DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లక్షలాది స్వాతంత్ర్య వీరుల త్యాగ స్ఫూర్తి భారత జాతీయ పతాకం: ఆడారి కిషోర్

*ఆడారి కిషోర్ కార్యాలయం లో ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  10, 2022 (డిఎన్ఎస్):* భారత జాతీయ పతాకం లక్షలాది మంది స్వాతంత్ర్య పోరాట వీరుల  త్యాగాల ఫలితంగా ఈరోజు వారి త్యాగాలను నేటి తరాలకు తెలియచేస్తోందని స్వచ్ఛ్ భారత్ రికార్డ్

గ్రహీత, సమైక్య ఆంధ్ర ఉద్యమ కారులు, ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమం లో భాగంగా బుధవారం ఆడారి కిషోర్ కుమార్ తన కార్యాలయంలో జాతీయ జండాను ఎగుర వేశారు. ఈ వేడుకల్లో కార్యాలయ సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.  



సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ నెల ఆగష్టు 15, 2022 నాటి మన భారత దేశానికీ స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున నాటి పోరాట యోధులందరికి ఘన నివాళి అర్పించవలసిన భాద్యత మన అందరిపై ఉందన్నారు. త్రివర్ణ జాతీయ పతాకం చేత పట్టుకుంటేనే ఎంతో  ఉత్తేజం కలుగుతుందన్నారు.   

మన స్వతంత్ర పోరాట సంగ్రామం లో

అశువులు బారిన వ్యక్తులకు నివాళు లు అర్పించవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ జెండా రూపకర్త  అయినా పింగళి వెంకయ్య మన తెలుగు వ్యక్తిని కూడా స్మరణం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుగు దేశం పార్టీ నాయకులూ యువరాజ సంఘాల జేఏసీ నేత ఆడారి కిషోర్ కుమార్ తన కార్యాలయం లో జాతీయ జెండా ను ఎగరవేసి పోరాటయోధులను

కొనియాడారు.

స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు అల్లూరి  సీతారామ రాజు, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల గంగాధర్ తిలక్, లాల లజపతి రామ్, రాణి లక్ష్మి బాయ్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహురు లాంటి వ్యక్తులతో పాటు చరిత్ర లో పేర్లు కూడా నమోదు కానీ చాల మంది వ్యక్తులు యొక్క త్యాగాలు వాళ్ళ

మాత్రమే స్వరాజ్యం సిద్దించింది అని ఆద్రి కిషోర్ కుమార్ అన్నారు.

స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జాతీయ జెండా పండుగే నిర్వహించడం కాకుండా కేంద్ర ప్రభుత్వం మన దేశం లో అసమానులు లేని స్వరాజ్యం పై దృష్టి పెట్టాలని కులమత వర్గ వర్ణ విబేధాలు లేని సమాజం కోసం నడుం బిగించాలని ముఖ్యంగా యువత మన చరిత్ర కారులను స్మరణం

చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేవలం సమాజానికి మాధ్యమంలో ట్రోలింగ్స్ కాకుండా వ్యక్తి గతంలో  కుటుంభం మరియు మిత్రులతో వారి యొక్క పోరాట పటిమ గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే ప్రస్తుత యువతకు, విద్యార్థులకు, మరియు మహిళలకు ఆర్ధిక స్వావలంబన వచ్చే విధముగా పరిశ్రమలు వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర

ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఉచితాలు ఇవ్వడం ద్వారా దేశ ప్రగతి కుంటుపడి మానవ వనరులు వినియోగం వారి యొక్క ప్రతిభ సన్నగిల్లే అవకాశం ఉంది కనుక 100 సంవత్సరాలు వేడుకలు జరుపుకునే  సమయానికి భారత దేశం ఆర్ధిక ప్రగతితో స్వతంత్రం వేడుకలు జరుపుకునే  సమయానికి భారత దేశం ఆర్ధిక ప్రగతితో పాటు వ్యవసాయానికి పేద పీట వేయాలని

ఆడారి కిషోర్ కుమార్ అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam