DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 17 10.46 am నుంచి దక్షిణాయణ పుణ్యకాలం ప్రారంభం 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 16, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 17 ఆదివారం ఉదయం 10.46 గంటల నుంచి దక్షిణాయణం పుణ్యకాలం ప్రారంభం కానుంది. సనాతన హైందవ భారతీయ సంప్రదాయం ప్రకారం కాల నిర్ణయం సూర్య గమనం ఆధారంగా నిర్ధారణ జరుగుతుంది. ఏడాది కాలాన్ని ఉత్తరాయణం,  దక్షిణాయణం గా పరిగణించడం జరుగుతుంది.

సూర్యుడు కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. 

ఉత్తరాయణం - సూర్య భగవానుడు ఉత్తరం వైపు నుండి ఉదయిస్తాడు! అంటే తూర్పు వైపు మీరు నుంచుంటే ఎండ వల్ల మీ నీడ మీ కుడివైపు పడుతుంది! గమనించండి!

దక్షిణాయణం - అంటే దక్షిణం వైపునుండి ఉదయిస్తాడు! మీ నీడ ఎడమ

వైపు పడుతుంది! ఇది దక్షిణాయణం!

మన పూర్వీకులు యుగాలుగానూ, యుగాలను సంవత్సరములుగానూ, సంవత్సరములను మాసములుగానూ, మాసములను వారములుగానూ, వారములను రోజులుగానూ, రోజీలను జాములుగానూ, జాములను ఘడియలుగానూ ఇలా అనేక విధములుగా సమయాన్ని కాల గమనాన్ని తెలుసుకునేందుకు విభజించియున్నారు.

సంవత్సరంలోగల 12 మాసములను

రెండుగా విభజించి ఆయనములు అని పేరు పెట్టారు. మొదటిది ఉత్తరాయణం. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. 

ఆంగ్ల క్యాలండర్ ప్రకారం ప్రతి జనవరి 14 లేదా  15 నుండి జూలై 15 లేదా 16 వరకు ఉత్తరాయణం అని,  జూలై 16

లేదా 17 నుండి జనవరి 14 లేదా 15 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు.

దక్షిణాయనం లో దేవతలు నిద్రిస్తారు. ఆ సమయంలో మనకి పండగలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే మనం చేసే పూజలు దేవతలకి శక్తులు ఇస్తాయి (మనం అలసిపోయి పడుకుంటే విశ్వ శక్తి మనలో ప్రవేశించి ఎంత శక్తిని ఇస్తుందో మనం చేసే పూజలు వారికీ అలా శక్తిని

ఇస్తాయి)

దక్షిణాయణం కాలంలో ఉపనయనం వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించరు. 

ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు. ఆ సమయంలో దేవతలు మనకి అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది

శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది. 
మానవమాత్రులకు రాత్రి పగలు మాదిరిగా దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి అన్నమాట. 
మన పూర్వీకులు తెలిపిన సరళ భాషలో తెలిపిన విధానాన్ని బట్టి సూర్య భగవానుని గమనాన్ని రెండు భాగాలుగా విభజించారు .
సూర్య భగవానుడు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు

ఉత్తరాయణం అని , సూర్య భగవానుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు దక్షిణాయణం అని పిలిచారు .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam