DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలో హిందూ సమాజ అణిచివేత విధానం అమలు లోకి తెచ్చేస్తున్నారా?

*ప్రభుత్వ స్కూళ్ల నుంచి విద్యార్థుల తొలగింపు పై విహెచ్పి నేత పూడిపెద్ది మండిపాటు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 21, 2022 (డిఎన్ఎస్):* ఈ దేశంలో హిందూవులపై హత్యాకాండలు ప్రత్యక్షంగా కొన్ని చోట్ల చేస్తుంటే. .. మరికొన్ని చోట్ల విద్యా సంస్థల్లో హిందువులను నిర్దాక్షిన్యంగా

తొలగించే విధానాల ద్వారా అణిచివేత కార్యక్రమం, ఝార్ఖండ్ నుంచి మొదలయ్యిందా అని విశ్వ హిందూ పరిషత్ విశాఖపట్నం జిల్లా సంయుక్త  కార్యదర్శి పూడిపెద్ది శర్మ మండిపడ్డారు. 
ప్రజా గణతంత్ర దేశంగా చట్టాలు అమలు లో ఉన్న భారత దేశంలో మతోన్మాదులు ప్రత్యక్షంగా నడిరోడ్దుపై హిందువులను హత్యలు చేయడాన్ని ఉదయ్ పూర్ లోను,

మహారాష్ట్ర లోని అమరావతి లోను ప్రపంచమంతా చూసిందన్నారు. దీనికి కొనసాగింపుగానా అనే విధంగా ఇటీవల ఝార్ఖండ్ లో వెలుగు చూసిన పలు ఘటనల నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  భారత దేశంలో దేశ భక్తి తప్పనిసరిగా విద్యార్థుల్లో పెంపొందించాలన్న నిబంధన ఉందన్నారు. అలాంటిది జై భారత మాత అన్నందుకు విద్యార్థులను కాలేజ్ నుంచి

సస్పెండ్ చెయ్యడం పై ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.   

స్కూల్ నుంచి పిల్లల తొలగింపు:. .

ప్రభాత్ ఖబర్ పత్రిక నివేదిక ప్రకారం. . .  
గర్వా జిల్లా లోని మాన్పుర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల నుంచి హిందూ విద్యార్థులను (దిలీప్ కుమార్, పంకజ్ కుమార్, III తరగతికి చెందిన రాణి, క్లాస్ IIకి

చెందిన అమృత కుమారి మరియు క్లాస్ Iకి చెందిన నేహా కుమారి )తొలగించడం తో పాటు, ఆ స్కూల్లో ఇకపై హిందువులను చేర్చుకోవడం జరగని ప్రిన్సిపాల్ చేసిన ప్రకటన రాజ్యాంగ విరుద్ధం అన్నారు. దీనికి కారణం ఆ ఊళ్ళో అధిక శాతం ముస్లిం లు నివాసం ఉన్నందున అది ముస్లిం స్కూల్ గానే కొనసాగిస్తామని, హిందువులను చేర్చుకోమన్నారు. ఇది జరిగి

నాలుగేళ్లు అవుతుందన్నారు. 
అదీకాక ఉన్న హిందూ విద్యార్థులను అర్ధాంతరంగా టీసీ ఇచ్చి పంపేశారన్నారు. వీరికి వచ్చిన ప్రభుత్వ ఉపకార వేతనాన్ని కూడా స్కూల్లో మరమ్మత్తుల కోసం వాడేశారన్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు దినసరి పని చేసుకునేవారన్నారు. గతిలేని స్థితిలో దూరంగా ఉన్న వేరే స్కూల్లో చేరడం జరిగిందన్నారు.
   

 ఆ గ్రామంలో ముస్లిం జనాభా 90 శాతానికి పైగా ఉన్నందున ఇక్కడి పాఠశాలల్లో ముస్లింలను మాత్రమే చేర్పిస్తామని యాజమాన్య కమిటీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
 
జై శ్రీరామ్ అన్న కాలేజ్ విద్యార్థుల పై వేటు. .

అదే విధంగా ఇదే రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో సాయంత్రం వేళా జై శ్రీరామ్

మరియు భారత్ మాతా జై  అని నినాదం చేసినందుకు ఇద్దరు హిందూ మెరిట్  విద్యార్థులను సస్పెండ్ చెయ్యడం దారుణమన్నారు. వివరాల్లోకి వెళితే. .

హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం . . 

జార్ఖండ్‌లోని ప్రభుత్వ జగన్నాథ్‌పూర్ పాలిటెక్నిక్ కళాశాలలోని మేడ పై ఖాళీ ప్రాంతంలో విద్యార్థులు హిందూ

నూతన సంవత్సరం మొదటి రోజున ‘నవ సంవత్సరం’ జరుపుకోవడానికి ఒకచోట చేరడంతో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్బంగా విద్యార్థులు  ‘జై శ్రీరామ్ మరియు భారత్ మాతా జై ’ నినాదాలు చేసినందుకు అమృత్ మరియు ఘనశ్యాంను  ఇద్దరు విద్యార్థులను ఆ ప్రభుత్వ కళాశాల డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసినట్టు

తెలిపింది. 

ఈ నినాదాలు ఇతర వర్గాల విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తుందని వీళ్ళని సస్పెండ్ చేసినట్లు తెలిపిండిఅన్నారు. వీటిలో అమృత్ కాలేజీ టాపర్ అని,  అత్యుత్తమ విద్యార్థి అని కూడా ఆ పత్రిక తెలిపిందన్నారు.  ఈ ఘటన ఏప్రిల్ 2, 2022 (శనివారం) తేదీన ప్రచురితమైందన్నారు. 

ఈ వేడుకల్లో పాల్గొన్న మిగిలిన

విద్యార్థుల్లో మరొకరిని నిలిపివేశారని, శిక్ష రూపంలో దాదాపు 500 మంది హిందూ విద్యార్థులకు ఆహారం కూడా నిలిపివేశారని పత్రిక ప్రచురించిందన్నారు.  

ఇదే ఝార్ఖండ్ లో ప్రభుత్వ విద్యా నిబంధనలను తుంగలోకి తొక్కుతూ ఆదివారం సెలవు ను శుక్రవారం కు మారుస్తూ ఒక స్కూల్ నిర్ణయం తీసుకోవడం ఈ దేశంలో విధానాలను అవమానించే

విధంగా ఉన్నాయన్నారు.  

ఈ తరహా ఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam