DNS Media | Latest News, Breaking News And Update In Telugu

175 సీట్లు గెలిచే సత్తా ఉంటె అసెంబ్లీ రద్దు చేసి ఎన్నిక జరపాలి 

*వైఎస్ జగన్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సవాల్*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 11, 2022 (డిఎన్ఎస్):* ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే వెంటనే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. 
/> సోమవారం విశాఖ కి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ వైసీపీ ప్లినరీ సందర్భంగా  175 స్థానాలను గెలవడం అసాధ్యం ఏమీ కాదని  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. వెంటనే ఎన్నికలకు వెళ్లి సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు. ఆ ఎన్నికలలో నిజంగా 175 స్థానాలు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత

ముఖ్యమంత్రిగా ఉండవచ్చునని, ప్రతిపక్షాలు లేకుండా నిరాటంకంగా పరిపాలనను సాధించుకోవచ్చు కదా అని రామ్ వ్యాఖ్యానించారు. కాగా పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధమన్నారు. మరోవైపు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం

హాస్యాస్పదంగా ఉందన్నారు. జాతీయ పార్టీ హోదా ఉండాలంటే కనీసం రెండు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను కొనసాగించగలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం వైసీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైందని.. అటువంటప్పుడు జాతీయ పార్టీగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. మరో కొసమెరుపు ఏంటంటే.. వైసీపీకి జాతీయ అధ్యక్షుడిగా

ప్రకటించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షుడు ఎవరో ప్రకటించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడమే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. నిజంగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై నిజంగా ప్రేమ ఉంటే ఆయన తర్వాత

రెండు, మూడు, నాలుగు స్థానంలో ఉన్న రెడ్డి ( విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి )లకు బదులుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లేదా బీసీ వారికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు.

బ్రిటిష్ పాలనకంటే దారుణం : 

భీమవరంలో నిర్వహించిన.. తెలుగుతేజం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి

కార్యక్రమానికి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన సంగతి తెలిసిందేనని అన్నారు. అయితే ఆ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి  నరసాపురం లోక్ సభ సభ్యుడు (ఎంపీ) రఘురామ కృష్ణంరాజు కు ఆహ్వానం లేకపోవడంపై బి.వి.రామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి  పథకం ప్రకారం వ్యవహరించి  ప్రోటోకాల్

నిబంధనలను కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రాజకీయాలలో ఇంతటి దారుణమైన కక్ష సాధింపు పరిస్థితులు బ్రిటీష్ పరిపాలనలో కూడా లేదని వ్యాఖ్యానించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam