DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చారిత్రక ఆలయాల జీర్ణోద్ధరణ పై దృష్టి పెట్టండి, దేవనాథ జీయర్ స్వామి పిలుపు

*పురాతన ఆలయాల పర్యటనలో ఆడారి కిషోర్ కు జీయర్ స్వామి సూచన*

*బదరి నారాయణ గుళ్లోని మూల విరాట్ ఎవరో కూడా అర్చకునికి తెలియని స్థితి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  06, 2022 (డిఎన్ఎస్):* అత్యంత పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత కల్గిన పురాతన హిందూ దేవాలయాలను

పరిరక్షించే విధంగా కార్యాచరణ చేయవలసిందిగా పరమహంస  పరివ్రాజకులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పిలుపు నిచ్చారు. విశాఖ బీచ్ రోడ్ లోని వారిజ ఆశ్రమం (చిన్న జీయర్  స్వామి వారి నిర్వహణలో వేద పాఠశాల ) లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న దేవనాథ జీయర్ స్వామి ప్రతి రోజు దేవాలయాలు, విద్యాలయాలను సందర్శిస్తున్నారు. ఈ

పర్యటనలో జీయర్ స్వామి తమ వెంట సమైక్య ఉద్యమ యువజన సంఘాల ప్రతినిధి, స్వచ్ఛ్ భారత్ రికార్డ్ గ్రహీత ఆడారి కిషోర్ కుమార్ ను తీసుకుని వెళ్లారు. ఈ ప్రాంతంలో ఆలయాల పరిరక్షణపై దృష్టి పెట్టాలని, వాటికి పునర్వైభవాన్ని కల్పించే విధంగా సంబంధిత అధికారులతో చర్చించవలసిందిగా సూచించారు. ఆలయాల్లో అర్చకులతో పాటు గా, ఇతర సిబ్బంది

కూడా స్వామి పట్ల భక్తి శ్రద్దలతో విధులు నిర్వహిస్తే ఆలయాలు వైభవంగా వెలుగొందుతాయన్నారు. దీనికి  భక్తుల సహకారం కూడా అవసరం అన్నారు.  

ఆదరణ కు నోచుకోని నారాయణీయ ఆలయం : 

దీనిలో భాగంగా విశాఖ శివారు ప్రాంతంలోని గుడిలోవ లోగల శ్రీరంగనాధ స్వామి దేవాలయం, శ్రీ నరనారాయణ ( బదరి నారాయణ) స్వామి దేవాలయాలను

సందర్శించారు. ఈ రెండు దేవాలయాలు దేవాదాయ శాఖా పరిధి లోనివి కావడం గమనార్హం.  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయం కు అనుబంధంగా ఉన్న ఈ రెండు దేవాలయాలు అత్యంత పురాతనమైనవి కాగా, ఏ మాత్రం ప్రాచుర్యానికి నోచుకోలేదు. పైగా ఆలయంలో పారిశుధ్యం ఏమాత్రం లేకపోవడంతో స్వామి ఆవేదన చెందారు. 

ఆలయం జనజీవన స్రవంతికి

దూరంగా ఉండడంతో అర్చకుడు సైతం రోజులో ఒక టైం లో వచ్చి దీపారాధన చేసి వెళ్లిపోతుండడం గమనార్హం. అర్చకుని కోసం స్వామి చాల సమయం వేచి ఉండవలసి వచ్చింది. 

అంతరాలయంలోనికి అర్చకుడు వెళ్ళడానికే ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం చూసిన జీయర్ స్వామి కనీసం ఆలయంలోని ఆరాధన ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు కదా అని స్థానిక

అర్చకుని ప్రశ్నించగా. . దేవాదాయ శాఖా పరిధిలో ఉందని, తాము ఏమి చేయలేమని చెప్పడం గమనార్హం. అసలు ఈ ఆలయంలో ఉన్న మూలవిరాట్ పెరుమాళ్ ఎవరో కూడా అర్చకునికి తెలియని పరిస్థితి నెలకొంది. స్వామికి హారతి ఇచ్చిన సమయంలో జీయర్ స్వామి ఆలయం లో కొలువైనది నర నారాయణులని, ఈ ఆలయం బదరి నారాయణ స్వామి ఆలయం అని, ఇది విశాఖ ప్రాంతానికే ఎంతో

ప్రాధాన్యమైనదన్నారు. 

*ఆలయాల పునర్వైభవం కోసం అధికారులను సంప్రదిస్తాం: ఆడారి కిషోర్*    

ఎంతో ప్రాధాన్యత కల్గిన హిందూ దేవాలయాల ఆలనా పాలనా చూడవలసిన దేవాదాయ శాఖా ఏమాత్రం వీటిపై దృష్టి పెట్టినట్టుగా కనపడడం లేదని, తక్షణం పునర్వైభవం కోసం సంబంధిత అధికారులను సంప్రదిస్తామని ఆడారి కిషోర్ కుమార్

స్వామిజి కి తెలియచేసారు. హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న జీయర్ స్వామి వెంట ఆలయాల దర్శనం చేసుకోవడం తమ పూర్వ జన్మ సుకృతమని కిషోర్ తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam