DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 12 నే బ్రహ్మచారులు ఉపాకర్మ చేసుకోవాలి:మురళీకృష్ణమాచార్యులు  

*ఆటంకం వస్తే. .భాద్రపదం లో జరపాలి: యాజ్ఞిక పీఠం జూమ్ శిబిరం లో వెల్లడి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  11, 2022 (డిఎన్ఎస్):* యజ్ఞోపవీధారి అయిన బ్రహ్మచారులు, గృహస్థులు కూడా ఉపకర్మ ప్రక్రియను ఈ నెల 12 నే తప్పనిసరిగా ఆచరించాలని భద్రాచలం శ్రీ సీతామచంద్ర స్వామి దేవస్థానం

వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు సూచించారు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్న ప్రముఖ వేద, స్మార్త పాఠశాల యాజ్ఞిక పీఠం నిర్వహించిన జూమ్ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాకర్మ విధి విధానాలను విద్యార్థులకు వివరించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ

ఉపనయనం పూర్తి చేసుకున్న బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుందన్నారు. కామో కార్షీ మంత్రం, గాయత్రీ మంత్రం జపం చేయడం, హోమ ప్రక్రియ చేయడం ద్వారా ఉపాకర్మ క్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ఉపాకర్మ అంటే. . .

సనాతన వైదిక హిందూ సంప్రదాయంలో వేదవిద్యార్థులు కొత్తగా

ప్రారంభించే వేద విద్య అధ్యయనాన్ని ఈ రోజు ఆరంభించడం ఆనవాయితి గా వస్తోందన్నారు.  అదే విధంగా లౌకిక సాంకేతిక విద్యను అభ్యసించేవారు కూడా ఈ ఉపకారమా జరుపుకున్న తదుపరి వారి  విద్య విధానాన్ని ఆరంభించవచ్చు అన్నారు. 

ఒక్కో వేద సంప్రదాయం వారు ఒక్కో రోజున ఉపాకర్మ ను ఆచరించడం జరుగుతుందన్నారు. శ్రావణ మాసంలో

శ్రవణ నక్షత్రం రోజున ఋగ్వేద సంప్రదాయం వారు ఉపాకర్మ ఆచరిస్తారన్నారు. అదేవిధంగా యజుర్వేద సంప్రదాయం వారు శ్రావణ మాసం లో పౌర్ణమి రోజున,  హస్త నక్షత్ర తృతీయ నాడు శ్రావణ అమావాస్య తర్వాత రోజున సామ వేద ఉపాకర్మను పాటిస్తారు. అయితే వీటికి నిర్దుష్ట సమయ పరిమాణం కూడా ఉంది. 

ఋగ్వేద ఉపాకర్మ: శ్రావణ మాసం లో సూర్యోదయం

నుండి మధ్యాహ్నం వరకు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఉపాకర్మ ను చేయాలి. అయితే సూర్యోదయ సమయంలో ఉత్తర ఆషాఢ నక్షత్రం ఉండకూడదు.

సామవేద ఉపాకర్మ: భాద్రపద శుక్లపక్షంలో హస్తా నక్షత్రం నాడు ఉపాకర్మ ను చేయాలి.

కృష్ణ యజుర్వేదం: తైత్తిరీయులు మరియు మైత్రాయనిలు శ్రావిష్ట, ధనిష్ఠ, శ్రావణ మాసంలో పూర్ణిమ యుక్త

ప్రతిపాద (ప్రతిపత్) సూర్యోదయ సమయంలో ఉపాకర్మ ను నాడు చేయాలి.

శుక్ల యజుర్వేదం: అనగా పూర్ణిమ రోజు సాయంత్రం వరకు పూర్ణిమ ఉన్నట్లయితే వాజసనేయి కణ్వ మరియు మధ్యందినలు చేస్తారు. కానీ పునిమ మరియు ప్రతిపద రెండూ మరుసటి రోజు (పరా విద్ధ) ఉన్నట్లయితే, వారు చతుర్దశి రోజులో ఉండి, మధ్యాహ్న తర్వాత పూర్ణిమ వచ్చినప్పుడు

(పూర్వ విద్ధ) ముందు రోజు చేయాలి. ప్రతిపత్ లేదా స్థూలంగా చెప్పాలంటే, వారు కృష్ణ పక్షం చేరుకునే ముందు ఉపాకర్మను పూర్తి చేయాలి కానీ పూర్ణిమ ఉత్తర ఆషాఢ నక్షత్రం ఉన్నట్లయితే వారు ఉపకర్మను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు.

అథర్వవేదం: సూర్యోదయ సమయంలో పూర్ణిమ వచ్చే రోజున ఉపాకర్మ ను చేస్తారు. 

అధికశాతం

మంది శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీత ధారణ చేసి, ఉపాకర్మను ఆచరించడం జరుగుతుందని, ఎవరికైనా ఈ రోజున ఆటంకం కలిగితే వచ్చే నెల భద్రపదమాసం లోని పౌర్ణమి రోజున ప్రాయశ్చితం చేసుకుని ఉపాకర్మ ను నిర్వహించాలి తప్ప అస్సలు మానివేయరాదన్నారు. 

శ్రీవైష్ణవ, రామానుజ సంప్రదాయ ప్రచారం లో తనవంతు కృషి చేస్తున్న

యాజ్ఞికపీఠం పాఠశాల నిర్వాహకులు పిటిజి కిశోర్ స్వామిని ఆయన అభినందించారు. ఈ శిబిరంలో  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన  సుమారు  80  మంది విద్యార్థులు, గృహస్తులు పాల్గొన్నారు. వీరందరికి మూడు రోజుల పాటు జరిగిన శిబిరంలో ఉపాకర్మ ఆచరించుకునే విధి విధానాలను, మంత్రాన్ని తెలియచేసారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam