DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరణ మృదంగం మ్రోగిన చోటే వేదయాత్ర చేసిన వారు చిన్న జీయర్ స్వామి

*ప్రపంచానికి రక్ష కల్పించే శక్తి వేద మాతకు మాత్రమే ఉందని నిరూపించారు*

*వేద దివస్ విజయోత్సవ సభలో త్రిదండి దేవనాథ జీయర్ స్వామి వెల్లడి*

*ధర్మ ప్రచారం కోసం డిఎన్ఎస్ మీడియా బృందానికి స్వామిజి అభినందన*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 25, 2022 (డిఎన్ఎస్):*

మరణ మృదంగాలు మ్రోగిన పంజాబ్, నేపాల్ లాంటి ప్రాంతాల్లో అత్యంత భయానక సమయంలో అక్కడ శాంతి నెలకొల్పేందుకు వేదపారాయణం చేస్తూ పాదయాత్ర చేసిన మహనీయులు అపర రామానుజులు  త్రిదండి చిన్న జీయర్ స్వామి వారేనని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి వెల్లడించారు. విశాఖపట్నంలోని దువ్వాడ దగ్గరలోని సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ వేదపాఠశాల

లో జరుగుతున్న వేద దివస్ విజయోత్సవ వేడుకల్లో దేవనాథ జీయర్ స్వామి ముఖ్య అతిధిగా విచ్చేసి, వేదవిద్యార్థులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు, వేదవిద్యను నిరంతరం కొనసాగించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్న ధార్మిక బంధువులకు మంగళశాససములు అందించారు. ఈ సందర్బంగా స్వామి జి మాట్లాడుతూ  అత్యంత పోటాపోటీగా ఆధునిక లౌకిక విద్య

కోసం ఎదురు లక్షలు చెల్లించి మరీ స్కూళ్ళు, కాలేజీల్లో చేరుతున్న ప్రస్తుత సమాజం ఉన్న తరుణంలో వేదవిద్యను చిన్నారులకు అందించాలి అనే సంకల్పంతో, ఎంతో శ్రమకోడ్చి వేదవిద్యాలయాన్ని నిర్వహిస్తున్న మావళ్లపల్లి మాధవ శర్మకు మాధవుడే ధార్మికుల రూపంలో వెంట  నిలుస్తున్నాడు అన్నారు. 

వేదవిద్యను వాడవాడలా

వినిపించేలా పెద్ద సంఖ్యలో విద్యార్థులను తీర్చిదిద్దాలి అనే సంకల్పం ఎంతోఉన్నతమైనదన్నారు. దీనికోసం భారత దేశ యాత్ర చేస్తూ. .వేదపారాయణం చెయ్యడం అభినందనీయమన్నారు. భారత దేశ మకుటాయమానమైన కాశ్మీర దేశంలో ప్రస్తుత పరిస్థితులు భయం కొలిపే విధంగా ఉన్న తరుణంలో ఎంతో రిస్క్ చేసి కాశ్మీర్ లోని  శ్రీనగర్, సింధు నదీ తీరంలో

వేదాదివస్ ను దీనిలో భాగంగానే ఈ నెల 4 వ తేదీన వైభవంగా నిర్వహించారన్నారు. ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని, వేదవిద్య వ్యాప్తికోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి వేదమాత మంచి వైభవాన్ని అనుగ్రహించాలి అని ఆశీస్సులు అందించారు. 

వేదప్రచారం కోసం చిన్న జీయర్ స్వామి సాహసోపేత యాత్రలు:.

.

వేద ధర్మ ప్రచారం కోసం అపరరామానుజులు, పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న జీయర్ స్వామి ఎంతో సాహసోపేతమైన యాత్రలు చేసినట్టు దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు. 1980 తొలినాళ్ళల్లో భారత్ లోని పంజాబ్ రాష్ట్రం అశాంతి నెలకొని అల్లకల్లోలంగా ఉండి మరణమృదంగాలు మ్రోగుతున్న సమయంలో చిన్న జీయర్ స్వామి తమ

వేదవిద్యార్థులతో  పంజాబ్ లో శాంతికోసం పాదయాత్రలు చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వం వారించినప్పడికి, ససేమిరా అనడంతో సైనికుల రక్షణ కల్పిస్తామని అది కూడా తమకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లో మాత్రమే అన్నారు. తమకు రక్షణే అవసరం లేదని, తమకు కేవలం వేదమాతే అండగా ఉంటుందని స్వామిజి తెలియచేసారు. అమృత్ సర్ ప్రాంతంలో రోడ్డలపై

ప్రజలు తిరిగే పరిస్థితి లేని సమయంలో చిన్న వేదవిద్యార్ధులతో కలిసి చిన్న జీయర్ స్వామి పంజాబ్ వీధుల్లో పాదయాత్ర చేస్తుంటే ఎందరిలోనో మార్పు కల్గించిందన్నారు. 

అదే విధంగా 1990 ల్లో నేపాల్ దేశంలో జరిగిన మారణకాండ అనంతరం ఆ దేశంలో చిన్న జీయర్ స్వామి  108 రోజుల పాటు శ్రీరామాయణ పారాయణ నిర్వహించారన్నారు. మొదటి రోజు

ప్రతిష్ఠా చేసిన అగ్ని ని 108 వ రోజు మహాపూర్ణాహుతి జరిగే వరకూ రక్షించుకుంటూ శాంతికోసం మహోన్నత వేద, వైదిక ఉద్యమం నిర్వహించారన్నారు. తదుపరి కాలంలో ఆయా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. ఈ నేపాల్ రామాయణ యాత్ర లో తాము కూడా ఒక వాలంటీర్ గా పాల్గొన్నట్టు దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు.  

వేద ప్రచారం

కోసం చిన్న జీయర్ స్వామి విశాఖ నగరంలో వారిజ ( బీచ్ రోడ్), విజయవాడ ప్రాంతం లో  సీతానగరం విజయకీలాద్రి వద్ద, జగ్గయ్యపేట, సోమశిల, భాగ్యనగరం లో జీవ దివ్యసాకేతం, బదరీనాధ్, హృషీకేశ్, భద్రాచలం, మేల్కొటే, శ్రీపెరుంబుదూర్  తిరుమల, పాండుకేశ్వర్, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో వేదపాఠశాలలు నెలకొల్పి వేలాదిమంది విద్యార్థులను

క్రమశిక్షణ కల్గిన పండితులుగా తయారుచేస్తున్నారన్నారు. 
  
అనంతరం వేద దివస్ లోను, వేద ప్రచారం కోసం భారత యాత్ర లోను పాల్గొన్న పండితులకు, ఆశ్రమ నిర్వాహకులకు పురస్కారాన్ని అందించారు. 

అంతకు ముందు సప్తఋషి వేదపాఠశాల ప్రాంగణం లో జరుగుతున్న విద్యాభ్యాసం విధానం, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల వసతి, భోజన

ఏర్పాట్లు, గోశాల, తదితర ప్రాంతాలను దేవనాథ జీయర్ స్వామి పరిశీలించారు. గోశాలలో గోవులకు పళ్ళు, గడ్డి, అందించి, నిర్వాహకులను అభినందించారు. 

ధర్మ ప్రచారం కోసం డిఎన్ఎస్ మీడియా కు అభినందన :  

వేద దివస్ విజయోత్సవ సందర్బంగా హిందూ ధర్మ ప్రచారం కోసం పూర్తి కాలం వెచ్చించి, నిరంతరం మీడియా ల్లో ప్రచారం

చేస్తున్న డిఎన్ఎస్ మీడియా సంస్థ సేవలను దేవనాథ జీయర్ స్వామి అభినందించారు. పోటీ ప్రపంచంలో ధనార్జన, టిఆర్ పి రేటింగ్ ల కోసం పోటీ పడుతూ, తప్పుడు అడుగులు వేస్తున్న మీడియా సంస్థలున్న ప్రస్తుత కాలంలో హిందూ ధర్మ ప్రచారం కోసం ఒక మీడియా సంస్థ తమ సిబ్బంది తో కలిసి విస్తృత ప్రచారం చెయ్యడం అభినందనీయమన్నారు. ఈ బృందానికి మరింత

ఉజ్వల భవిష్యత్ లభించాలి అని మంగళాశాసనం అందించారు.  

ఈ వేద దివస్ విజయోత్సవ సభలో విద్యార్థులు, అధ్యాపకులు, ధార్మిక బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam