‘ఎన్ఐఆర్ వైఎటి’..దీనికి సంక్షిప్త

రూపం ‘నిర్యాత్’) సంబంధిత వర్గాలు అన్నింటికీ రియల్ టైమ్ డాటా ను అందించడం ద్వారా ఆ వర్గాలు వాటి మధ్య గీసుకొన్న గిరుల ను ఛేదించడం లో సహాయకారి అవుతుంది అని ప్రధానమంత్రి అన్నారు.  ‘‘ఈ పోర్టల్ ద్వారా ప్రపంచం లో 200 లకు పైగా దేశాల కు ఎగుమతులు జరిపే 30 కి పైగా కమొడిటీ గ్రూప్స్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుబాటు

లోకి వస్తుంది.  రాబోయే కాలం లో జిల్లా వారీ ఎగుమతుల కు సంబంధించిన సమాచారం కూడా ఇందులో అందుబాటు లోకి వస్తుంది.  ఇది జిల్లాల ను ఎగుమతుల కు ముఖ్యమైన కేంద్రాలు గా అభివృద్ధి పరచడం కోసం సాగే ప్రయాసల ను బలపరుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశం దశ నుంచి అభివృద్ధి చెందిన దేశం

దశ కు మార్పు చెందడం లో ఎగుమతులు అధికం కావడం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  గడచిన 8 సంవత్సరాల లో భారతదేశం కూడా తన ఎగుమతుల ను పెంచుకొంటూ ఎగుమతి లక్ష్యా ల ను  అందుకొంటోందని ప్రధాన మంత్రి చెప్పారు.  ఎగుమతుల ను పెంచుకోవడం కోసం ఉత్తమమైనటువంటి విధానాల ను అనుసరించడం, ప్రక్రియ ను సులభతరం

గా మార్చడం, మరి ఉత్పత్తుల ను కొత్త బజారుల కు తీసుకు పోవడం ఎంతగానో సాయపడ్డాయి అని ఆయన అన్నారు.  ప్రస్తుతం ప్రభుత్వం లోని ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ, ప్రతి ఒక్క విభాగం ఒక సంపూర్ణమైన ప్రభుత్వం వైఖరి తో ఎగుమతుల ను పెంచడానికి పెద్ద పీట ను వేస్తోంది అని ఆయన అన్నారు.  అది ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ కావచ్చు, లేదా విదేశీ

వ్యవహారాల మంత్రిత్వ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు లేదా వాణిజ్య శాఖ కావచ్చు అన్ని శాఖలు ఒక ఉమ్మడి లక్ష్యం కోసం సమష్టి గా ప్రయత్నాలు చేస్తున్నాయి అని ఆయన అన్నారు.  ‘‘కొత్త రంగా ల నుంచి ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయి. అనేక ఆకాంక్షభరిత జిల్లాల నుంచి సైతం ఎగుమతులు ప్రస్తుతం అనేక రెట్ల మేరకు పెరిగాయి పత్తి

ఎగుమతులు మరియు చేనేత ఉత్పత్తుల ఎగుమతుల లో 55 శాతం పెరుగుదల అనేది అట్టడుగు స్థాయి లో జరుగుతూ ఉన్న కృషి ఏమిటి అనేది చాటుతోంది’’ అని ఆయన అన్నారు.

‘వోకల్ ఫార్ లోకల్’ ప్రచార ఉద్యమం ద్వారా, ‘వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్’ స్కీము ద్వారా స్థానిక ఉత్పత్తుల కు ప్రభుత్వం ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం అనేది

కూడా ఎగుమతులు అధికం కావడానికి తోడ్పడింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రస్తుతం మన ఉత్పత్తుల లో అనేకం ప్రపంచం లోని కొత్త దేశాల కు మొదటిసారిగా ఎగుమతి అవుతున్నాయి.  ‘‘మన స్థానిక ఉత్పత్తులు శరవేగం గా ప్రపంచ ఉత్పత్తులు గా రూపొందుతున్నాయి’’ అని ఆయన అన్నారు.   ఈ సందర్భం లో ప్రధాన మంత్రి బహ్రెయిన్ కు ఎగుమతి

అవుతున్న సీతాభోగ్ మిఠాయీ ని గురించి, లండన్ కు పోతున్న నాగాలాండ్ కు చెందిన తాజా కింగ్ బ్రాండ్ మిర్చిని గురించి, దుబయ్ కి ఎగుమతి అవుతున్న అసమ్ కు చెందిన తాజా బర్మీస్ ద్రాక్ష పండ్ల ను గురించి, ఫ్రాన్స్ కు ఎగుమతి అవుతున్న ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆదివాసీ మహువా ఉత్పత్తుల ను గురించి, అలాగే దుబయీ కి ఎగుమతి అవుతున్న కార్ గిల్

ప్రాంత ఖుమానీ పండ్ల ను గురించి ఉదాహరణలుగా వివరించారు.

ఇటీవల తీసుకొన్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి మరోమారు నొక్కి చెప్తూ, ‘‘మనం మన రైతుల కు జిఐ ట్యాగింగ్ ను గురించి వివరిస్తూ, వారికి అవగాహన కల్పిస్తున్నాం; అలాగే నేతకారుల కు కూడా సాయపడుతున్నాం, అంతేకాకుండా మన సాంప్రదాయక ఉత్పత్తుల విషయం లో ఎగుమతి

సంబంధిత నియమాల ను గురించి తెలియజెప్తున్నాం’’ అన్నారు.  కిందటి సంవత్సరం లో యుఎఇ తో మరియు ఆస్ట్రేలియా తో కుదిరిన వ్యాపార ఒప్పందాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.  ఇతర దేశాల తో సైతం బోలెడంత ప్రగతి చోటు చేసుకొంది అని ఆయన వెల్లడించారు.  ఎన్నో సవాళ్ళ తో కూడుకొన్నటువంటి ఒక వాతావరణాన్ని భారతదేశాని కి

అందివస్తున్న అవకాశాలు గా మార్పిడి చేయడం కోసం భారతదేశ దౌత్య సంస్థలు కఠోరం గా శ్రమిస్తున్నాయి అని ఆయన ప్రశంసించారు.  ‘‘వ్యాపారం జరగాలి అంటే గనుక కొత్త బజారుల ను గుర్తించడం, అవసరాల కు అనుగుణం గా ఉత్పత్తుల ను తయారు చేయడం అనేవి దేశ పురోగతి కి ఎంతో ముఖ్యమైన అంశాలు’’ అని ఆయన అన్నారు.

ఇటీవలి కాలం లో

అభివృద్ధి పరచిన పోర్టల్స్ మరియు ప్లాట్ ఫార్మ్ ను ఎప్పటికప్పుడు సమీక్షించవలసిందిగా ప్రతి విభాగాన్ని ప్రధాన మంత్రి అభ్యర్థిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.  ‘‘ఈ ఉపకరణాల ను ఏ లక్ష్యాల తో అయితే మనం అభివృద్ధి పరచామో ఆ లక్ష్యాల ను ఎంతవరకు సాధించామో, మరి ఒక సమస్య అంటూ ఎదురైనప్పుడు ఆయా సమస్యల ను పరిష్కరించడం కోసం

ప్రయత్నాల ను తప్పక చేయాలి అని ఆయన సూచించారు 

ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్, అనుప్రియ పటేల్ తదితరులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam