DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 1 న పూరి తరహాలో విశాఖ ఇస్కాన్ చే భారీ రథయాత్ర  

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 28, 2022 (డిఎన్ఎస్):* రథ స్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. . . రథం పై ఊరేగుతున్న జగన్నాధుని దర్శిస్తే పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెప్తున్నాయి. 
అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం (ఇస్కాన్) విశాఖపట్నం శాఖ ఆధ్వర్యవంలో జులై 1, 2022 న శ్రీశ్రీశ్రీ జగన్నాధ రథయాత్ర

మహోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు విశాఖ చాప్టర్ అధ్యక్షులు సాంబ దాస్ తెలియచేసారు. మంగళవారం  నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రం పూరి లో జగన్నాధ రథయాత్ర జరిగే రోజున అనగా ఆషాడ శుక్ల ద్వితీయ నాడు (జూలై 1వ తేదీ 2022  ) విశాఖనగరం కూడా రథయాత్ర  చేపడుతున్నామన్నారు.

విశాఖపట్నం నగరంలో వరుసగా 15 వ సారి అత్యంత వైభవోపేతంగా ఈ yatra నిర్వహిస్తున్నామన్నారు. ఈ శోభాయాత్రను రాష్ట్ర ఐటి శాఖామంత్రి గుడివాడ అమర్ నాధ్ ప్రారంభించనున్నారన్నారు. 

ఈ ఏడాది ప్రత్యేకంగా పూరి తరహాలోనే శ్రీ జగన్నాధ, బలదేవ, సుభద్రాదేవిలు వేరు వేరుగా మూడు రథములలో, వేరొక రథంపై శ్రీల ప్రభుపాదుల విగ్రహమూర్తి

ఏర్పాటు చేయడమైనది. 
 
ఈ రథయాత్ర అలంకరణ కొరకు పిప్పిలి, ఒరిస్సాల నుండి వచ్చిన సామాగ్రిని వేరొక రథంపై శ్రీల ప్రభుపాదుల విగ్రహమూర్తి ఏర్పాటు చేస్తున్నారు. పుష్పాల అలంకరణ కొరకు పుష్పాలను బెంగుళూరు నుండి తీసుకొని రావడం జరుగుచున్నది.
ఈ రథాయాత్రలో ఉపయోగించే రధం ప్రత్యేకంగా యంత్ర నిర్మితమైన 32 అడుగుల రధ

గోపురాన్ని కలిగివుంది, మరియు ఎక్కడా లేని విధంగా రధం యొక్క ఎత్తును తగ్గించుకునే, పెంచుకునే సామర్థ్యం కలిగివుంది. విశాఖనగరంలో ఇటువంటి ప్రత్యేక రధమును వినియోగించే సాంప్రదాయమును మొట్ట మొదటిసారిగా ఇస్కాన్ ప్రవేశ పెట్టిందన్నారు. 

ఈ రథాయాత్ర జూలై 1 వ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పాత జైలు రోడ్, విశాఖ

మహిళా కళాశాల ఎదురుగా గల పార్కింగ్ ఏరియా నుండి బయలుదేరి, ఎల్.ఐ.సి.భవనం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి చేరుకొని, అక్కడినుండి వాల్తేరు మెయిన్ రోడ్ మీదుగా సిరిపురం వద్ద గల గురజాడ కళాక్షేత్రం వద్ద రాత్రి 07.00 గంటలకు ముగుస్తుంది.

ఈ సందర్భంగా దారి పొడవునా బెంగాల్ మరియు ఒరిస్సాలనుండి ఏర్పాటు చేయబడిన వివిధ భజన మండలుల

వారిచే భజన, నాదస్వరం, కీర్తనలు, కోలాటం కార్యక్రమాలు మరియు కాజా, పులిహోర ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడినవి. రథయాత్ర తుది గమ్యస్థానమైన గురజాడ కళాక్షేత్రం చేరుకున్న తరువాత అక్కడ జగన్నాధ స్వామివారికి 1008 రకాలైన ప్రత్యేక వంటకాలు నేయివేద్యం సమర్పించడం జరుగుతుందన్నారు. 

విలేకరుల సమావేశంలో ఇస్కాన్ విశాఖ సంస్థ

ప్రతినిధులు నితాయ్ జీవిని మాతాజీ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam