DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రoలో ప్రతి 50 కిమీ కో పోర్ట్ లేదా ఫిషింగ్ హార్భర్: మంత్రి గుడివాడ 

*(DNS Report: Sathya Ganesh BV, Reporter, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 27, 2022 (డిఎన్ఎస్):* రాష్ట్రoలో ప్రతి 50 కిలో మీటర్ల పరిధిలో ఒక పోర్టుకాని, ఫిషింగ్ హార్భర్ కానీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిర్ణయించు కున్నారు అని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్ నాధ్ తెలియ చేశారు. అంతర్జాతీయ ఎం. ఎస్. ఎం. ఈ దినోత్సవాన్ని

పురస్కరించుకుని విశాఖపట్నం లోని వుడా ఎరినా లో రాష్ట్ర స్థాయి ఎం.ఎస్.ఎం.ఈ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ మాట్లాడుతూ. ఉన్న 974 కి. మీటర్ల సముద్రతీరాన్ని సద్వినియోగం చేసుకోడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తు న్నామని చెప్పారు. విశాలోని ఫార్మా కంపెనీలు తమఉత్పత్తులను ఎగుమతి చేసుకోడానికి

సముద్ర తీరం ఎంతగానో ఉపయోగ పడుతుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు వాటన్నింటికోసం 15వేల కోట్లు రూపాయలు ఖర్చుచేస్తున్నామని ఆయన తెలియచేశారు. ఇటీవల దావోస్ వెళ్ళినపుడు ఆదిత్య మిట్టల్ ను సీఎం జగన్మో నరెడ్డి కలిసినప్పుడు మన రాష్ట్రంలోని తీరప్రాంతంలో భూమిని కేటాయిస్తే భారి స్థాయిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి

సిద్ధంగా ఉన్నామని చెప్పారని మంత్రి అమర్ వెల్లడించారు . అలాగే విశాఖపట్నంను బీచ్ ఇ.టి. హాబ్ గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలురూపొందిస్తున్నామని చెప్పాం.
అనేక దేశాలు పరిశ్ర మల ఏర్పాటుకు తహతహలాడుతున్నా వారికి అంతగా అవకాశాలు లేవని, అన్ని అవకాశాలు ఉన్న మనం ఎందుకు ఉపయోగించు కోకూడదని అమర్ ప్రశించారు.
ఇక

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి సంకల్పించారని మంతి చెప్పారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో లక్షా 25 వేల ఎం. ఎస్. ఎం. ఈలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తద్వారా 15 వేల కోట్ల రుపాయల పెట్టుబడులను
ఆకర్షించాలని, అలాగే 1,50,000 మందికి

ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు అనుమతులు కోసం తిరగకుండా ప్రభుత్వ అధికాురులే వారిదగ్గరకు వస్తారని మంత్రి అమర్ తెలియ చేశారు. పారిశ్రామికవేత్తలు ఈ మెయిల్ ద్వారు తమ సమస్యలు తెలియ చేసినా వాటిని పరిష్కరించేందుకు ప్రభుతఅధికారులు వారిదగ్గరకు వెళతారని చెప్పారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృధ్ధిని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్ట మన్నామని మంత్రి తెలిపారు. ఈపాతం నుంచి ఒక్క పరిశ్రమ కూడా తరలిపోకుండా జాగ్రత్త తీసుకుంటారని చెప్పారు. ఎం. ఎస్. ఎం ఈ ల ఆధారంగా పెద్ద పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నా మని చెపారు. చిన్న పరిశ్రమల వలనే రాష్ట్ర భవిష్యత్ బాగుతుందని సిఎం జగన్ నమ్మ

కానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నా మని మంత్రి అమర తెలియ.చేశారు
ఇదిలా ఉండగా అనకాపల్లికి సమీపంలోని కోడూరు వద్ద కొత్త ఆటోనగరు యేర్పాటు చేశామని అమర్ చెప్పారు. ఇక్కడే 40 ఎకరాల్లో ఎం.ఎస్.ఎం. ఈ లు యేర్పాటు చేయబోతున్నామని చెప్పాం.
రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరక్టర్ సుజన మాట్లాడుతూ ఎం. ఎస్. ఎం.ఈ ల ప్రాధాన్యత అందరికి

తెలియులన్న నిబద్ధతతో పని చేస్తున్నామని అన్నారు. ఎం.ఎస్.ఎం. ఈల ప్రాముఖ్యతను మరింత పెంచుతామని అన్నారు. చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధ్యయనంచేసి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
కలెక్టర్ ర్ మల్లి కార్జున మాట్లాడుతూ రానున్న ఆరేళ్లలో చిన్న పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాలని

ఆకాక్షించారు విశాఖలో కొత్త పరిశ్రuమల ఏర్పాటుకు రెండు క్లస్టర్లు కాలాయించాలని కోరారు.
ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ రవీంద్ర, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam