DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదరణ కరువైన అద్భుత ప్రాచీన కళావైభవం తోలుబొమ్మలాట 

*కళాభారతి ఆదరణతో సీత స్వయంవరం - తోలుబొమ్మలాట ప్రదర్శన* 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 30, 2022 (డిఎన్ఎస్):* ఆదరణ కరువవుతున్న ప్రాచీన సంప్రదాయ కళలకు అండగా నిలుస్తున్న విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ -  కళాభారతి అందరి మన్ననలు అందుకుంటోంది. గురువారం విశాఖ నగరం వేదికగా అత్యద్భుతమైన

తోలుబొమ్మలాట కళ ద్వారా సీతా స్వయంవరం కథను కళాకారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఆదరణ కరువవుతున్న అత్యద్భుత ప్రాచీన కళలను ఆదరించాలి అనే సంకల్పంతో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ -  కళాభారతి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు సూచనలతో కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు తోలుబొమ్మలాట ప్రార్ధనను ఏర్పాటు చేయడం

జరిగింది. 

అంతరించిపోతున్న కళలలో అతి ముఖ్యమైనవి తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ, సాంఘిక నాటకాలు, పద్య నాటకాలు, ఏక పాత్రాభినయాలు, తదితర కళారూపాలు ఉన్నాయి. వాటిని ఆదరించే రాజా పోషకులు లేక, కళాకారులూ జీవన భృతి కూడా కరువైపోతున్న తరుణంలో కళాభారతి వంటి సంస్థలు ఒక్క అడుగు ముందుకు వచ్చి, కళాకారులను ప్రజా జీవనంలోకి

తిరిగి తీసుకు వస్తున్నారు. 

గురువారం విశాఖ నగరంలో జరిగిన ఈ తోలుబొమ్మలాట ప్రదర్శనకు నగర వాసుల నుంచి ఎంతో ఆదరణ లభించింది. కేవలం పుస్తకాల్లో మాత్రమే చదువువుకునే ఈ తోలుబొమ్మలాటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో కళాభిమానులు తమ పిల్లలను తీసుకుని రావడం అభినందనీయం.  

ఇలాంటి ప్రాచీన

కళలను బ్రతికించే ప్రయత్నం చేస్తున్న కళాకారులు మాత్రం బ్రతకడానికి నానా అవస్థలు పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా ఉండే స్థితి, దానికితోడు కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎక్కడ కార్యక్రమాలు లేక భుక్తి కూడా గడవని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నట్టు తెలియడంతో కళాభారతి కదిలి వచ్చింది.  

పూర్వకాలంలో రాత్రి

భోజనాలు ముగిసిన తర్వాత రాత్రి 9 కి  నుంచి ప్రదర్శన మొదలైతే పూర్తి అయ్యాయి సరికి తెల్లవారిపోయేది అని కళాకారులే చెప్తున్నారు. ప్రస్తుతం సాంకేతిక యాంత్రిక కాలంలో కేవలం oka గంట ప్రదర్శన కూడా చూడడానికి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారన్నారు. ఇలాంటి తోలుబొమ్మలాట ప్రదర్శన ద్వారా రామాయణ, భారత, భాగవతాల నుంచి మంచి సందేశాలు

ఇచ్చే మంచి కథలను తయారు చేసి వాటిని ప్రదర్శించడం జరుగుతుందని కళాకారులూ తెలియచేస్తున్నారు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సాంకేతికత బాగా పెంపొంది. గ్రాఫిక్స్ సిస్టమ్ వచ్చి ఇలాంటి కళలకు అసలు అవకాశమే లేకుండా పోయిoది.

కార్యక్రమానికి ముందుగా అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు కార్యదర్శి గుమ్ములూరి

రాంబాబు, ఇంజనీరు వేణు, పైడా కృష్ణ ప్రసాద్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు

కార్యదర్శి రాంబాబు కళాకారులను పరిచయం చేస్తూ తోలుబొమ్మలకు తాళ్ళుకర్ర పుల్లలు కట్టి   వాటితో తెర వెనక నుండి బొమ్మలను ఆడించడం చాలా గొప్ప ప్రక్రియని కళాకారుల చేత చేయించి  చూపించారు.

తోలుబొమ్మలాట. .

.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ హనుమంతరావు కుటుంబం మాత్రమే ఈ తోలుబొమ్మలాట కళను కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నారన్నారు.

తర్వాత తెల్లటి తెర కట్టి తెర వెనుక మూడు లైట్లు పెట్టి మైకులు పట్టుకుని రామ కథను గానం చేస్తూ. . . శ్రీ రాముని జననము సీతమ్మ వారి భూములో దొరకడం, ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా

చూపించారు. పదహారేళ్ల ప్రాయంలోనే విశ్వామిత్రుడు వచ్చి  రామలక్ష్మణులను వెంట పంపమని అడగడం, దశరథ మహారాజు కృంగిపోవడం, తర్వాత వశిష్టులు వారి ఆదేశాల మేరకు వారిని పంపడం, యాగ రక్షణలో తాటకి సుభాహుల  వధ, రాముని బానాధాటికి మారిచుడు 100 యోజనాల దూరంలో పడడం. అహల్య శాప విమోచనం,శివ ధనుర్భoగం, సీతారాముల కళ్యాణ ఘట్టాలను కడు రమ్యంగా

తోలు బొమ్మల ద్వారా చూపించి అందరి మన్ననలు పొందేరు. ఆద్యంతం ప్రేక్షకులు ప్రదర్శనకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అనంతరం ఇంట అద్భుతమైన ప్రాచీన కళను ప్రస్తుత తరానికి తెలియచేసిన కళాకారులను గౌరవిస్తూ సంభవం సమర్పించడం కొసమెరుపు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam