DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 నుంచి విశాఖ వారిజ లో దేవనాధా జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్ష

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 10, 2022 (డిఎన్ఎస్):* ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అపర రామానుజులుగా ఖ్యాతిగాంచిన త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి శిష్యులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి విశాఖ లో ఈ నెల 13 నుంచి చాతుర్మాస్య దీక్ష ను అనుగ్రహించారు. 
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న

నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన విశాఖపట్నం లోని సాగర తీరం లోని  మంగమారిపేట లో గల చిన్న జీయర్ స్వామి ఆశ్రమం వారిజ లో ఈ నెల 13 నుంచి దీక్షను ప్రారంభించనున్నారు. 

ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు ఉజ్వల భవిషత్ లభించాలని, ఈ ప్రాంతం మరింతగా అభ్యున్నతి చెందాలి అనే సంకల్పంతో ఈ చాతుర్మాస్య దీక్షను నిర్వహిస్తున్నట్టు

స్వామిజి తెలియచేసారు. 

తమ ఆచార్యులైన త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆదేశానుసారమే అడుగులు వేస్తూ ఎంతో కష్టతరమైన రామానుజ సహస్రాబ్ది విగ్రహ ప్రతిష్ట ప్రాజెక్ట్ భాద్యతలను ఆచార్య కటాక్షంగా స్వీకరించి విజయవంతంగా నిర్వహించిన వారు త్రిదండి దేవానాథ జీయర్ స్వామి. సుమారు 5 సంవత్సరాల కాలం ఈ ప్రాజెక్ట్ కోసం

అహరహం శ్రమించి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పడికి ఆచార్యుల సంకల్పం దిగ్విజయంగా నెరవేరడంలో ప్రధాన భూమిక వహించారు. ఈ బృహత్తర కార్యాచరణ ఈ ఏడాది ఫిబ్రవరి లో న భూతోనభవిష్యత్ అన్న రీతిలో భారత్ దేశ ఆధ్యాత్మిక వైభవం విస్వంతరాలకు చేరిన విషయం తెలిసిందే.    

దశాబ్దాలుగా ఆచార్యుల సేవలోనే తరిస్తూ సామాన్య

జీవితం నుంచి అసామాన్య సన్యాశ్రమ దీక్ష స్వీకరించి, విశిష్టాద్వైత సంప్రదాయ ప్రచార భాద్యతలను స్వీకరించి, గ్రామా గ్రామాన తిరుగుతూ అందరిలోనూ చైతన్యం నింపుతున్నారు. 

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తరింపచేసేందుకు విశాఖ సాగర తీరంలో జరుగుతున్నా ఈ దీక్ష సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తూ. . సామాన్యులలో

ఆధ్యాత్మిక చింతనతో పాటు, సామాజిక భాద్యతలను కూడా పెంపొందించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. విద్యార్థులు, మహిళలు, యువతి, యువకులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, వైదిక, ఋత్విక్ లతో ఎన్నో బృహత్తర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల్లోని ఆలయాల సందర్శించడంతో పాటు, ఆలయాల పరిరక్షణ,

అభివృద్ధి కై తగిన కార్యాచరణ చేపట్టనున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam