DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తీస్టా అరెస్ట్ తో కలుగులో ఎలకలు ఒక్కసారిగా బయటకు. . .

*బీజేపీ పై విరుచుకుపడుతున్న సంఘ వ్యతిరేక శక్తులు. .*

*(DNS Report: ఇదీ రాజకీయం, సత్య గణేష్ BV, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 27, 2022 (డిఎన్ఎస్):* గుజరాత్ అల్లర్ల పేరిట కోట్లాది గా నిధులు దోచుకుంటూ, బాగా ఎంజాయ్ చేసిన తీస్టా సెతల్వాద్‌ అరెస్ట్ తో సంఘ వ్యతిరేక శక్తులన్నీ కలుగులోని ఎలుకల మాదిరిగా  ఒక్కక్కటిగా బయటకు

వస్తున్నాయి.  సుప్రీం కోర్టు లో జరిగిన ఘటన పర్యవసానంగా తీస్తాను అదుపులోకి తీసుకోడాన్ని ఈ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 

సోషల్ మీడియా వేదికగా భారతీయ జనతా పార్టీ ఫై ఈ శక్తులు విరుచుకుపడుతున్నాయి. ఈరోజు తీస్టా అరెస్ట్ అయ్యింది. 2024 లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మనందరి పరిస్థితి ఏంటి? అంటూ

మండిపడుతున్నారు. 

అసలు తీస్తాను ఎందుకు అరెస్ట్ చేశారు?  ఆమె ఎన్నో అంశాల్లో చట్ట వ్యతిరేకంగా పనులు చెయ్యడం, ప్రోత్సహించడమే కాక, కొన్నింటిలో నేరుగా పాల్గొంది.  

గుజరాత్‌లో హిందూ దేవుళ్ల అభ్యంతరకర చిత్రాలను ట్వీట్ చేసినందుకు పలు అభియోగాలు మోపారు. ఆమెపై మతపరమైన శత్రుత్వాన్ని

ప్రోత్సహించడంతోపాటు IPCలోని సెక్షన్లు 153 (a) మరియు 295 (a) ప్రకారం మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా, హానికరమైన చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. ఆమెపై సెక్షన్లు 65, 66(ఎ), 66(బి), మరియు 67 కింద బుక్ చేయబడింది.

తీస్తా సెతల్వాద్‌ పై నమోదైన సెక్షన్‌లు ఇవే:  468 (మోసం కోసం ఫోర్జరీ), 471 (నకిలీ పత్రం లేదా

రికార్డును ఉపయోగించడం), 194 (తప్పుడు సాక్ష్యాలను అందించడం లేదా కల్పించడం) కింద నేరారోపణలు మోపారు. మరణశిక్ష నేరం), 211 (గాయపరిచే ఉద్దేశ్యంతో చేసిన నేరం యొక్క తప్పుడు అభియోగం), 218 (ప్రజా సేవకుడు తప్పుగా నమోదు చేయడం) మరియు భారతదేశ శిక్షాస్మృతి యొక్క 120B (నేరపూరిత కుట్ర).

ఇన్నిసందర్భాలను నేరుగా న్యాయస్థానమే తప్పు

పట్టిన సందర్భంలో కూడా ఈ  సంఘ వ్యతిరేక దుష్ట శక్తులు  నేరుగా అధికార పార్టీ పై విరుచుకు పడడం అంటే. . తీస్టా చేసిన నేరాల్లో వీళ్ళకి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాత్ర ఉంది అనే విషయం తెలుస్తోంది. పైగా ఆమెను అరెస్ట్ చేస్తే. . వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియాల్సి ఉంది. 

ఆమెకు సానుభూతి ప్రకటించాలి అంటే.

.ఆమెకు సంఘీభావం ప్రకటించాలి అంటే తప్ప మన గతేంటి అనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. 

ఈమెతో పాటు ఎన్నో ఎన్ జి ఓ ల్లో నేరుగా భాగస్వాములుగా ఉన్న వారికి ఒక్క సారిగా గుబులు మొదలయ్యింది. ప్రస్తుతం ఒక్క గుజరాత్ అల్లర్ల ఘటన మాత్రం వెలుగు చూసింది. దీనిలో తీస్తా దొరికింది. మరో పర్యాయం బీజేపీ అధికారం లోకి వస్తే. .మిగిలిన

ఘటనలను వెలుగు లోకి తీసే అవకాశం ఉందని, వాటిల్లో ఈ దుష్ట శక్తులన్నీ బయట పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

వీళ్ళు చేసే కార్యాచరణ చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి ఉంటె. . వీళ్ళు ఎందుకు భయపడాలి? ఎవరికీ భయపడాలి.? 

వీళ్ళు చేసే పనిలో తప్పుడు ప్రక్రియలు అని వీళ్ళకి తెలిసే చేస్తున్నట్టుగా ఈ పోస్ట్ లు బయట

పెడుతున్నాయి. 

ఇలా సమాజంలోనే సభ్యులుగా జీవిస్తూ. .. సమాజాన్ని అస్తవ్యస్తంగా చేస్తున్న ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులపై సైతం విచారణ జరిపి, తప్పుడు పనులు చేసేవారిని, అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గతంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం వీళ్ళ చుట్టూనే తిరుగుతుండడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

గతంలో 20 ఏళ్ళ క్రితం గుజారాత్ లో జరిగిన అల్లర్లను పూర్తిగా విచారణ జరిపిస్తే. . ఒక్క దుష్ట శక్తి వెలుగులోకి వచ్చింది. ఇంకా కూలంకషంగా విచారణ జరిపితే. . ఈ దేశంలో జరుగుతున్నా అల్లర్లకు వెనక ఉన్న అదృశ్య శక్తులు వెలుగు చూసే అవకాశం ఉంది. 

ఇన్ని నేరాలు చేసిన తీస్టా కు యూపిఏ  ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా

ఇచ్చింది. ఇప్పుడు ఈమెకు ఇచ్చిన  పురస్కారం తక్షణం వెనక్కి తీసుకోవాలి అనే ఉద్యమం కూడా మొదలయ్యింది. ఈ దేశానికి సేవ చేసిన వారికి ఇవ్వవలసిన గౌరవం దేశ ద్రోహులకు అందించడం అంటే ఈ దేశ ప్రజలను అగౌరవ పరచడమే అని నెటిజన్లు మండిపడుతున్నారు. 

గత 20 ఏళ్లుగా నరేంద్ర మోడీ ని దోషిగా చూపిస్తూ ఈ దేశ వ్యతిరేకశక్తులు ఎన్ని

కుట్రలు పన్నినా. . న్యాయస్థానం పై ఉన్న గౌరవం కారణంగా మోడీ కనీసం వీళ్ళను విమర్శించడం కూడా చెయ్యక పోవడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam