DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ దేవాదాయ శాఖకు సలహాదారుగా జ్వాలాపురం నియామకం

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, ఆగస్టు  06, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురం  శ్రీకాంత్ నియమితులయ్యారు. ఉత్తరాంధ్ర కు చెందిన ఓ పీఠాధిపతి ఆశీస్సులతోనే అతనికి ఈ పదవి దక్కిందని సమాచారం. ప్రభుత్వ పెద్దలను సైతం తన వద్దకు రప్పించుకునే ఓ స్వామీజీ నుంచి ఆశీస్సులు ఉన్న వ్యక్తికి

దేవాదాయ శాఖ సలహాదారుగా పదవి వరించింది. అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ ను  దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు. ఈ సమాఖ్యలో ఉండే ముగ్గురు విడిపోయి దీన్ని మూడు ముక్కలు చేశారు.

ఎవరికి వారు తమని అధ్యక్షులుగా ప్రకటించుకున్నారు. వారిలో శ్రీకాంత్ కూడా ఒకరు.

 ప్రభుత్వాన్ని దేవాదాయశాఖను శాసిస్తున్న ఓ స్వామీజీకి ఈయన చాలా కాలంగా ముఖ్యమైన శిష్యుడిగా ఉన్నారు. గతంలో ఆ స్వామీజీ నీ అనంతపురానికి ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సిఫార్సు ద్వారా మొదట టీటీడీ బోర్డు సభ్యుని

పదవి కోసం ప్రయత్నించారని తెలిసింది. ఆ అవకాశం రాకపోవడంతో సలహాదారు దృష్టిపెట్టారు. చాలా కాలంగా ఈ లెటర్ పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి దేవాదాయ శాఖ సలహాదారు పోస్టు ప్రత్యేకంగా లేదని, దానికి విధులు, బాధ్యతలు వంటివి తెలిపే ఉత్తర్వులూ లేవని, దీన్నిరాజకీయ పునరావాసం గానే

పరిగణించాలి అని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

వార్షిక ఆదాయం 5 లక్షలు దాటిన ఆలయాల నుంచి దేవాదాయ పరిపాలన నిధి  (ఈఏఎఫ్) కింద 8శాతం వసూలు చేస్తారు. వీటి నుంచి శ్రీకాంత్ కు జీతం, ఇతర భత్యాలు కలిపి నెలకు రూ. లక్షన్నరకు పైగా ఇస్తారని అధికారులు చెబుతున్నారు.

  ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు

సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. ప్రభుత్వ సలహాదారు (ఇండస్ట్రియల్ ప్రమోషన్) క్రిష్ణ జి.వి. గిరితో పాటు, ఐ టీ (సాంకేతిక) సలహాదారులు దేవిరెడ్డి శ్రీనాథ్, జె. విద్యాసాగర్ రెడ్డిల పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జూలై 29న ఉత్తర్వులు జారీ చేసింది ఆన్లైన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam