DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న కళాభారతి లో తోలుబొమ్మలాట ద్వారా సీత స్వయంవరం ప్రదర్శన 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 28, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 30 న కళాభారతి ఆడిటోరియం లో తోలుబొమ్మలాట కదా ద్వారా సీతా స్వయంవరం ప్రదర్శించడం జరుగుతుందని, దీన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో నగర వాసులు హాజరు కావాల్సిందిగా కళాభారతి కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు )

ఆహ్వానిస్తున్నారు. 

కళలకు కాణాచి అయినా భారతావనిలో అత్యంత ప్రాచీనమైన కళ తోలుబొమ్మలాట. భారత దేశ స్వాతంత్ర్య పోరాట  ఉద్యమ సమయంలో ఈ కళ ద్వారా లక్షలాది మంది  భారతీయలను చైతన్య పరిచారు. ప్రస్తుత సాంకేతిక సమాజంలో ఇలాంటి కళలకు ఆదరణ కరువవుతున్న  తరుణంలో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడెమీ, కళా భారతి కళావేదిక

లు సంయుక్తంగా ఈ కళను విశాఖ ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తోందని కళాభారతి కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్, రాంబాబు తెలియచేస్తున్నారు. 

మన ప్రాచీన కళలు మరుగున పడిపోతున్నాయని, కళాకారులకు భుక్తి కూడా కరువై జీవనం గడవక  చిన్న పనులు చేసుకొని బ్రతుకు వెళ్ళబుచ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అలాంటి

అద్భుతమైన కళలను, కళాకారులను  కూడా  కాపాడు కోవాల్సిన   అవసరం ఉందన్నారు. 

దీనిలో భాగంగా ఈ నెల 30 న కళాభారతి ఆడిటోరియం లో తోలుబొమ్మలాట కదా ద్వారా సీతా స్వయంవరం ప్రదర్శించడం ఏర్పాటు చేశామన్నారు. గుంటూరు కు చెందిన శ్రీ కనకదుర్గ తోలుబొమ్మలాట బృందం సభ్యులు ఈ కళను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam