DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జివిఎంసి కార్పొరేటర్ల ఉత్తరాది స్టడీ టూర్ లో అవాంతరం, అంతా క్షేమం 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  20, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాది రాష్ట్రాల స్టడీ టూర్ కు వెళ్లిన గ్రేటర్ విశాఖపట్నం 
మునిసిపల్ కార్పొరేటర్ల పర్యటనలో చిన్నపాటి అవాంతరం ఏర్పడింది. కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు ఘాట్ రోడ్ పై విరిగిపడి పడడంతో వీళ్ళు

ప్రయాణిస్తున్న బస్సులో  ఘాట్ మధ్యలో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న కార్పొరేటర్లు అందరూ క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్న విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగడం తో అప్పడి నుంచి రోడ్ పై బస్ ల

లోనే ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది, వర్షం పడుతుండడం తో రోడ్ క్లియర్ చేసేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ బసుతో పాటు ఇతర వాహనాలు కూడా భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ ఘటన చండీగఢ్ కు 240 కిలోమీటర్ల దూరం లో మింద్ ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది. శుక్రవారం కులు మునిసిపాలిటీ లోనే పలు ప్రాంతాలను

సందర్శించారు. ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలి ని దర్శించిన కార్పొరేటర్లు

ఈ బృందంతోపాటు డిప్యూటీ మేయర్ జీయ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్లు బాణాల శ్రీనువాసరావు కూడా ప్రయాణిస్తున్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam