DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరి లా అగ్నిపథ్ ను ఫ్రీ స్కీంగా ప్రకటించి ఉంటె విపక్షాల నోళ్లు లేచేవి కాదు

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 23, 2022 (డిఎన్ఎస్):* భారత దేశం లో ప్రస్తుతం ఎవరి నోటా విన్నా వినిపించే పదం అగ్నిపథ్ స్కీం. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రవేశ పెట్టిన ఈ స్కీం ను విపక్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. అయితే అందరు ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన స్కీం లాగానే మోడీ కూడా దీన్ని

ఉద్యోగం, ఉపాధి లాగా కాకుండా ఉచిత పథకంగా ప్రవేశ పెట్టి ఉంటె. . .విపక్షాల నోళ్లు మూటలు పడి ఉండేవి. 

ఈ అగ్నిపథ్ స్కీం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 వేల వరకూ జీతం ఇవ్వడంతో పాటు, నాలుగేళ్ళ కాలం ముగిశాక దాదాపు రూ. 12 వరకూ నిధులు ఇవ్వడం గమనార్హం. ఈ పధకం ఒక ఉద్యోగం గా పరిగణించకుండా చూస్తే. . .ఇది కూడా

ఒక ఉచిత స్కీం పధకం లాంటిదే. అయితే. చాలా రాష్ట్రాల్లో జనాన్ని ఇళ్లల్లో కూర్చోబెట్టి ప్రతి నెలా డబ్బులు ఇస్తుంటే. . కష్టపడడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు?  అదే మోడీ అగ్నిపథ్ పథకం ద్వారా నెలసరి వేతనం ఇవ్వడం తో పాటు ఒక కట్టుదిట్టమైన శిక్షణతో పాటు, పటిష్టమైన సాయుధ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. తర్వాత వాళ్ళు ఆర్ధికంగా

స్థిరపడేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అదే రాష్ట్రాల్లో అయితే యువతను సోమరులుగా చేస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. 

కేవలం భారత దేశ అభివృద్ధిని మాత్రమే కాంక్షించే మోడీ, భారత సైనిక శక్తిని బలోపేతం చేసేందుకు, వయో శక్తి యువకులతో మరింత పటిష్ట పరిచేందుకు ఈ అగ్నిపథ్ ను ప్రవేశ పెట్టారు. అన్ని రాష్ట్రాల్లోని

ముఖ్యమంత్రులు ప్రచారం చేసుకుంటున్నట్టు ఉచిత పధకాలు, నెలకి వేళకి వేలు డబ్బులు ఉచితంగా కుమ్మరించడం చేతగాని మోడీ, దీన్ని ఒక ఉపాధిగా ప్రకటించారు. 

దీంతో కాంగ్రెస్, వామపక్షాలు, సహా అన్ని విపక్షాలు యువతకు 4 ఏళ్ళ తర్వాత ఉద్యోగం ఎందుకు ఇవ్వరు? వాళ్ళ బ్రతుకులతో ఆటలాడుతున్నారు అంటూ నానా యాగీ చేస్తూ. . ఎంతో ఉజ్వల

భవిష్యత్ ఉన్న యువతను రెచ్చగొట్టి దేశం మీద పడి విధ్వంసం చేసేలా ప్రేరేపించాయి. అయితే ఆ పార్టీల వాళ్ళెవ్వరూ తెరముందుకు రాకపోవడంతో, . .కేవలం యువత మాత్రం బలయ్యారు. 

రాష్ట్రాలపై నోరెత్తలేని విపక్షాలు మోడీ పై 

రాష్ట్రాలకు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపేస్తూ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిరుద్యోగ

భృతి, ఆరోగ్య స్థితి బాగున్నా వాళ్ళని కూడా ఇళ్లల్లోనే కూర్చోబెట్టి ప్రతి నెల వేలకు వేలు కుమ్మరిస్తుంటే లేవని నోళ్లు, మోడీ ఉద్యోగం ఇస్తాం అనగానే మూలాన ఉన్న ముసలి వాళ్ళు కూడా నోరుపుచుకూ పడిపోతున్నారు. 

కేవలం దేశ సంరక్షణ, భద్రతా, యువతకు అభ్యున్నతి కల్పించడం కోసం ఒక బృహత్తర అవకాశం కల్పిస్తున్న మోడీ వద్ద

ఇలాంటి పిపిలకాలని పట్టించుకునే తీరిక, ఓపిక లేవు. 

గత 70 ఏళ్ళ కాలం పాటు ఇదే దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, సహా ఇతర విపక్షాల పార్టీలు తాము అధికారం లో వెలగబెట్టిన నాడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అని ప్రశ్నిస్తే మీనమేషాలు లెక్కపెట్టడం తప్ప మరో గతి లేదు. 

వీళ్ళకి ప్రజలకు మేలు చెయ్యడం చేత గాదు

కానీ,  ఆలా మేలు చెయ్యడానికి ప్రయత్నం చేసే నరేంద్ర మోడీ లాంటి వాళ్లకి అడ్డుపడిపోయి మరీ విమర్శించడం మాత్రం బాగా అలవాటు గా మారింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam