DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ 14 వస్తువులపై పన్నులు లేవు . .జాబితా విడుదల

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, జులై 20, 2022 (డిఎన్ఎస్):* ఎలాంటి జీఎస్టీ వర్తించని 14 రకాల వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఈ వస్తువులను విడిగా, ఎలాంటి ప్యాకేజింగ్ లేకుండా అమ్మితే జీఎస్టీ వర్తించదని తెలిపారు. కొన్ని ఆహార వస్తువులపై ప్రభుత్వం జీఎస్టీని పెంచడంపై విపక్ష

పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ధరల పెరుగుదలపై మండిపడ్డాయి. ఈ ఆందోళనల మధ్యలోనే లోక్‌సభ సమావేశాలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనలపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రీ ప్యాకేజ్డ్, లేబుల్డ్ ఆహార ఉత్పత్తులపై మాత్రమే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. గత నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో

ఏకగ్రీవంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

 పప్పులు, ధాన్యాలు, గోధుమలు, ఓట్స్, బియ్యం, పిండ్లు, రవ్వ, శెనగపిండి, బియ్యం,పెరుగు, లస్సీ, మరమరాలు వంటి ఉత్పత్తులను విడిగా అమ్మినా లేదా ప్రీ ప్యాకింగ్, ప్రీ లేబుల్ లేకపోయినా ఎలాంటి జీఎస్టీ వర్తించదని తెలిపారు.

ఈ మేరకు నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు

చేశారు. అంతేకాక ఈ వస్తువుల జాబితాను విడుదల చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam