DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమర్‌నాథ్ యాత్ర కు జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకూ అనుమతి 

*ప్రతి రోజు 7500 మందికే రిజిస్ట్రేషన్ అనుమతి: అమర్నాధ్ ట్రస్ట్ బోర్డు*

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 24, 2022 (డిఎన్ఎస్):* హిందువులు అత్యంత పవిత్రం భావించే హిమాలయ పర్వత శ్రేణిలోని అమర్నాధ్ గుహల్లో నెలకొన్న అమర్నాధ్ ను దర్శించేందుకు ఈ నెల 30 నుంచి అనుమతి ఇస్తున్నారు. ఈ యాత్రలో దేశ

విదేశాల్లోని లక్షలాది మంది భక్తులు ప్రతి ఏడాది పాల్గొంటారు. ఈ సంవత్సరం ఈ యాత్ర ను జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకూ మాత్రమే అనుమతిస్తున్నారు. 

బాబా అమర్ నాధ్. .. : 

ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్‌ కొండల్లో 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల

దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి.శ్రీ అమర్‌నాథ్‌జీ పవిత్ర గుహ పుణ్యక్షేత్రానికి వెళ్లే యాత్ర వేసవి నెలల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. 

బాబా అమర్‌నాథ్ గుహ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. 300 బిసికి

చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు రాజతరింగిణి  పుస్తకంలో వివరించారు. 


శ్రావణ మాసంలో (జూలై - ఆగస్టు) శ్రీ అమర్‌నాథ్‌జీ యొక్క

పవిత్ర గుహ పుణ్యక్షేత్రం భక్తులకు దర్శనం లభిస్తుంది. ఇక్కడ లింగం రూపంలో ఉన్న శివుని చిత్రం సహజంగా మంచు - స్టాలగ్‌మైట్‌తో ఏర్పడిండి. సూర్య చంద్రుల పరిభ్రమణం బట్టి ఈ శివలింగం ఎత్తు పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. 

గుహ లోపల, మంచుతో నిండిన నీటి బిందువులు నిరంతరంగా కారుతూ ఉంటాయి. ఈ చుక్కల ఆధారంగా దాదాపు

కొన్నేళ్ల క్రితం ఈ అమర్నాథ బాబా ఎత్తు 40 అడుగులు ఉండేదని, క్రమేణా వాతావరణ ప్రభావంతో ఎత్తు తగ్గినట్టుగా తెలుస్తోంది. అమర్‌నాథ్ శివలింగం ఎత్తు పెరగడం, తగ్గడం అనేది చంద్రునితో ముడిపడివుంటుంది. పౌర్ణమి నాడు, శివలింగం పూర్తి పరిమాణంలో ఉంటుంది. అమావాస్య రోజున శివలింగం పరిమాణం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అమర్‌నాథ్ గుహ

శ్రీనగర్‌కు దాదాపు 145 కి.మీ. దూరంలో ఉంది. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో హిమాలయాల మీద ఉంది. శివలింగం సహజంగా గుహలో ఏర్పడింది. శివలింగంతో పాటు గణేశుడు, పార్వతి, భైరవ్ మహారాజ్ విగ్రహాలు కనిపిస్తాయి. 

చాలా కాలం ఈ ఈ క్షేత్రం మంచులో మునిగిపోవడం తో భక్త సంచారం కూడా జరగలేదని తెలుస్తోంది. అయితే

 ఒక గొర్రెల కాపరి 15 వ శతాబ్దం లో ఈ అమర్ నాధుణ్ని దర్శించి తరించినట్టు ఒక కథనం కూడా ఉంది. 

ఈ ఆలయం తెరిచిన మొదటి రోజు హిమాలయ ప్రాంతాల్లో విధులు నిర్వహించే భారతీయ సైనికులకు మాత్రమే కల్పించడం జరుగుతుంది.  

శ్రీ అమర్‌నాథ్ యాత్ర 2022 - షెడ్యూల్ : 
 
శ్రీ అమర్‌నాథ్ యాత్ర సాధారణంగా హిందూ

క్యాలెండర్ ప్రకారం స్కంద షష్టి  రోజున (జూన్ 30, 2022 న )  మొదలై శ్రావణ పూర్ణిమ ( రక్షా బంధన్ ఆగస్టు 11 ) నాడు ముగుస్తుంది. అమర్‌నాథ్‌ గుహ పుణ్యక్షేత్రం శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ చట్టం 2000 ద్వారా) నిర్వహించబడుతోంది.  దీని ఎక్స్-అఫీషియో చైర్మన్‌గా జమ్మూ మరియు కాశ్మీర్

గవర్నర్‌ ఉంటారు. 

యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పని సరి. 

ఈ అమర్‌నాథ్‌ యాత్ర చేసేవారు తమ పేర్లను తప్పని సరిగా నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ రిజిస్ట్రేషన్  ఏప్రిల్ 11, 2022 నుండి అమలు లో ఉంది. దేశ, విదేశాల్లోని భక్తులు వ్యక్తిగతం గాను, బృందం గాను తమ పేర్లు నమోదును సులభతరం చేసుకునే అవకాశాన్ని గత

సంవత్సరం నుండి ప్రవేశపెట్టింది. నియమాలు తప్పని సరిగా అందరూ పాటించాలి. 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజు 7500 మంది యాత్రికులను మాత్రమే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి అనుమతించాలని నిర్ణయించారు. 

ఇది పంజ్‌తర్నికి వెళ్లే రెండు మార్గాల్లో హెలికాప్టర్లలో ప్రయాణించే యాత్రికులు

మినహాయించబడింది.

2022 కోసం శ్రీ అమనాథ్ యాత్ర షెడ్యూల్‌లో ప్రతి రోజు యాత్రికుల (యాత్రికులు) కోసం పహల్గామ్-చందన్వారి ట్రాక్ మరియు సోనామార్గ్-బల్తాల్ ట్రాక్ ఒక్కొక్కటి 7500 రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉండటానికి అనుమతించబడుతుందని ఇది సూచిస్తుంది.

అమర్‌నాథ్ యాత్ర రెండు మార్గాల్లో సాగుతుంది. ఒక మార్గం

పహల్గామ్ మీదుగా, మరొక మార్గం సోన్‌మార్గ్ బల్తాల్ మీదుగా సాగుతుంది. 

ఈ యాత్రను చేయించేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ట్రావెల్ సంస్థలు అన్ని వసతులు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల నుంచి ఈ యాత్రకు భక్తులను తీసుకు వెళ్లేందుకు బస్సు, రైళ్ల ద్వారా ప్యాకేజి లను ఇప్పడికే ప్రకటించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam