DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరి ప్రదక్షిణ చేసేది సింహాచలం కొండ కా  లేక అన్య ప్రార్ధన స్థలాలకా?

*12 న పరిక్రమణ చేసే సింహగిరి కొండ పరిసరాల్లోనే అన్య ప్రార్ధన భవనాలు* 

*హైందవ విలువలు కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్* 

*(DNS Report: ఇదీ రాజకీయం, సత్య గణేష్ BV, Visakhapatnam)* 

*విశాఖపట్నం, జులై 04, 2022 (డిఎన్ఎస్):* ఆషాఢ శుద్ధ పౌర్ణమి ని పురస్కరించుకుని ఈ నెల 12 న వేలాది మంది హిందూ భక్తులు సింహాచల కొండ

చుట్టూ పరిక్రమణ (గిరి ప్రదక్షిణ)  చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు చేసే గిరి ప్రదక్షిణ సింహాచలం కొండకి చేస్తున్నారా? లేక అన్యమత ప్రార్ధన భవనాలకు చేస్తున్నారా అనేది తెలియని స్థితి నెలకొని ఉందని విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ మండిపడుతున్నారు. సింహాచలం కొండ పరిసరాల్లో అనుకుని

ఉన్న సింహాచలం దేవస్థానం భూముల్లో అన్యమత భవనాలు ఎందుకు నిర్మించారని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై రెండు దశాబ్దాల నుంచి స్థానిక ఈఓ లకు వినతి పత్రాలు ఇవ్వడమే కాక,  తాము కూడా సహకరిస్తామని, అన్యమత భవనాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించామని, ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. దేవస్థానం భూములు రక్షించడం చేతగాని

విభాగాలు సైతం, ఉత్సవాల్లో అగ్రతాంబూలం కోసం తహతహలాడుతున్నాయని 
 మండిపడ్డారు. 

వీటిని నిర్మించేందుకు అనుమతి ఎవరు ఇచ్చారో చెప్పాలని సింహాచల దేవస్థానం అధికారులను ప్రశ్నిస్తున్నారు. తమ పరిధిలో ఉన్న కొండ పరిసరాల్లో ఇతర మతాల భవనాలు నిర్మిస్తే సిబ్బంది కళ్ళు మూసుకుని ఉన్నారన్నారు. నేటికీ యథేచ్ఛగా

ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని రక్షించేకునే వ్యవస్థ పై దేవస్థానం దృష్టి పెట్టలేదన్నారు. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా దేవస్థానానికి చెందిన కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఆఖరికి అన్యమత భవనాలు కూడా కట్టేశారన్నారు. ఈ కొండ చుట్టూ ఉన్న భవనాలపై సర్వే జరిపి, వాటిని ఎవరి హయాంలో నిర్మించారు, అందుకు అనుమతి

ఎవరు ఇచ్చారో తేల్చాలన్నారు. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి కి చెందిన భూములను అన్యమతస్తులు ఆక్రమిస్తే దేవస్థానం కళ్ళుమూసుకోవడం సరికాదన్నారు.  తీసుకునే ప్రతి రూపాయికి సరైన పని చేయాలన్నారు. 

దీనిపై ఈఓ తక్షణం దృష్టి పెట్టి, సింహగిరి కొండచుట్టు ఉన్న అన్యమత భవనాల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని

డిమాండ్ చేసారు. భక్తుల నుంచి ముడుపులు, విరాళాలు దండిగా వసూలు చేస్తున్న దేవస్థానం, భక్తుల మనోభావాలను నిలబెట్టడం లో ప్ పూర్తిగా విఫలం చెందిందన్నారు. 

కొన్ని యుగాల క్రితం ఈ కొండపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఇలవేల్పు శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ప్రహ్లాదుని కోరిక మేరకు స్వయంభూ గా వెలిసాడు. ఈ కొండ కేవలం

హిందూ సంప్రదాయ వైభవంతో వెలుగుతోంది. అయితే ఈ కొండ సుమారు చుట్టూ కొలత 32 కిలో మీటర్లు పైగా ఉంటుంది. ఈ కొండను కొందరు ఆక్రమించి, అమ్ముకోడాలు, లీజికు ఇవ్వదలు చేసి ఉంటారు. వాటిల్లో  అన్యమత ప్రార్ధన భవనాలు నిర్మించేశారు.  

ఇన్ని అన్యమత భవనాలు ఉన్న ఈ కొండ చుట్టూ పరిక్రమణ చేస్తే ఆ ప్రదక్షిణను ఏమని పిలవాలి అని

అడుగుతున్నారు. 

దేవస్థానం లో జరిగే ఆషాఢ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు ఆలయానికి రావడం జరుగుతుంది. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ని ప్రార్థిస్తూ భక్తులు సుమారు 32 కిలోమీటర్ల దూరం విస్తీర్ణం కల్గిన సింహాచల కొండను ప్రదర్క్షిణగా తిరుగుతారు. అయితే కొన్ని దార  దశాబ్దాల క్రితం వరకూ ఈ

కొండల్లో కేవలం హిందూ సాంప్రదాయ దేవాలయాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఈ కొండవాలు ప్రాంతాల్లో, కొండకు అనుకుని ఉన్న స్థలాలను   ష్టాలల్లో అనుమాట ప్రార్ధన  భవనాలు నిర్మించేశారు. దీనికి ఆ  అనుమతి ఎవరు ఇచ్చారో తెలియదు.  ఈ కొండపై అన్యమత భవనాలు నిర్మించాలి అంటే స్థానిక ప్రజల అనుమతి ఉండాలి., సింహాచల దేవస్తానం అనుమతి

ఉండాలి. 

గిరి ప్రదక్షిణ మార్గం ఇదే: ముందుగా తోలి పావంచా వద్ద స్వామిని ప్రార్ధించి, అడవి వరం, హనుమ హనుమంత వాక మీదుగా హెచ్ బి కొలని, సీతమ్మధార, సాలిగ్రామపురం, మాధవ ధారా, ఎన్ ఏ డి కొత్త రోడ్డు, గోపాల పట్నం  మీదుగా భక్తులు కాలి నడక న ప్రదక్షిణ చేస్తారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam