DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో హిందూ దేవాలయాల డిపాజిట్లు హం ఫట్టేనా?: ధార్మిక సంఘాలు

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, జులై 15, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖా పరిధిలోని హిందూ దేవాలయాల బ్యాంక్ లోని డిపాజిట్లు హం ఫట్టే అవుతున్నాయంటూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వివిధ బ్యాంకు ల్లో డిపాజిట్ చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను విడుదల చేసుకోమంటూ కమిషనర్ నుంచి ఆదేశాలు జరికావడం హిందూ

దేవాలయాలపై జరుగుతున్న అఘాయిత్యం తెలుస్తోందన్నాయి.  ఈ సంఘాలు ఆరోపిస్తున్నట్టు ఈ నెల 1 నుంచి 13 వరకూ ఇప్పడికే సుమారు 50 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు ల నుంచి రద్దు  చెయ్యబడ్డాయి అంటూ హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వీళ్ళ ఆరోపణలకు నిదర్శనంగా దేవాదాయ శాఖా కమిషనర్ హరి జవహర్ లాల్ విజయనగరం జిల్లాలోని ఓ దేవాలయం కు

బ్యాంకు ల్లో గల డిపాజిట్లను రద్దు చేసేందుకు అధికారిక ఆదేశాలు జారీ చేసారు. 

రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు విరాళంగా భక్తులు ఇచ్చిన విరాళాలను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యడం జరిగింది. ఇప్పుడు వాటిని రద్దు చేయాలంటూ ఆదేశాలు విడుదల చెయ్యడం తో పాటు, ఇప్పడికే సుమారు 50 కోర్టుల రూపాయలకు పైగా బ్యాంకు ల నుంచి

రద్దు  చెయ్యబడ్డాయి అంటూ హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.   

మొత్తం  500 కోట్లు రూపాయలను దేవదాయశాఖ టార్గెట్ గా పెట్టున్నట్టుగా ఉందన్నారు.  బ్యాంకుల్లో క్యాన్సిల్ చేసిన ఎఫ్ డిల నగదును ఆలయ అధికారులు సిజెఎఫ్ కు జమ చేస్తున్నారన్నారు. 

అయితే సిజిఎఫ్ ఫండ్ ను ఆలయాల జీర్ణోనోద్దారణకు

మాత్రమే వినియోగించాలి. ఇతరత్రా అవసరాలకు వాడకూడదు. సిజిఎఫ్ పండ్స్ ను ఇస్ఠానుసారం గా బదలాయించారంటూ మాజీ దేవాదాయశాఖ మినిస్టర్ పై మండిపడ్డాయి.  
ఆలయాలు దీపదూప నైవేద్యాలకు సైతం ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, రాష్ట్రంలో సుమారు 15 వేల దేవాలయాలలో ఎఫ్ డిలు రద్దు రంగం సిద్దం అయ్యిందన్నారు. రోజువారీ క్యాన్సిలేషన్ పై

దృష్టి సారించారన్నారు 

విశాఖలో ఇసుకకొండలో దేవాలయంలో డిపాజిట్లు ఖాళీచేశారని కూడా అభియోగం వినిపిస్తోంది. 
సరియైన సమాచారం తెలియవలసి ఉంది 

దేవాదాయ శాఖ - శ్రీ సన్యాసేశ్వర స్వామివారి దేవస్థానం, ధర్మవరం (V), S.కోట (M), విజయనగరం జిల్లా - చట్టబద్ధమైన చెల్లింపులు చేయడానికి మిగులు నిధుల FDRల ఉపసంహరణ -

అనుమతి అభ్యర్థించబడింది - ఆమోదించబడింది - జారీ చేయబడిన ఉత్తర్వులు - రెగ్.

Rc.No.Nil/2022, Dt:08-07-2022 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ నుండి సన్యాసేశ్వర స్వామివారి దేవస్థానం, ధర్మవరం (వి), ఎస్.కోట (ఎం), విజయనగరం జిల్లా సహాయ కమీషనర్, దేవాదాయ శాఖ, విజయనగరంలో ప్రసంగించారు.

కార్యనిర్వహణాధికారి, శ్రీ సన్యాసేశ్వర స్వామివారి

దేవస్థానం, ధర్మవరం (V), S.కోట (M), విజయనగరం జిల్లా నివేదించిన పరిస్థితులలో, A.P.C నిబంధనల ప్రకారం ఆయనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించడం ద్వారా ఉదహరించారు. & హెచ్.ఆర్.ఐ. & ఎండోమెంట్స్ చట్టం, 1987, కమీషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్, A.P., విజయవాడ, శాఖకు చెల్లించాల్సిన చట్టబద్ధమైన చెల్లింపులను క్లియర్ చేయడానికి మిగులు నిధులతో

చేసిన క్రింది 4 FDRలను ఎన్‌క్యాష్ చేయడానికి సబ్జెక్ట్ సంస్థ యొక్క కార్యనిర్వాహక అధికారికి అనుమతిని అందజేస్తుంది. CGF ro మొదటి ప్రాధాన్యతపై క్లియర్ చేయబడుతుంది, AWF రెండవ ప్రాధాన్యతపై, EAF మూడవ ప్రాధాన్యతపై క్లియర్ చేయబడుతుంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ (2021-22) సాధారణ ఖాతా నుండి మాత్రమే క్లియర్ చేయబడుతుందని మరియు ఎట్టి

పరిస్థితుల్లోనూ ఎన్‌క్యాష్ చేసిన FDR మొత్తం నుండి కాదని స్పష్టం చేయబడింది.

తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆదేశించారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టబద్ధమైన చెల్లింపులు చేయవద్దని కార్యనిర్వాహక అధికారిని హెచ్చరించారు.
హరి జవహర్‌లాల్ ఎం, కమిషనర్

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam