DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారణాశిలో హెలికాఫ్టర్ కి తప్పిన ప్రమాదం, యుపి సీఎం యోగి సురక్షితం 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 26, 2022 (డిఎన్ఎస్):* కోట్లాది మంది భారతీయుల ఆశల నేత ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ కు తృటిలో ప్రమాదం తప్పి గండం గడిచింది. ఆదివారం ఉదయం వారణాశి నుంచి లక్నో కు ఆయన వెళ్తున్న హెలికాఫ్టర్ కు అడ్డంగా ఒక పక్షి రావడంతో సాంకేతిక ఇబ్బంది రావడంతో పైలట్ చాకచక్యంగా అత్యవసర

లాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే  . .

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు వారణాశి లో జరుగుతున్నా అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు  యోగి శనివారం వారణాశి కు చేరుకున్నారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని ఆదివారం ఉదయం రాజధానికి బయలు దేరి వెళ్లేందుకు సిద్ద పడ్డారు. ఆదివారం ఉదయం  9.05

గంటలకు తిరిగి ఉత్తర ప్రదేశ్ రాజధానికి బయలుదేరిన ఆయన  హెలికాఫ్టర్ కు అడ్డంగా ఒక పక్షి రావడంతో హెలికాప్టర్ వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ గ్రౌండ్స్ లో అత్యవసరంగా సురక్షితంగా

దింపేశారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యి  అక్కడ నుంచి వారణాసి లోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ కు తీసుకుని వెళ్లి  యోగి ఆదిత్యానాద్ ను సాధారణ విమానం లో లక్నౌ కు పంపే ఏర్పాట్లు చేసారు. ఆయన కార్యక్రమాలన్నీ ఒక గంట ఆలయస్యంగా జరుగుతున్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam