DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 17 న చెస్ గ్రాండ్ మాస్టర్ తో విశాఖ ప్లేయర్ల పోటీ 

*(DNS Report: Sairam CVS, రాష్ట్ర వాది పత్రకార్, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 09, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 17 న జరుగనున్న 44 వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే కార్యక్రమం లో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా చదరంగం లో గ్రాండ్ మాస్టర్  విశాఖ పట్నం క్రీడాకారులతో ఒకేసారి చదరంగం ఆడనున్నట్టు విశాఖపట్నం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ముఖ్య

కార్యనిర్వహాణాధికారి పి. నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే విశాఖ క్రీడాకారుల ఎంపిక కోసం ఈ నెల 14 న పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.  

ప్రపంచములోనే మొట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న ఒలింపియాడ్ టార్చ్ రిలే కార్యక్రమం లో భాగంగా ముందస్తుగా ఈ నెల 14 న నెహ్రు యువకేంద్ర యూత్ హాస్టల్, విశాఖపట్నం నందు జిల్లా

చెస్ పోటీలు నిర్వాహిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో గుర్తింపు కలిగిన ప్రదేశాలలో జిల్లా, రాష్ట్ర చెస్ అసోసియేషన్,  యువకేంద్ర సమన్వయంతో ఈ పోటీలు జరుగుతాయన్నారు. 

14 న విశాఖపట్నం లో జరిగే పోటీలలో గెలుపొందిన వారితో గ్రాండ్ మాస్టర్ తేది 17.07. 2022 న స్వర్ణభారతి ఇన్డోర్ స్టేడియం నందు ఏకకాలం లో చెస్

ఆడుతారన్నారు. 

14 న జరిగే పోటీలలో పాల్గొన దలచిన  వాళ్లు ఈనెల 13 వ తారీకు లోగా తమ పేరు నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ని సంప్రదించగలరు, ఫోన్ నెం: 9848460137, 9989971232. నెంబర్లలో నమోదు చేసుకోవాలన్నారు. 

ఒలింపియాడ్ టార్చ్ రిలే కార్యక్రమం ఈ నెల 17 న ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ

లోను, విశాఖపట్టణం లోను, 23 న తిరుపతి జిల్లాలోని తిరుపతి వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. 

ఈ కార్యక్రమానికి శాప్ విసి & యండి డా. నక్కల ప్రభాకర రెడ్డి, నోడల్ అధికారిగా ఎంపిక కాబడ్డారన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహణ కోసం జరిగిన సమావేశంలో విశాఖపట్నం ముఖ్య

క్రీడా శిక్షకులు ఎన్ . సూర్యారావు, వి. బాలకృష్ణారావు, వి. శ్రీకాంత్, సిఏఓ వి. దీవిక ఆర్. బాబురావు, ఎస్. మణికంఠరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam