DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ మంచి మిత్రుణ్ణి కోల్పోయింది, షింజో అబే గురించి ప్రధాని మోడీ

*(DNS Report: Sairam CVS, రాష్ట్ర వాది పత్రకార్, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 09, 2022 (డిఎన్ఎస్):* షింజో అబే - జపాన్‌ దేశపు అత్యుత్తమ నాయకుడు, ప్రపంచ రాజనీతిజ్ఞుడు. భారతదేశం-జపాన్ స్నేహబంధానికి గొప్ప వారధిగా నిలచారు - ఇప్పుడు మన మధ్య లేరు. జపాన్ తో పాటు  ప్రపంచం ఒక గొప్ప దార్శనికుడ్ని కోల్పోయింది.  నేను ప్రియమైన స్నేహితుడిని

కోల్పోయానంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం పడ్డారు. 

2007లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో  జరిపిన జపాన్ పర్యటనలో ఆయనను తొలిసారిగా కలిశాను. ఆ మొదటి సమావేశం నుండి మా స్నేహం ఆఫీసు  పరిధిని, అధికారిక ప్రోటోకాల్ పరిమితులను దాటి బలపడింది

క్యోటోలోని టోజీ ఆలయాన్ని సందర్శించడం,

షింకన్‌సేన్‌లో మా రైలు ప్రయాణం, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమ సందర్శన, కాశీలోని గంగా ఆరతి, టోక్యోలో  టీ వేడుక, మా చిరస్మరణీయ సాంగత్యసందర్భాల జాబితా విస్తారమైనది.

ఫుజి పర్వత పాదపంక్తి నడుమ ఉన్న యమనాషి ప్రిఫెక్చర్‌ ప్రాంతంలోని వారి నివాసగృహానికి నాకు మాత్రమే అందిన అరుదైన ఆహ్వానాన్ని  నేను గొప్ప

గౌరవంగా భావిస్తాను

2007-2012 సంవత్సరాల  మధ్య వారు జపాన్ ప్రధానమంత్రిగా ఉండనప్పుడు కూడా నేను వారితో  సన్నిహితంగా మెలిగాను. ఇటీవల 2020 తర్వాత కాలంలోనూ  మా వ్యక్తిగత బంధం ఎప్పటిలాగే దృఢంగా ఉంది.

అబే సాన్‌తో ప్రతి కలయిక, సమావేశమూ మేధోపరంగా ఉత్తేజపరిచేది. ఆయన ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలతో కూడిన పాలన,

ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, విదేశాంగ విధానం వంటి అనేక ఇతర విషయాలపై అమూల్యమైన అంతర్దృష్టులతో నిండి ఉండేవారు.

గుజరాత్ అభివృద్ధికోసం నా ఆర్థిక ఎంపికలలో వారి సలహాలు నాకు స్ఫూర్తినిచ్చాయి   జపాన్‌తో గుజరాత్  శక్తివంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించడంలో ఆయన మద్దతు కీలకమైనది.

 భారతదేశం, జపాన్ మధ్య

వ్యూహాత్మక భాగస్వామ్యంలో అపూర్వమైన పరివర్తన తీసుకురావడానికి ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఇరు దేశాల మధ్య చాలా ఇరుకైన, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధ స్థాయి నుంచి,  ప్రియమైన అబే   విస్తృత, సమగ్రమైన బంధంగా మార్చడంలో సహాయపడ్డారు, ఇది జాతీయ ప్రయోజనాల పరిధిలోని  ప్రతి రంగాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మన రెండు దేశాల

ప్రాంతీయ  భద్రతకు కీలకంగా మారింది. వారి దృష్టిలో, మన దేశంతో  జపాన్ అనుబంధం    రెండు దేశాల ప్రజలకు, ప్రపంచ ప్రజలకు అత్యంత ప్రభావితం చేసే  సంబంధాలలో ఒకటి.  వారు భారతదేశంతో పౌర అణు ఒప్పందాన్ని కొనసాగించే విషయంలో  దృఢ నిశ్చయంతో ఉన్న వ్యక్తి - తన దేశానికి అత్యంత కష్టతరమైన నిర్ణయం అయినా, భారతదేశంలో హై స్పీడ్ రైలు

కోసం అత్యంత ఉదారమైన నిబంధనలను అందించడంలో వారిది  నిర్ణయాత్మకమైన వైఖరి. స్వతంత్ర భారతదేశ ప్రయాణంలో చాలా ముఖ్యమైన సందర్భాలలో  నవ భారతం  వృద్ధి  చెందుతున్నప్పుడు జపాన్ దేశం మనకు మద్దతుగా, అనుకూలంగా  ఉండేలా చూసుకున్నారు.

2021లో ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్‌ను మనం వారికి  ప్రదానం చేయడం ద్వారా

భారతదేశం-జపాన్ సంబంధాలకు ఆయన చేసిన కృషిని గొప్పగా గౌరవించుకున్నాం.

ప్రపంచంలో జరుగుతున్న సంక్లిష్ట, బహుళ పరివర్తనల గురించి అబే  లోతైన అంతర్దృష్టిని కలిగి ఉన్న వ్యక్తి, రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలపై దాని ప్రభావాన్ని చూడడానికి తన సమయం కంటే ముందుకాలంలో ఉండాలనే దృక్పథం, ఉండాల్సిన

ఎంపికలను తెలుసుకోవడం. సమావేశాల నేపథ్యంలో కూడా స్పష్టమైన,  సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, తన ప్రజలను  ప్రపంచాన్ని తనతో పాటు ముందుకు నడిపించే అరుదైన సామర్థ్యం. అతని సుదూర లక్ష్యాల సాకారానికి అనుసరించిన - అబెనోమిక్స్ - జపనీస్ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంతో పాటు, ప్రజలలో  ఆవిష్కరణ

 వ్యవస్థాపకతల స్ఫూర్తిని తిరిగి కలిగించాయి.

అతను మనకు అందించిన గొప్ప సహకారంతోపాటు  అజరామరమైన అతని ప్రభావం పట్ల ప్రపంచం ఎల్లప్పుడూ ఆయనకి రుణపడి ఉంటుంది, సామాజిక ఆటుపోట్లను,  మన కాలంలోని  ఆగామీ ఉపద్రవాలను గుర్తించడంలో ఆయన దూరదృష్టి వాటికి సమయానుకూల ప్రతిస్పందనలో అతని నాయకత్వ గరిమ ప్రత్యేకమైనవి.

 ఇతరుల కంటే చాలా  ముందుగా  2007లోనే భారత పార్లమెంట్‌లో చేసిన తన  చారిత్రిక ప్రసంగంలో, ఇండో పసిఫిక్ ప్రాంతం సమకాలీన రాజకీయ, వ్యూహాత్మక,ఆర్థిక వాస్తవికత దిశగానూతన శక ఆవిర్భావానికి పునాది వేశాఋ.  ఆ పునాదిపై - మన ప్రాంతం ఈ శతాబ్దంలోనూ  ప్రపంచానికి తన ప్రభావాన్ని చూపిస్తుంది.

సార్వభౌమాధికారం, ప్రాదేశిక

సమగ్రతకు గౌరవం ఇస్తూనే, అంతర్జాతీయ చట్టాలూ, నియమాలకు కట్టుబడి ఉండటం, అంతర్జాతీయ శాంతియుత ప్రవర్తన పట్ల నిబద్ధతతో -  విలువల ఆధారంగా  ఆదరించిన  స్థిరమైన, సురక్షితమైన, శాంతియుత సుసంపన్నమైన భవిష్యత్తు   నిర్మించడంలో ఆయన ముందు నుండి నాయకత్వం వహించారు. సమానత్వ స్ఫూర్తితో స్నేహ సంబంధాలు నెలకొల్పి లోతైన ఆర్థిక

బంధాల ద్వారా శ్రేయస్సును పంచుకున్నారు.

చతుర్భుజ భద్రతా సంభాషణ- క్వాడ్, ఆగ్నేయ ఆసియా దేశాల సమైఖ్య-ఎసియన్ నేతృత్వంలోని సంఘాలు, ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్, ఆసియా-ఆఫ్రికా గ్రోత్ కారిడార్,  విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి వంటివి వీరి సహకారాల నుంచి ప్రయోజనం పొందాయి. నిశ్శబ్దంగా, ఆర్భాటం

లేకుండా, స్వదేశంలో సంకోచాలను పరిహరించుకుని, విదేశాలలో సందేహాలను అధిగమించి,  ఇండో పసిఫిక్ ప్రాంతం అంతటా రక్షణ, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, స్థిరత్వంతో సహా జపాన్  వ్యూహాత్మక స్థాయికి రూపం ఇచ్చారు.  ఈ కారణంగా  ఈ ప్రాంతం  మరింత ఆశాజనకంగా, పురోగామిగా  ఉంది, ఈ ప్రపంచం దాని భవిష్యత్తు గురించి మరింత నమ్మకంతో

భద్రభావనతో ఉంది.

ఈ సంవత్సరం మేలో నా జపాన్ పర్యటన సందర్భంగా, జపాన్-ఇండియా అసోసియేషన్ కీలక బాధ్యతలు స్వీకరించిన ప్రియమైన అబే  ను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయన  తన సహజాతమైన వ్యక్తిత్వంతో శక్తివంతంగా, ఆకర్షణీయంగా  చాలా చమత్కారంగా ఉండేవారు. భారత్-జపాన్ మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆయనకు

వినూత్న ఆలోచనలు ఉన్నాయి. ఆ రోజు నేను ఆయనకి వీడ్కోలు చెప్పినప్పుడు, అది మా చివరి సమావేశం అని నేను ఊహించలేదు.

అతని  జ్ఞానం, దయ  దాతృత్వం, స్నేహం, మార్గదర్శకత్వం పట్ల నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారు మనతో లేకపోవడం  నాకు తీరని లోటు  .

వారు మనల్ని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నట్లే,

భారతదేశంలోని మేము మా స్వంత వ్యక్తిగా వారి మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము. తానూ  అత్యంత ఇష్టపడేదాన్ని ఆచరిస్తూ మరణించారు - తన ప్రజలకు ప్రేరణ కలిగించారు. అతని జీవితం విషాదకరంగా  ముగిసి ఉండవచ్చు, కానీ వారి వారసత్వం శాశ్వతంగా ఉంటుంది.

నేను భారతదేశ ప్రజల తరపున   జపాన్ ప్రజలకు, ముఖ్యంగా వారి శ్రీమతి అకీ

అబే కి , కుటుంబ సభ్యులకు నా తరపున హృదయపూర్వక సంతాపాన్ని తెలియచేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam