DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాళీ సినిమా దర్శకురాలు లీనా అరెస్ట్ కై నమోదవుతున్న పొలిసు కేసులు* 

https://torontomu.ca/cerc-migration/events/2022/07/under-the-tent-launch/
నేను ఈ పనితీరు పత్రాన్ని https://torontomu.ca/cerc-migration/under-the-tent/ యొక్క కోహోర్ట్‌గా చేసాను: Leena

">

హిందూ దేవతలను కించపరిచేందుకు అందరికి రైట్స్ ఇచ్చేశారా?: విహెచ్పి 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 05, 2022 (డిఎన్ఎస్):* హిందూ దేవీదేవతలు ఇష్టానుసారంగా కించపరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా అందరికి ఫుల్ రైట్స్ ఇచ్చేశారా, కాళీమాతను కించపరుస్తూ నీచంగా చిత్రీకరించిన కాళీ సినిమా దర్శకురాలు,

హేతువాది లీనా మణిమేఖలై రఘుపతి పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులూ  పూడిపెద్ది శర్మ డిమాండ్ చేస్తున్నారు.  

ఇటీవల జులై 2, 2022 న   "రిథమ్స్ ఆఫ్ కెనడా"లో భాగంగా జరిగిన కార్యక్రమం లో  కెనడా లోని ఆగాఖాన్ మ్యూజియం లో సినీ దర్శకురాలు లీనా మణిమేఖలై ప్రదర్శించిన కాళీ సినిమా వీడియో

పోస్టర్ పై యావత్ హిందూ సమాజం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. 

ఈ వీడియో ప్రదర్శనలో కోట్లాది మంది హిందువులు పూజించే కాళీమాత ( వేషధారి - లీనా మణిమేఖలై ) నోట్లో ధూమపానం చేస్తూ (సిగరెట్టూ కలుస్తూ) చేత్తో ఒక జండా పట్టుకుని, హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందన్నారు. ఇది పూర్తి గా అభ్యంతరం అన్నారు. తక్షణం ఆమె యావత్ హిందూ

సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. 

పైగా ఈ ప్రదర్శన అనంతరం రిథమ్స్ ఆఫ్ కెనడా కార్యక్రమం లో తన చిత్రాన్ని ఇలా ప్రదర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని కల్గించింది అంటూ లీనా చేసిన వ్యాఖ్యలు హిందువులను మరింత ఆగ్రహానికి గురి చేశాయన్నారు. 
తక్షణం ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని, ఆమె బేషరతుగా హిందూ

సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదిక గా ప్రచారం కూడా చేసింది. దానికి కౌంటర్ ఆమె కు గట్టిగా వార్నింగ్ లే ఇస్తున్నారు నెటిజన్లు.  

దేశవ్యాప్తంగా పొలిసు కేసులు నమోదు..:

హిందూ దేవత కాళీ మాత ను కించపరుస్తూ లీనా చేసిన సినిమా ను బ్యాన్ చెయ్యడంతో పాటు, దర్శకురాలు  

లీనా మణిమేఖలై పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు పొలిసు కేసులు పెట్టారు. ఆమె ట్విట్టర్ పోస్ట్ కు రిప్లై గా పలువురి స్పందన.. .

ఒకరు పెట్టిన పోస్ట్ :
 
ప్రతి రోజు హిందూ మతం అపహాస్యం చేయబడుతోంది, ప్రభుత్వం హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారా ?? మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు మమ్మల్ని ఎలా

ప్రశ్నించారో మరిచిపోకండి మరియు అవసరమైన చర్యలు తీసుకోవాలి  అంటూ. దీపక్ పంచోలి రిప్లై ఇచ్చారు. 

@AmitShah @HMOIndia @PMOIndia @DrSJaishankar @MEAIndia లకు టాగ్ చేసారు. 

మరొకరు:

చిత్రనిర్మాతపై వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు మరియు దాని గురించి ట్వీట్ చేశారు, “ఫిర్యాదును అడ్వకేట్ దాఖలు

చేశారు. కాళీ దేవత ధూమపానం చేసినందుకు హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కోసం ఫిర్యాదు చేసారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది రిప్లై ఇచ్చారు. 

ఈ రిప్లై ను  @VineetJindal19 @DCP_CCC_Delhiతో కలిసి @LeenaManimekali. @cp_delhi @Sadhvi_prachi @shubhankrmishra #LeenaManimekalai”  లకు టాగ్ చేసారు. 

మూడవ వినియోగదారు ట్వీట్ చేస్తూ, “నా

ఆరాధ్య మా కల్లి పేరుతో ఈ ఫోటోను షేర్ చేయడం ద్వారా, మీరు ఆమె ధూమపానం చేస్తూ ఆమెను అవమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం తప్ప ఇలా చేయకండి, క్షమించండి. దీన్ని తొలగించి, దానికి క్షమాపణలు చెప్పండి”. అంటూ కమల్ జె ట్వీట్ చేసారు. 

నాల్గవ వినియోగదారు ముముక్షు సావిత్రి  ఇలా బదులిచ్చారు, “మీకు

ధైర్యం వచ్చినంత వరకు విశ్వ తల్లిని అవమానించండి. ఒక రోజు మీ స్వంత ఆత్మ యొక్క చీకటి మిమ్మల్ని ఆవరించినప్పుడు, కాళి అంటే ఏమిటో ఆమె మీకు చూపుతుంది. అప్పుడు మీరు లేరని మీరు కోరుకుంటారు. మీరు అన్ని కాంతి మూలం వద్ద ఎంత ఎక్కువ ఉమ్మి వేస్తే, మీరు అంత లోతుగా ఉపేక్షలో మునిగిపోతారు. 

అభినవ్ శుక్ల అనే యువకుడు ఈ ఘటనను ఒక

దౌర్భాగ్యపు దృశ్యంగా తెలిపాడు. సంస్కారం లేని mahila చేసిన పనిగా అభివర్ణించాడు. 

ఈ చిత్రం పై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నప్పడికి ఏమాత్రం సిగ్గు లేకుండా ఎవరేమనుకున్నా నాకు పోయేదేమీ లేదు. అంటూ లీనా ఇచ్చిన రిప్లై, హిందువుల్లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. 

లింక్:
href="https://torontomu.ca/cerc-migration/events/2022/07/under-the-tent-launch/">https://torontomu.ca/cerc-migration/events/2022/07/under-the-tent-launch/
నేను ఈ పనితీరు పత్రాన్ని https://torontomu.ca/cerc-migration/under-the-tent/ యొక్క కోహోర్ట్‌గా చేసాను: Leena

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam