DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెంకోజీ పాలెం వద్ద కారును ఢీకొన్న లారీ, అంతా సురక్షితం

( Report by: Mr. Raghuram.B- special correspondent )

విశాఖపట్నం, ఆగస్టు 11 , 2018 (DNS Online ): విశాఖపట్నం నగరం లోని వెంకోజీపాలెం జాతీయ రహదారి పై గల ట్రాఫిక్ సిగ్నల్ కూడలి వద్ద లారీ ఢీకొట్టడం ఒక కారు తుక్కు తుక్కు

అయ్యింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిగ్నల్ దాటుతున్న ఒక ట్రావెల్స్ కారును విజయనగరం నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు

మొత్తం రూపురేఖలు మారిపోయాయి. కారు డ్రైవరు, కారులో ఉన్న మహిళా ప్రయాణీకురాలు సురక్షితంగానే ఉన్నారు. సిగ్నల్స్ పని చెయ్యక పోవడం తో అప్పడికే కారు రోడ్డు సగం

దాటిపోయింది, దీన్ని గమనించని లారీ డ్రైవర్ అదే వేగంతో ముందుకు దూసుకు రావడంతో కాదు అక్కడే ఉన్న మరో లారీకి మధ్య ఇరుక్కు పోయింది, ప్రమాదం జరిగిన సమయంలో కారు

డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడం తో, అక్కడే ఉన్న నగర వాసులు డ్రైవర్ ను ఆసుపత్రి కి తరలించారు. కారులో ఒక మహిళా ప్రయాణీకురాలు కూడా ఉన్నారు. ఆమెకు కూడా స్వల్ప గాయాలు

కావడంతో సమీపం లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ కూడలి అత్యంత ప్రమాదకర ప్రాంతం అయినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలూ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని

స్థానికులు తెలియచేస్తున్నారు.

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #lorry  #car   #accident  #hits  #smashed  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam