DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*సకల విద్యా ప్రదాత హయగ్రీవుడే, త్రిదండి దేవనాథ జీయర్ స్వామి* 

*చిన్న జీయర్ స్వామి వారి వారిజ లో వైభవంగా హయగ్రీవ జయంతి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  11, 2022 (డిఎన్ఎస్):* సకల విద్యా ప్రదాయ హయగ్రీవుడేనని పరమహంస పరివ్రాజకులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పిలుపు నిచ్చారు. విశాఖ బీచ్ రోడ్ లోని వారిజ ఆశ్రమం (చిన్న జీయర్  స్వామి

వారి నిర్వహణలో వేద పాఠశాల ) లో గురువారం హయగ్రీవ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. వారిజ లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న దేవనాథ జీయర్ స్వామి హయగ్రీవ వైభవాన్ని, వైశిష్ట్యాన్ని వివరించారు. 

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యమైన హయగ్రీవ జయంతి అన్నారు. హిందూమతంలో, హయగ్రీవ స్వామిని కూడా

సాక్షాత్తు విష్ణు అంశం అన్నారు. హయగ్రీవున్ని జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల దేవుడుగా కూడా పూజిస్తారన్నారు. లక్ష్మి హయగ్రీవ మందిరంలో స్వామికి విశేష అభిషేకం, అలంకారం తదుపరి ప్రత్యేక ఆరాధనలు చేపట్టారు. వేదవిద్యార్థులు వేదపఠనం నిర్వహించారు.

ఇదే ప్రాంగణంలో గతనెల 30 నుంచి జరుగుతున్నా శ్రీ లక్ష్మి యాగంలో నిత్యా పూర్ణాహుతి వేదమంత్రాలతో జరిపారు. 

హయగ్రీవావతారం చరిత్ర: . . .

పూర్వం గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు.

అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం ( గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. శ్రీ

మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది

వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి

అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా

జరపడం కనిపిస్తుంది.

రూపం

హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి.

ఏడమ చేతిలో పుస్తకము ఉంటుంది

ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీ లక్ష్మి హయగ్రీవ ఆలయం ఉన్నది కేవలం వారిజ ఆశ్రమంలోనే కావడం గమనార్హం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam