DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*లీనా ను ఆసుపత్రి లో చేర్చాల్సిన అవసరం ఉంది: అనూప్ జలోటా. .*   

*Leena continuously insulting Hindu sentiments, Anup Jalota*

*హిందూ ద్వేష వరుస ట్వీట్లతో హిందువుల సహన పరీక్ష చేస్తున్న లీన*
 
*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 07, 2022 (డిఎన్ఎస్):* హిందూ ద్వేషం నరనరాల్లో నింపుకున్న సినీ దర్శకురాలు హిందూ ద్వేషం నరనరాల్లో నింపుకున్న లీనా మణిమేఖలై వరుసగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టడం

ద్వారా హిందువులను ఛాలెంజ్ చేస్తోంది.  కెనడా లో నివాసం ఉండి గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ద్వేష పూర్తి వ్యాఖ్యలు చెయ్యడం అలవాటుగా చేసుకుంది. గత వారం కెనడాలో నిర్వహించిన లఘు చిత్రాల ప్రదర్శనలో కాళీ మాత్ర సిగరెట్ కలుస్తున్నట్టుగా వీడియో విడుదల చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసింది. దీనిపై భారత

రాయబారి సైతం కెనడాకు హెచ్చరిక జారీ చేశారు.  దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుండగానే గురువారం మరొక వివాదాస్పద ట్వీట్ చేసింది. శివుడు, పార్వతి వేషధారుల్లో ఉన్న వ్యక్తులు సిగరెట్టూ కలుస్తున్న ఫోటో ను ట్వీట్ చేసి, నాకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అంటూ హిందువులను ఎద్దేవా చేస్తూ రెచ్చగొట్టే

పోస్ట్ చెప్పింది. 
పూర్తిగా హిందూ ద్వేషి గా ఉన్న ఈమె కేవలం హిందూ దేవీదేవతలు అవహేళన చెయ్యడం తో పాటు, వాళ్ళ సహనాన్ని పరిశీలించే పని మాత్రమే చేస్తోంది. ఈమె చేస్తున్న వరుస రాక్షస కృత్యాలకు దేశవ్యాప్తంగా హిందూ సమాజం మండిపడుతోంది. 

ఇంతకాలం స్తబ్దతగా ఉన్న హిందూ ప్రముఖులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులూ అనూప్ జలోటా చేసిన వ్యాఖ్య అయన ఆవేదనను వ్యక్తం చేసింది. గురువారం నిర్వహించిన ఒక టీవీ డిబేట్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఎవ్వరైనా తప్పు చేస్తే ఒక్కసారి చేస్తారని, అదే తప్పిదం పదే పదే చేస్తే. . . వాళ్ళని మెంటల్ ఆసుపత్రి లో చేర్పించి, చికిత్స చేయించాలి

అన్నారు. ఇంతకాలం ఎటువంటి వివాదాల పై స్పందించని ఆయన ఈ స్థాయిలో మండిపడడం గమనార్హం.
మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి ఈమెను భారత్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, కచ్చితంగా ఆమెను, ఆమెకు సమాధాన చేసేవాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
హిందూ ధార్మిక సంత్ సమ్మేళనం ఈ దుష్ట వైఖరిని పూర్తిగా దుయ్యబట్టింది.

శూర్ఫణఖ, పూతన, ఎప్పుడో చచ్చారనుకున్నామని, అయితే వీళ్ళ రూపంలో ఇంకా తిరుగుతున్నారని, వీళ్ళ భరతం పెట్టవలసిన పని ప్రభుత్వాలపై ఉందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam